అనీసుర్ రహమాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనీసుర్ రహమాన్
జననం(1927-08-24)1927 ఆగస్టు 24
హైదరాబాదు, తెలంగాణ
మరణం1987 జూన్ 6(1987-06-06) (వయసు 59)
మిన్నియాపోలిస్, మిన్నసోటా
చదువుకున్న సంస్థలుకేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, లౌవైన్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిపరమాణు గతిశాస్త్రం
ముఖ్యమైన పురస్కారాలుఇర్వింగ్ లాంగ్‌ముయిర్ అవార్డు (1977)

అనీసుర్ రహమాన్ (1927 ఆగస్టు 24 - 1987 జూన్ 8[1]) తెలంగాణకు చెందిన శాస్త్రవేత్త. సిడిసి 3600 కంప్యూటర్‌లో లెన్నార్డ్-జోన్స్ పొటెన్షియల్‌ని ఉపయోగించి 864 ఆర్గాన్ అణువుల వ్యవస్థను అధ్యయనం చేసి 1964లో లిక్విడ్ ఆర్గాన్‌పై పేపర్[2]సమర్పించాడు. రమమాన్ రాసిన అల్గోరిథంలు అనేక కోడ్‌లకు ఆధారంగా ఉంది. డేవిడ్ జెఈ కాల్వేతో కలిసి[3][4] లాటిస్ గేజ్ సిద్ధాంతానికి మైక్రోకానానికల్ సమిష్టి విధానం వంటి అనేక రకాల సమస్యలపై పనిచేశాడు.

జననం, విద్య[మార్చు]

అనీసుర్ రహమాన్ 1927, ఆగస్టు 24న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించాడు. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రం, గణితశాస్త్రాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు. బెల్జియంలోని లౌవైన్ విశ్వవిద్యాలయం నుండి సైద్ధాంతిక భౌతికశాస్త్రంలో పిహెచ్.డి. పట్టా సాధించాడు.

వృత్తిరంగం[మార్చు]

1960లో డాక్టర్ రహమాన్ ఆర్గోన్నే నేషనల్ లాబొరేటరీలో భౌతిక శాస్త్రవేత్తగా 25 సంవత్సరాలు పనిచేశాడు.1985లో డాక్టర్ రహమాన్ మిన్నెసోటా విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా, సూపర్‌కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో సహచరుడిగా చేరాడు.

గుర్తింపులు-అవార్డులు[మార్చు]

డా. రహమాన్‌ను మాలిక్యులర్ డైనమిక్స్ పితామహుడిగా పిలుస్తారు.[5] 1977లో డాక్టర్ రహమాన్ అమెరికన్ ఫిజికల్ సొసైటీచే ఇర్వింగ్ లాంగ్‌ముయిర్ ప్రైజ్‌ను అందుకున్నాడు. బెర్నీ ఆల్డర్ 2009లో అధ్యక్షుడు ఒబామా నుండి నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డును అందుకున్నాడు.

ఇరతర వివరాలు[మార్చు]

1993లో మొదటిసారిగా ప్రదానం చేయబడిన అనీసుర్ రహమాన్ ప్రైజ్ అనేది అమెరికన్ ఫిజికల్ సొసైటీ ద్వారా గణన భౌతిక శాస్త్ర రంగంలో అత్యున్నత గౌరవంగా నిలిచింది. ఆర్గోనే నేషనల్ లాబొరేటరీ అనీసుర్ రహమాన్ పేరు మీద అంతర్జాతీయంగా ప్రతి ఏటా ఒక ప్రత్యేక పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్‌ను Archived 2014-10-28 at the Wayback Machine అందజేస్తోంది. కెరీర్‌లో ప్రారంభ దశలో ఉన్న అత్యుత్తమ డాక్టరల్ సైంటిస్ట్‌కు ఈ ఫెలోషిప్ అందించబడుతుంది.

మరణం[మార్చు]

అనీసుర్ రహమాన్ 1987, జూన్ 8న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. Sinha, Sunil K.; Schuller, Ivan K.; Postol, Ted A.; Parrinello, Michele; Campbell, Charles E. (August 1988). "Aneesur Rahman". Physics Today. Vol. 41, no. 8. p. 97. Bibcode:1988PhT....41h..97S. doi:10.1063/1.2811542.
  2. A. Rahman (1964). "Correlations in the Motion of Atoms in Liquid Argon". Physical Review. 136: A405-A411. Bibcode:1964PhRv..136..405R. doi:10.1103/PhysRev.136.A405.
  3. DJE Callaway; A Rahman (1982). "Microcanonical Ensemble Formulation of Lattice Gauge Theory". Phys. Rev. Lett. 49: 613–616. Bibcode:1982PhRvL..49..613C. doi:10.1103/PhysRevLett.49.613.
  4. DJE Callaway; A Rahman (1983). "Lattice gauge theory in the microcanonical ensemble" (PDF). Phys. Rev. D. 28: 1506–1514. Bibcode:1983PhRvD..28.1506C. doi:10.1103/PhysRevD.28.1506.
  5. "Named Fellowships Luminary - Aneesur Rahman". Argonne National Laboratory. Archived from the original on 2018-01-26. Retrieved 2021-12-31.