Jump to content

అనుభా ముంజారే

వికీపీడియా నుండి
అనుభా ముంజారే

పదవీ కాలం
2023 డిసెంబరు 3 – ప్రస్తుతం
నియోజకవర్గం బాలాఘాట్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం మధ్యప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకురాలు

అనుభా ముంజారే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు 2023 శాసనసభ ఎన్నికలలో బాలాఘాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అనుభా ముంజారే జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2003 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బాలాఘాట్ శాసనసభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 15124 ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. ఆమె 2008 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో శివసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 28658 ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది.[2]

అనుభా ముంజారే ఆ తరువాత సమాజ్‌వాదీ పార్టీలో చేరి 2013 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బాలాఘాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి 2500 ఓట్లతో ఓడిపోయింది.[3] ఆమె 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి 27,654 ఓట్లతో ఓడిపోయింది.

అనుభా ముంజారే ఆ తరువాత సమాజ్‌వాదీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బాలాఘాట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గౌరీశంకర్ బిసెన్ చతుర్భుగ్ బిసెన్‌పై 29,195 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4] ఆమె 1,08,770 ఓట్లతో విజేతగా నిలవగా, బిసెన్ చతుర్భుగ్ బిసెన్‌ 79,575 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  2. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
  3. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  4. The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  5. "Madya Pradesh Assembly Election Results 2023 - Balaghat" (in ఇంగ్లీష్). Election Commission of India. 3 December 2023. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.
  6. "Balaghat Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.