Jump to content

అనోరెక్సియా నెర్వోసా

వికీపీడియా నుండి
అనోరెక్సియా నెర్వోసా
ఇతర పేర్లుఅనోరెక్సియా
మిస్ ఎ— ఆమెను 1866లో, చికిత్స తర్వాత 1870లో చిత్రీకరించారు. ఆమె అనోరెక్సియాకు సంబంధించిన తొలి కేస్ స్టడీస్‌లో ఒకరు. <సర్ విలియం గల్ ప్రచురించిన వైద్య పత్రాల నుండి>.
ప్రత్యేకతమానసిక వ్యాధులు
లక్షణాలుతక్కువ బరువు, బరువు పెరుగుతామనే భయం, సన్నగా ఉండాలనే బలమైన కోరిక, ఆహార నియంత్రణలు
సంక్లిష్టతలుఆస్టియోపొరోసిస్, వంధ్యత్వం, గుండె దెబ్బతినడం, ఆత్మహత్య
సాధారణ ప్రారంభంకౌమారదశ నుండి యవ్వనదశ వరకు
కారణాలుస్పష్టమైన కారణం తెలియదు
ప్రమాద కారకములుకుటుంబ చరిత్ర, ఉన్నత స్థాయి క్రీడలు, మోడలింగ్, నృత్యం
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతిశరీర వైకల్య రుగ్మత, బులిమియా నెర్వోసా, మాదకద్రవ్యాల వినియోగ రుగ్మత, హైపర్‌థైరాయిడిజం, తాపజనక ప్రేగు వ్యాధి, డిస్ఫాగియా, క్యాన్సర్
చికిత్సజ్ఞానాత్మక ప్రవర్తనా చికిత్స, బరువును పునరుద్ధరించడానికి ఆసుపత్రిలో చేర్చడం
రోగ నిరూపణ10 సంవత్సరాలలో మరణించే ప్రమాదం 5%
తరుచుదనము2.9 మిలియన్లు (2015)
మరణాలు600 (2015)

'అనోరెక్సియా' నెర్వోసా ఒక రుగ్మత. దీనిని అనోరెక్స్షియా అని పిలుస్తారు, ఇది బరువు తక్కువగా ఉండాలనుకోవడం, పరిమిత ఆహారం తీసుకోవడం, బరువు పెరుగుతుందనే భయం, సన్నగా ఉండాలనే బలమైన కోరికతో తక్కువ తినే రుగ్మత.[1][2]

లక్షణాలు

[మార్చు]

అనోరెక్సియా ఉన్న చాలా మంది వ్యక్తులు తాము తక్కువ బరువు ఉన్నప్పటికీ అధిక బరువు ఉన్నట్లు భావిస్తారు.[2][3] వారు తక్కువ బరువుతో సమస్య ఉంటుందనే విషయాన్ని ఖండిస్తారు.[4] వారు తమ బరువును తరచుగా కొలుచుకుంటారు. చిన్న మొత్తంలో, కొన్ని ఆహారపదార్ధాలను మాత్రమే తింటారు. ఈ బరువు తగ్గాలనే ఆలోచనతో కొందరు మితిమీరిన వ్యాయామం చేస్తారు, బలవంతంగా వాంతి చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు లేదా భేదిమందు (విరోచనం అయ్యే మందులు) ఉపయోగిస్తారు.[2]

ఈ రుగ్మత కలవారిలో బోలు ఎముకల వ్యాధి (Osteoporosis), వంధ్యత్వం, గుండె దెబ్బతినడం వంటి సమస్యలు ఉండవచ్చు.[2] మహిళలలో ఋతుస్రావం ఆగిపోవచ్చు.[4]

కారణాలు

[మార్చు]

ఈ రుగ్మతకు స్పష్టమైన కారణం తెలియలేదు. సారూప్య కవలలతో కొన్ని జన్యు అంశాలు ఇతర కవలల కంటే ఎక్కువగా ప్రభావితమవుతాయి.[3] సన్నగా ఉన్నవారిని గౌరవించే సమాజాలలో సాంస్కృతిక అంశాలు కూడా అధిక పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తుంది.[4] ఇంకా, అధిక-స్థాయి అథ్లెటిక్స్, మోడలింగ్, నాట్యం వంటి సన్నబడటానికి తోడ్పడే కార్యకలాపాలలో పాల్గొనేవారిలో ఈ రుగ్మత సాధారణంగా కనుపిస్తుంది.[4][5] జీవితంలో బలమైన మార్పు లేదా ఒత్తిడి కలిగించే సంఘటనలు సాధారణంగా అనోరెక్సియా సమస్య కలిగించవచ్చు.[4]

