అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా పోస్టర్
దర్శకత్వంబాలు అడుసుమిల్లి
రచనబాలు అడుసుమిల్లి
నిర్మాతహిమ వెలగపూడి
వూగి శ్రీనివాస్
తారాగణంధన్య బాలకృష్ణ
త్రిధ చౌదరి
కోమలి ప్రసాద్
సిద్ధి ఇద్నాని
ఛాయాగ్రహణంశేఖర్ గంగనమోని
కూర్పుతెల్లగూటి మణికంఠ్
సంగీతంవికాస్ బదీషా
నిర్మాణ
సంస్థలు
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వి పిక్చర్స్
విడుదల తేదీ
6 మార్చి 2020 (2020-03-06)
సినిమా నిడివి
121 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, 2020 మార్చి 6న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం.[1][2] బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వి పిక్చర్స్ పతాకంపై హిమ వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో బాలు అడుసుమిల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, త్రిధ చౌదరి, కోమలి ప్రసాద్, సిద్ధి ఇద్నాని తదితరులు నటించగా, వికాస్ బదీషా సంగీతం అందించాడు. విహారయాత్ర కోసం గోవా వెళ్ళే నలుగురు అమ్మాయిల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం,[3] 2017లో విడుదలైన రఫ్ నైట్ అనే అమెరికన్ చిత్రం ఆధారంగా రూపొందించబడింది.

కథా నేపథ్యం

[మార్చు]

రక్షిత సోదరి అయిన ధన్య, తన సోదరి కోసం వెతుకుతూ ముగ్గురు స్నేహితురాళ్ళను గోవాకు తీసుకువెళుతుంది. తన సోదరి ఒక వ్యక్తితో ఉన్న ఫోటోను తన ఫోన్‌లో చూసిన ధన్య, తన సోదరి గురించి వెతకడం ప్రారంభిస్తుంది. ఆక్రమంలో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని లభించగా, అతడు మగ వేశ్య అని ఆమె తెలుసుకుంటుంది. తన సోదరి ఫోన్ దొంగిలించబడిందని తెలుస్తుంది. కొన్ని రోజుల తరువాత ఫోటోలోని వ్యక్తి హత్య చేయబడుతాడు. ధన్య, ధన్య స్నేహితురాళ్ళు తమను తాము ఎలా కాపాడుకోగలుగుతారన్నది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
 • రచన, దర్శకత్వం: బాలు అడుసుమిల్లి
 • నిర్మాణం: హిమ వెలగపూడి, వేగి శ్రీనివాస్
 • సంగీతం: వికాస్ బదీషా
 • ఛాయాగ్రహణం: శేఖర్ గంగనమోని
 • కూర్పు: తెల్లగూటి మణికంఠ్
 • నిర్మాణ సంస్థ: బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వి పిక్చర్స్

పాటలు

[మార్చు]
Untitled

ఈ చిత్రానికి వికాస్ బదీషా సంగీతం అందించాడు. రోల్ రైడా, శ్రీమణి పాటలు రాశారు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కిళ్ళి వేద్దాం లొల్లి చేద్దాం"రోల్ రైడారోల్ రైడా, విష్ణుప్రియ రమ్య, సమీరా భరద్వాజ్, వికాస్ బదీషా2:56
2."బాగో రే"శ్రీమణిహేమచంద్ర2:40

విడుదల, స్పందన

[మార్చు]

ఈ చిత్రం 2020, మార్చి 6న విడుదలైంది.[4] 2020, ఏప్రిల్ నెలలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.[5]

టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 1.5/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ చిత్రం, దాని కథాంశం నటీనటులకు ప్రదర్శించడానికి తగినంత స్కోప్ ఇవ్వలేదు" అని రాశారు.[6] ఈ చిత్రంలో పేలవమైన కథాంశం ఉందని, నటీనటుల నటన బాగుందనా ఎన్ టివి పేర్కొంది.[7]

మూలాలు

[మార్చు]
 1. "Anukunnadi Okati Ayinadi Okati Movie Is Dedicated To All Directors: Balu Adusumilli". socialnews xyz. 24 February 2020. Retrieved 26 November 2020.[permanent dead link]
 2. "Rajamahendravaram: Anukunnadi Okati Ayinadi Okati movie team holds promotional event". The Hans India. 27 February 2020. Retrieved 26 November 2020.
 3. "AOAO: Four girls bold show in Goa". Gulte. 6 March 2020. Retrieved 26 November 2020.
 4. "Anukunnadi Okati Ayindi Okkati Movie Review: A wannabe thriller that fails to impress". Times of India. 6 March 2020. Retrieved 26 November 2020.
 5. "అమెజాన్‌లో 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి'". Telugu Stop. 11 April 2020. Retrieved 26 November 2020.
 6. Anukunnadi Okati Ayindi Okkati Movie Review: A wannabe thriller that fails to impress, retrieved 26 November 2020
 7. Codingest. "Review : Anukunnadi Okati Ayinadi Okati". NTV Telugu (in ఇంగ్లీష్). Retrieved 26 November 2020.[permanent dead link]

ఇతర లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి