Jump to content

అనిల్ దేశ్‌ముఖ్

వికీపీడియా నుండి
అనిల్ దేశ్‌ముఖ్
అనిల్ దేశ్‌ముఖ్


పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 5 ఏప్రిల్ 2021
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు దేవేంద్ర ఫడ్నవిస్
తరువాత దిలీప్ వాల్సే పాటిల్

ఎమ్మెల్యే
కటోల్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
24 అక్టోబర్ 2019
ముందు ఆశిష్ దేశముఖ్
తరువాత చరణ్‌సింగ్ ఠాకూర్
పదవీ కాలం
మార్చి 1995 – అక్టోబర్ 2014 (నాలుగు సార్లు)
ముందు సునీల్ షిండే
తరువాత ఆశిష్ దేశ్‌ముఖ్

ఆహార & పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
అక్టోబర్ 2009 – అక్టోబర్ 2014
తరువాత శంభాజీ పాటిల్ నీలాంగేకర్

పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి
పదవీ కాలం
అక్టోబర్ 2004 – అక్టోబర్ 2009

పాఠశాల విద్య, సమాచార & పౌర సంభందాలు, క్రీడా & యువజన సర్వీసుల శాఖ మంత్రి
పదవీ కాలం
అక్టోబర్ 1999 – అక్టోబర్ 2004

విద్య, సాంస్కృతిక శాఖ మంత్రి
పదవీ కాలం
మార్చి 1995 – అక్టోబర్ 1999

వ్యక్తిగత వివరాలు

జననం (1950-05-09) 1950 మే 9 (age 74)
కటోల్, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
నివాసం నాగపూర్

అనిల్‌ వసంతరావు దేశ్‌ముఖ్‌ (జననం 9 మే 1950) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికై, 30 డిసెంబర్ 2019 నుండి 5 ఏప్రిల్ 2021 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర రాష్ట్రం, నాగ్‌పూర్ జిల్లాలోని కటోల్ సమీపంలోని వాడ్ విహిరా గ్రామంలో జన్మించాడు. ఆయన కటోల్ లో ఉన్నత విద్య పూర్తి చేసి ఆ తరువాత నాగ్‌పూర్‌లోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్‌, డాక్టర్ పంజాబ్రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్ లో అగ్రికల్చర్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

అనిల్ దేశ్‌ముఖ్నా నాగ్‌పూర్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా తన రాజకీయ జీవితం ప్రారంభించి 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కటోల్ నియోజకవర్గం నుండి  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1995లో బీజేపీ - శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో విద్య & సంస్కృతి శాఖ మంత్రిగా పని చేసి 1999లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అనిల్ 1999లో మహారాష్ట్రలో ఎన్సీపీ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో పాఠశాల విద్య, సమాచార & ప్రజా సంబంధాలు, క్రీడలు & యువజన సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.

ఇన్‌ఛార్జ్‌ మంత్రి

[మార్చు]
  • ఎక్సైజ్, ఫుడ్ & డ్రగ్స్ (2001 నుండి మార్చి 2004)
  • పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్‌టేకింగ్స్) (2004 నుండి 2008)
  • ఆహారం, పౌర సరఫరాలు & వినియోగదారుల రక్షణ (2009 -2014)

మూలాలు

[మార్చు]
  1. HMTV (5 January 2020). "మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు". Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.
  2. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2009-11-22. Retrieved 2010-09-05.{{cite web}}: CS1 maint: archived copy as title (link)