అనిల్ కుర్మాచలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిల్ కుర్మాచలం
అనిల్ కుర్మాచలం


చైర్మన్
తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ అభివృద్ధి సంస్థ
పదవీ కాలం
2022 జూన్ 21 – 03 డిసెంబర్ 2023
ముందు పుష్కర్ రామ్మోహన్ రావు
తరువాత ఎన్. గిరిధర్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1979 మార్చి 8
రామ్‌న‌గ‌ర్‌, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి లతా కుర్మాచ‌లం
సంతానం నిత్య కుర్మాచ‌లం[1]
నివాసం హైదరాబాద్
కరీంనగర్
పూర్వ విద్యార్థి ఎమ్మెస్సీ కంప్యూట‌ర్ సైన్స్
వృత్తి ఐటీ క‌న్స‌ల్టెంట్‌, రాజకీయ నాయకుడు

అనిల్ కుర్మాచ‌లం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. ఆయన 2022 జూన్ 21[2] నుండి 03 డిసెంబర్ 2023 వరకు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా భాద్యతలు నిర్వహించాడు.[3][4][5]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అనిల్ కుర్మాచలం 1979 మార్చి 8న తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, కరీంనగర్ పట్టణంలోని రామ్‌న‌గ‌ర్‌ లో జన్మించాడు. ఆయన ఎమ్మెస్సీ కంప్యూట‌ర్ సైన్స్ పూర్తి చేసి లండ‌న్‌లో ఐటీ క‌న్స‌ల్టెంట్‌గా పని చేశాడు.[6]

రాజకీయ జీవితం

[మార్చు]

అనిల్ కుర్మాచలం విద్యాభాస్యం పూర్తి చేసి 2009 నుండి లండ‌న్‌లో ఐటీ క‌న్స‌ల్టెంట్‌గా పని చేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో లండ‌న్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుబంధంగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్‌ను స్థాపించి లండ‌న్‌లో తెలంగాణ వాదాన్ని పరిచయం చేశాడు. ఆయన అనంత‌రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేర‌కు మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ శాఖలను వివిధ దేశాల్లో ప్రారంభించి తెలంగాణ ఉద్యమాన్ని ఖండాంత‌రాలకు వ్యాపితం చేశాడు.[7]

టీఆర్‌ఎస్‌ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడిగా అనిల్ కుర్మాచలం ఆధ్వర్యంలో లండ‌న్‌లో 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమాలు, బతుకమ్మ, బోనాలు లాంటి తెలంగాణ సాంస్కృతిక, సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూనే తెలంగాణ ఉద్యమ సమయం నుండి నేటి వరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి,[8] రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా వేదికగా విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు.[9][10]

అనిల్ కుర్మాచలం సేవలను గుర్తించిన టీఆర్ఎస్ ప్రభుత్వం 2022 జూన్ 21న తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్స్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా[11][12] జూన్ 26న భాద్యతలు చేపట్టాడు.[13][14][15]

ఎఫ్‌డీసీ చైర్మన్‌గా

[మార్చు]
అనిల్ కుర్మాచ‌లం - చైర్మన్‌, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ అభివృద్ధి సంస్థ

మూలాలు

[మార్చు]
 1. Mana Telangana (21 May 2022). "ప్రాంతం ఏదైనా, దేశమేదైనా పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతిఒక్కరూ కుటుంబ సభ్యులే..." Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
 2. "Eenadu: చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అనిల్‌ కుర్మాచలం". Eenadu. 2022-06-21. Archived from the original on 2022-06-21. Retrieved 2022-06-21.
 3. Eenadu (4 December 2023). "ఇద్దరు ఓఎస్‌డీలు సహా పలు కార్పొరేషన్ల ఛైర్మన్‌లు రాజీనామా". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
 4. A. B. P. Desam (4 December 2023). "తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
 5. Eenadu (9 April 2023). "టీ హబ్‌ను సందర్శించిన ఎన్‌ఆర్‌ఐల బృందం". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
 6. Namasthe Telangana (21 June 2022). "ఆ రెండు కార్పొరేష‌న్ల‌ చైర్మన్లు వీరే.. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
 7. Namasthe Telangana (4 May 2021). "ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే : అనిల్ కూర్మాచ‌లం". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
 8. Andhra Jyothy (16 April 2021). "నోముల భగత్‌ను గెలిపించాలని ఎన్నారై టీఆర్ఎస్ విజ్ఞప్తి" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2021. Retrieved 22 June 2022.
 9. Mana Telangana (10 June 2020). "కెటిఆర్ లాంటి నాయకుడు మాకు కావాలి: అనిల్ కుర్మాచలం". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
 10. Sakshi (28 November 2016). "లండన్‌లో కేసీఆర్ దీక్షా దివస్". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
 11. Eenadu (21 July 2022). "తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా అనిల్‌ కుర్మాచలం". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
 12. Sakshi (22 June 2022). "రెండు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
 13. Namasthe Telangana (26 June 2022). "ఎఫ్‌డీసీ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనిల్ కుర్మాచ‌లం". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
 14. Eenadu (27 June 2022). "ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా అనిల్‌ బాధ్యతల స్వీకరణ". Archived from the original on 2 July 2022. Retrieved 2 July 2022.
 15. V6 Velugu (26 June 2022). "అనిల్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని". Archived from the original on 27 June 2022. Retrieved 27 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 16. 10TV Telugu (17 November 2022). "ఎన్టీఆర్ ఏ‌ఎన్‌ఆర్ ఇండస్ట్రీకి రెండు కళ్ళైతే.. కాంతారావు వాటి మధ్య తిలకం వంటివారు.. 'కాంతారావు' శతజయంతి వేడుకలు." Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 17. Namasthe Telangana (21 June 2023). "సినిమా, టీవీ రంగాలకు హైదరాబాద్‌ వేదికగా మారింది : మంత్రి తలసాని". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.

ఇతర లింకులు

[మార్చు]