Jump to content

అనురాగ్ శర్మ

వికీపీడియా నుండి
అనురాగ్ శర్మ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 మే 23
ముందు ఉమాభారతి
నియోజకవర్గం ఝాన్సీ

వ్యక్తిగత వివరాలు

జననం (1964-11-16) 1964 నవంబరు 16 (age 60)
ఝాన్సీ, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు విశ్వనాథ్ శర్మ, గీతా శర్మ
జీవిత భాగస్వామి పూనమ్ శర్మ (మ.30 జనవరి 1990)
సంతానం 2 కుమార్తెలు
నివాసం మంగళం సివిల్ లైన్, ఝాన్సీ, ఉత్తర ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

అనురాగ్ శర్మ (జననం 16 నవంబర్ 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అనురాగ్ శర్మ 1964 నవంబర్ 16న ఉత్తర ప్రదేశ్, ఝాన్సీలో విశ్వనాథ్ శర్మ, గీతా శర్మ దంపతులకు జన్మించాడు. ఆయన తన ప్రాథమిక విద్యను నైనిటాల్‌లోని షేర్వుడ్ కళాశాల నుండి ఆ తరువాత నాగ్‌పూర్‌లోని హిస్లాప్ కళాశాల నుండి బి.కాం. (ఆనర్స్), ఝాన్సీలోని బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయం నుండి ఎం.కామ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని బోస్టన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఓపీఎం ప్రోగ్రామ్ ను పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అనురాగ్ శర్మ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి శ్యామ్ సుందర్ సింగ్ యాదవ్‌పై 3,65,683 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై,[1] పార్లమెంట్‌లో సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణ, అడవుల స్టాండింగ్ కమిటీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై స్టాండింగ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.

అనురాగ్ శర్మ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ప్రదీప్ జైన్ ఆదిత్యపై 1,02,614 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో రవాణా, పర్యాటక మరియు సంస్కృతి కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[2][3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "Anurag Sharma: Industrialist To Ace Jhansi Seat Again" (in ఇంగ్లీష్). TimelineDaily. 8 March 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
  3. "झांसी लोकसभा सीट से जीतने वाले BJP के अनुराग शर्मा कौन हैं, जानिए अपने सांसद को". TV9 Bharatvarsh. 5 June 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
  4. "Jhansi Chooses BJP's Sitting MP Anurag Sharma For Another Term" (in ఇంగ్లీష్). TimelineDaily. 4 June 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
  5. "2024 Loksabha Elections Results -Jhansi" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
  6. "Jhansi Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.