అనూప్ సింగ్ (చిత్రనిర్మాత)
| అనూప్ సింగ్ | |
|---|---|
| జననం | 1961 March 14 దార్-ఎస్-సలామ్, టాంజానియా |
| జాతీయత | స్విస్ |
| వృత్తి | చిత్రనిర్మాత |
| ప్రసిద్ధి | కిస్సా |
| భార్య / భర్త | కేథరీన్ సాగెట్ |
అనూప్ సింగ్ (జననం: 1961 మార్చి 14), భారతీయ టెలివిజన్ రంగంలో దర్శకుడు. బిబిసి2 కి సలహాదారుగా పనిచేసిన,[1] ఆయన జెనీవాలోని ఒక ఫిల్మ్ స్కూల్లో ప్రొఫెసర్ గా స్థిరపడ్డాడు.[2]
జీవితచరిత్ర
[మార్చు]అనుప్ సింగ్ 1961 మార్చి 14న టాంజానియాలోని దార్-ఎస్-సలాంలో జన్మించాడు.[3] అతని కుటుంబం టాంజానియా నుండి 1971లో బొంబాయికి మారింది.[2] ఆయన ముంబయి విశ్వవిద్యాలయం, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ల నుండి సాహిత్యం, తత్వశాస్త్రంలలో పట్టభద్రుడయ్యాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]అనూప్ సింగ్ మొట్టమొదటి చలన చిత్రం ఏక్తి నాదిర్ నామ్ ప్రపంచవ్యాప్తంగా 30 ఉత్సవాలలో ఎంపిక చేయబడి అనేక అవార్డులను గెలుచుకుంది.[4] ఈ చిత్రం భారతీయ చిత్రనిర్మాత రిత్విక్ ఘటక్ జీవితం ఆధారంగా రూపొందించబడింది, ఆయనను అనూప్ సింగ్ తన గురువుగా భావిస్తాడు.[5]
కిస్సా-ది టేల్ ఆఫ్ ఎ లోన్లీ ఘోస్ట్ 2013లో టొరంటోలో ప్రదర్శించబడింది, అంతర్జాతీయ పత్రికలచే ప్రశంసించబడింది. దీనికి నెట్పాక్ ఉత్తమ ఆసియా చిత్రం, ముంబై ఎఫ్ఎఫ్లో సిల్వర్ గేట్వే అవార్డు, అబుదాబి ఎఫ్ఎఫ్లో ఉత్తమ నటి అవార్డు మొదలైనవి ఎన్నో ఉన్నాయి.
గోల్షిఫ్టే ఫరహానీ, ఇర్ఫాన్ ఖాన్, వహీదా రెహ్మాన్, శశాంక్ అరోరా ప్రధాన పాత్రల్లో, ఆయన రూపొందించిన 'ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్ " 2017లో వచ్చింది.
మూలాలు
[మార్చు]- ↑ "Anup Singh - Festival des Cinémas d'Asie de Vesoul". www.cinemas-asie.com (in ఫ్రెంచ్). Archived from the original on 2019-12-21. Retrieved 2020-07-27.
- ↑ 2.0 2.1 "The Song of Scorpions director Anup Singh: Good cinema will not give up all its secrets at one go". The Indian Express (in ఇంగ్లీష్). 2017-11-05. Retrieved 2020-07-27.
- ↑ "The Match Factory". Retrieved 17 July 2014.
- ↑ "SWISS FILMS: Anup Singh". www.swissfilms.ch. Retrieved 2020-07-27.
- ↑ "Qissa director Anup Singh: I consider Ghatak as my teacher". India News, Breaking News, Entertainment News | India.com (in ఇంగ్లీష్). 2015-02-19. Retrieved 2020-07-27.