Jump to content

అనిల్ కోహ్లీ

వికీపీడియా నుండి

 

అనిల్ కోహ్లీ, ఒక భారతీయ దంత వైద్యుడు, నిర్వాహకుడు, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మాజీ అధ్యక్షుడు. ఆయన ఇంగ్లాండులోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ డెంటల్ సర్జరీ ఫ్యాకల్టీకి ఎన్నికైన ఫెలో, ఆర్మీ డెంటల్ కార్ప్స్ 'బ్రిగేడియర్' గౌరవ హోదాను కలిగి ఉన్నాడు. ఆయన వైద్య విభాగంలో అత్యున్నత భారతీయ పురస్కారం అయిన బి. సి. రాయ్ అవార్డు అందుకున్నాడు. భారత ప్రభుత్వం 1992లో ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది, ఆ తర్వాత 2005లో వైద్యశాస్త్రంలో ఆయన చేసిన కృషికి గాను మూడవ అత్యున్నత పౌర గౌరవం పద్మభూషణ్ ప్రదానం చేసింది.[1][2]

జీవితచరిత్ర

[మార్చు]

లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన అనిల్ కోహ్లీ, అక్కడ నుండి మెడిసిన్ లో గ్రాడ్యుయేట్ డిగ్రీ, డెంటల్ సైన్సెస్ లో పోస్ట్ గ్రాడ్యుయేటు డిగ్రీని పొందాడు, తను చదువుకున్న విద్యాసంస్థ నుండి ఎస్. ఎస్. భట్నాగర్ అవార్డు అందుకున్నాడు. ఆయన బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డెంటిస్ట్రీ మాజీ డీన్, టఫ్ట్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ డెంటల్ మెడిసిన్ అనుబంధ ప్రొఫెసర్.[3] 1992లో పద్మశ్రీ పురస్కారం అందుకుని, ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి దంతవైద్యుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు సంవత్సరాల తరువాత భారత ప్రభుత్వం 2005లో అత్యున్నత పద్మ పురస్కారం పద్మభూషణ్ తో ఆయనను మళ్లీ సత్కరించింది, ఆయన అత్యున్నత భారతీయ వైద్య పురస్కారం డా. బి.సి.రాయ్ అవార్డును సైతం అందుకున్నారు. ఆయన డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు 2001 నుండి 2004 వరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు[4]

రచనలు

[మార్చు]

అనిల్ కోహ్లీ 20 సంవత్సరాలకు పైగా భారత రాష్ట్రపతులకు దంతవైద్యుడుగా పనిచేసాడు. ఆయన భారత ప్రధానమంత్రులకు దంతవైద్యుడిగా కూడా పనిచేసాడు. ఆయన ఇండియన్ జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్ ఎడిటర్-ఇన్-చీఫ్ గా, ఎండోడాంటిక్స్ ఐఎఫ్ఇఎ ప్రపంచ సంస్థలో ఆసియా ప్రతినిధిగా ఉన్నాడు. గ్లాస్గో, ఎడిన్బర్గ్, ఇంగ్లాండు మూడు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుండి ఆయన ఫెలోషిప్ లను అందుకున్నాడు. ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి 10కి పైగా గౌరవ డాక్టరేట్లను ఆయన అందుకున్నాడు.[5] డాక్టర్ అనిల్ కోహ్లీని రిచ్మండ్ రివర్ రాక్ క్యాసినో రిసార్ట్ లో 2018 అక్టోబరు 6న నోటి క్యాన్సర్ నిధుల సేకరణ కార్యక్రమంలో సత్కరించారు.[6]

వివాదాలు

[మార్చు]

2010లో ఆయనపై మీడియాలో అవినీతి ఆరోపణలు వచ్చాయి, వాటిని ఆయన ఖండించాడు.[7] తదనంతరం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోహ్లీ ఇంటిపై, కార్యాలయంపై దాడి చేసి, ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నందుకు అతనిపై కేసు నమోదు చేసింది.[8] అయితే, ఏజెన్సీ తొమ్మిది నెలల దర్యాప్తు తర్వాత ఈ కేసును మూసివేసి, కోహ్లీని ఆరోపణల నుండి నిర్దోషిగా ప్రకటించింది.[9]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 3 January 2016.
  2. "Anil Kohli on Forerunners Healthcare". Forerunners Healthcare. 2016. Retrieved 2 June 2016.
  3. Kohli (1 January 2009). Text Book of Endodontics. Elsevier India. ISBN 978-81-312-2181-5.
  4. "CBI raid on Kohli's premises opens can of worms". Indian Express. 24 September 2011. Archived from the original on 25 June 2016. Retrieved 2 June 2016.
  5. "Dr. Anil Kohli - Endodontist - Book Appointment Online, View Fees, Feedbacks | Practo". www.practo.com. Retrieved 2021-11-27.
  6. Mall, Rattan. "Dr. Anil Kohli and Dr. Malwinder Dhami honoured at oral cancer fundraising event | Indo-Canadian Voice" (in కెనడియన్ ఇంగ్లీష్). Retrieved 2021-11-27.
  7. "I am being framed". Mid-Day. 2 July 2010. Retrieved 2 June 2016.[permanent dead link]
  8. "CBI registers case against ex-Dental Council of India chief Dr Anil Kohli". India Medical Times. 27 September 2011. Retrieved 2 June 2016.
  9. "CBI files closure in DA case against ex-DCI chairman". Zee News. 19 July 2012. Retrieved 2 June 2016.