రోగ నిర్ధారణ

[మార్చు]

గణనీయంగా బరువు తక్కువ ఉండడం అనేది ఈ రోగం నిర్ధారణకు కీలకం.[4] వ్యాధి తీవ్రతను బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఆధారంగా నిర్ణయిస్తారు. పెద్దలలో BMI 17 కంటే ఎక్కువ,16 నుండి 17 వరకు ఉంటే ఈ వ్యాధి తగుమాత్రం ఉందని భావిస్తారు. తక్కువ BMI 15 నుండి 16 వరకు వ్యాధి తీవ్రంగాను, BMI 15 కంటే తక్కువ ఉన్నవారిలో వ్యాధి తీవ్రతరంగా ఉంటుంది. పిల్లలలో BMI 5 వ శాతం కంటే తక్కువ వ్యాధికి పరిగణిస్తారు.[4]

చికిత్స

[మార్చు]

ప్రధానంగా అనోరెక్సియా చికిత్సలో ఆరోగ్యకరమైన బరువును పునరుద్ధరించడం, అంతర్లీన మానసిక సమస్యలకు చికిత్స చేయడం వంటివి ఉంటాయి. మందులు బరువు పెరగడానికి నేరుగా సహాయపడకపోయినా, సంబంధిత ఆందోళన లేదా నిరాశను తగ్గించడానికి వాటిని ఉపయోగించవచ్చు.[2] అభిజ్ఞా ప్రవర్తనా చికిత్స (cognitive behavioral therapy) లేదా తల్లిదండ్రులు తమ బిడ్డకు ఆహారం తినిపించడం లేదా ఇవ్వడం వంటి అనేక రకాల ప్రక్రియలు చికిత్సగా ఉపయోగపడతాయి, దీనిని మౌడ్స్లీ కుటుంబ చికిత్స అని పిలుస్తారు.[2][5] కొన్నిసార్లు బరువు తగ్గడానికి ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది.[6] అయితే, నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ఫీడింగ్ వలన కలిగే ప్రయోజనాలకు ఆధారాలు స్పష్టంగా లేవు.[7]కొందరు వ్యక్తులకు అనోరెక్సియా కేవలం ఒకసారే వస్తుంది క్రమంగా కోలుకుంటారు, ఇంకొంతమందిలో అనేక సంవత్సరాలుగా ఎక్కువ సార్లు రావచ్చు. బరువు పెరగడంతో అనేక సమస్యలు మెరుగుపడతాయి లేదా పరిష్కరించబడతాయి.[6]

వ్యాప్తి

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా, 2015 నాటికి అనోరెక్సియా 2.9 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని అంచనా వేసారు.[8] పాశ్చాత్య దేశాలలో 0.9% నుండి 4.3% మంది స్త్రీలలో, 0.20% నుండి 0.3% మంది పురుషులలో వారి జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఇది సంభవిస్తుందని అంచనా.[9] సంవత్సరంలో 0.40% యువతులు ప్రభావితమవుతారని, అయితే ఇది పురుషుల కంటే మహిళలు పది రెట్లు ఎక్కువ అని తెలుస్తోంది.[4] తరచుగా ఇది యుక్తవయస్సులో ప్రారంభమవుతుంది.[2] 20వ శతాబ్దంలో అనోరెక్సియా మరింత నిర్ధారణ చేయగలిగినప్పటికీ, ఇది పెరుగుదల వల్ల జరిగిందా లేదా కేవలం మెరుగైన రోగనిర్ధారణ వల్ల జరిగిందా అనేది అస్పష్టం.

ఈ రుగ్మత 2013 లో ప్రపంచవ్యాప్తంగా 600 మరణాలకు దారితీసింది, 1990 లో 400 మరణాలు సంభవించాయి.[10] ఆహారం తినే రుగ్మతలు, ఆత్మహత్య ఆలోచనలు వంటి అనేక ఇతర కారణాలు ఒక వ్యక్తికి మరణించే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.[2][9] దాదాపు 5% మంది పదేళ్ల కాలంలో అనోరెక్సియా సమస్యల వల్ల మరణిస్తున్నారు.[4] అనోరెక్సియా నెర్వోసా అనే పదాన్ని 1873లో విలియం గుల్ ఈ పరిస్థితిని వివరించడానికి మొదటిసారి ఉపయోగించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  1. బులిమియా నెర్వోసా

మూలాలు

[మార్చు]
  1. Sari Fine Shepphird (2009). 100 Questions & