Jump to content

అనిల్ కుమార్

వికీపీడియా నుండి
అనిల్ కుమార్
అనిల్ కుమార్

పదవీ కాలం
2005 – 2015

నియోజకవర్గం తికారి
పదవీ కాలం
2020 – 2026

వ్యక్తిగత వివరాలు

జననం 1960 ఆగస్టు 2
జెహానాబాద్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ హిందుస్తానీ అవామ్ మోర్చా
జీవిత భాగస్వామి మీనా సింగ్
సంతానం 1 కొడుకు, 1 కూతురు
నివాసం పాట్నా, బీహార్
పూర్వ విద్యార్థి మగధ విశ్వవిద్యాలయం (PHD)
వృత్తి రాజకీయ నాయకుడు

అనిల్ కుమార్ (జననం 1960) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు తికారి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

అనిల్ కుమార్ లోక్ జనశక్తి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2005 (ఫిబ్రవరి) శాసనసభ ఎన్నికలలో కొంచ్ శాసనసభ నియోజకవర్గం నుండి లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ పార్టీ అభ్యర్థి మహేష్ సింగ్‌పై 5,543 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2005 (అక్టోబరు) శాసనసభ ఎన్నికలలో జేడీ (యు) పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ పార్టీ అభ్యర్థి షియోబాచన్ యాదవ్‌పై 3,398 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

అనిల్ కుమార్ 2010 శాసనసభ ఎన్నికలలో తికారి శాసనసభ నియోజకవర్గం నుండి జేడీ (యు) పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ పార్టీ అభ్యర్థి బాగి కుమార్ వర్మపై 18,541 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2015 శాసనసభ ఎన్నికలలో హిందూస్థానీ అవామ్ మోర్చా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థిజేడీ (యు) అభ్యర్థి అభయ్ కుమార్ సిన్హా చేతిలో 31,813 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

అనిల్ కుమార్ 2020 శాసనసభ ఎన్నికలలో తికారి శాసనసభ నియోజకవర్గం నుండి హెచ్ఏఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ పార్టీ అభ్యర్థి సుమంత్ కుమార్‌పై 2630 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2025 శాసనసభ ఎన్నికలలో హెచ్ఏఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ అభ్యర్థి 2630 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. "Tikari Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 22 November 2025. Retrieved 22 November 2025.
  2. "2025 Bihar Legislative Assembly Election Result: Tikari" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 22 November 2025. Retrieved 22 November 2025.