అనిసెట్టి సుబ్బారావు
అనిసెట్టి సుబ్బారావు | |
---|---|
జననం | అక్టోబరు 23, 1922[1] |
మరణం | 1979 |
వృత్తి | తెలుగు సినిమా రచయిత , ప్రగతిశీల కవి, నాటక కర్త. |
ప్రసిద్ధి | స్వాతంత్ర్య సమరయోధుడు |
అనిసెట్టి సుబ్బారావు (1922-1981), స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా రచయిత, ప్రగతిశీల కవి, నాటక కర్త.
నాటకరంగ ప్రస్థానం[మార్చు]
1942లో నరసరావుపేటలో నవ్య కళాపరిషత్‌ను స్థాపించాడు. ఈయన రచనలలో అగ్నివీణ (1949), బిచ్చగాళ్ల పదాలు ముఖమైనవి. ఈయన నాటకాల్లో రక్తాక్షరాలు (1943), అనిశెట్టి నాటికలు (1945), గాలిమేడలు[2] (డిసెంబరు 1949), శాంతి[3] (1951), మా ఊరు (1954) చెప్పుకోదగినవి. సుబ్బారావు కొన్నాళ్ళు ప్రజాశక్తి, అభ్యుదయ పత్రికలకు సంపాదకునిగా పనిచేశాడు. 1942లో, 1944లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్ళాడు. కమ్యూనిజం వైపు ఆకర్షితుడై తన నాటకాల ద్వారా ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశాడు.
సినీరంగ ప్రస్థానం[మార్చు]
1955లో రచయితగా తెలుగు సినీరంగంలో అడుగుపెట్టాడు. సుబ్బారావు, మహాకవి శ్రీశ్రీకి బాగా సన్నిహితుడు. సుబ్బారావు మరణించిన తర్వాత మద్రాసులోని సంతాప సభలో శ్రీశ్రీ 'నాకు అనిశెట్టి, ఆరుద్ర అ-ఆ’ లాంటివారు. అ-పోయింది. ఆ- మిగిలింది’ అని చెప్పి క్లుప్తంగా తమ అనుబంధాన్ని తెలిపి ముగించాడు.[4]
అనిసెట్టి పుట్టింది ఆగర్భ శ్రీమంతుల ఇంట్లోనే గాని అతడు తన చుట్టూ వున్న ఆగర్భ దరిద్రుల ఆర్తనాదాలనే విన్నాడు. తండ్రి కోటి లింగం కోటికి పడగెత్తగల శ్రీమంతులు. నరసరావుపేటలోనూ, చిలకలూరిపేటలోనూ ఆయిల్ మిల్లులు, ఇరవై లారీలు ఉండేవి. తండ్రికి మిల్లులోని పనివాళ్ళు ఒకసారి సమ్మె చేస్తే అనిసెట్టి ఆ కార్మికుల పక్షమే వహించి తండ్రికి కోపం తెప్పించాడు. 1941 నాటికి గుంటూరు హిందూ కళాశాలలో బి.ఎ. పట్టా పుచ్చుకొన్న అనిసెట్టిని అతని తండ్రి 'లా' చదవడానికి మద్రాసు పంపించాడు.[5]
సినిమాలు[మార్చు]
- ప్రియురాలు (1952)
- పెంపుడు కొడుకు (1953)
- నిరుపేదలు (1954)
- పరివర్తన (1954 సినిమా)
- వదినగారి గాజులు (1955)
- కనకతార (1956)
- కుటుంబ గౌరవం (1957)
- భలే బావ (1957)
- దైవబలం (1959)
- కార్మిక విజయం (1960)
- పతివ్రత (1960)
- భట్టి విక్రమార్క (1960)
- శ్రీకృష్ణపాండవయుద్ధం (1960)
- కన్యకా పరమేశ్వరీ మహత్మ్యం (1961)
- జేబు దొంగ (1961)
- పాప పరిహారం (1961)
- సీత (1961)
- స్త్రీ హృదయం (1961)
- పవిత్ర ప్రేమ (1962)
- రక్తసంబంధం (1962)
- తోబుట్టువులు (1963)
- దొంగ నోట్లు (1963)
- సోమవార వ్రత మహాత్మ్యం (1963)
- ఆదర్శ సోదరులు (1964)
- కలియుగ భీముడు (1964)
- గుడిగంటలు (1964)
- దొంగను పట్టిన దొర (1964)
- మాస్టారమ్మాయి (1964)
- అందీ అందని ప్రేమ (1965)
- భీమ ప్రతిజ్ఞ (1965)
- కన్నెపిల్ల (1966)
- సర్వర్ సుందరం (1966)
- శ్రీకృష్ణ మహిమ (1967)
- నువ్వే (1967)
- భార్య (1968)
- కన్నుల పండుగ (1969)
- పంచ కళ్యాణి దొంగల రాణి (1969)
- ప్రేమ మనసులు (1969)
- రాజ్యకాంక్ష (1969)
- బలరామ శ్రీకృష్ణ కథ (1970)
- అనుభవించు రాజా అనుభవించు (1974)
- జన్మహక్కు (1980)
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (16 October 2017). "సంచలనం సృష్టించిన గాలిమేడలు". lit.andhrajyothy.com. కందిమళ్ల సాంబశివరావు. Archived from the original on 26 అక్టోబర్ 2017. Retrieved 22 October 2019. Check date values in:
|archivedate=
(help) - ↑ సంచలనం సృష్టించిన గాలిమేడలు, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 16 అక్టోబరు 2017, పుట.10
- ↑ తొలి తెలుగు మూక నాటిక 'శాంతి', (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 28 ఆగస్టు 2017, పుట.14
- ↑ శ్రీశ్రీతో ఓ జ్ఞాపకం - జయంపు కృష్ణ[permanent dead link]
- ↑ అనుకంపన కవి అనిసెట్టి సుబ్బారావు - ప్రజాశక్తి 27 Nov 2011[permanent dead link]
యితర లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- తెలుగు సినిమా రచయితలు
- 1922 జననాలు
- 1981 మరణాలు
- తెలుగు కళాకారులు
- తెలుగు సినిమా పాటల రచయితలు
- తెలుగు సినిమా వ్యాసాల విస్తరణ ప్రాజెక్టు
- గుంటూరు జిల్లా సినిమా రచయితలు
- గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- నరసరావుపేట