Jump to content

అనిల్ బసు

వికీపీడియా నుండి
అనిల్ బసు

పదవీ కాలం
1984-2009
ముందు బిజోయ్ కృష్ణ మోదక్
తరువాత శక్తి మోహన్ మాలిక్
నియోజకవర్గం ఆరంబాగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1946-11-07)1946 నవంబరు 7
హుగ్లీ, పశ్చిమ బెంగాల్
మరణం 2018 అక్టోబర్ 2
కోల్‌కతా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)
జీవిత భాగస్వామి సబితా బసు
సంతానం 1 కొడుకు, 1 కూతురు
నివాసం చిన్సురా , హుగ్లీ జిల్లా
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం

అనిల్ బసు (బెంగాలీ : অনিল বসু) (7 నవంబర్ 1946 - 2 అక్టోబర్ 2018) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

అనిల్ బసు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1984 లోక్‌సభ ఎన్నికలలో ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గోపాల్ దాస్ నాగ్ పై 14160 ఓట్ల గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1989, 1991, 1996, 1998, 1999 & 2004 లోక్‌సభ ఎన్నికలలో వరుసగా ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

అనిల్ బసు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో ముకుందపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 72 సంవత్సరాల వయస్సు 2018 అక్టోబర్ 2న మరణించాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Anil Basu" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. the original నుండి 20 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 July 2025.
  2. "Former MP Anil Basu suspended from CPM" (in ఇంగ్లీష్). The Indian Express. 30 April 2012. the original నుండి 20 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 July 2025.
  3. "Lok Sabha polls: CPM's Anil Basu holds record for highest victory margin". The Times of India. 3 April 2014. the original నుండి 20 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 July 2025.
  4. "চলে গেলেন রেকর্ড ভোটে জেতা সিপিএম সাংসদ অনিল বসু". Zee24Ghanta. 2 October 2018. the original నుండి 20 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 July 2025.
  5. "প্রয়াত আরামবাগের প্রাক্তন সাংসদ অনিল বসু". sangbadpratidin. 2 October 2018. the original నుండి 20 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 July 2025.
"https://te.wikipedia.org/w/index.php?title=అనిల్_బసు&oldid=4606908" నుండి వెలికితీశారు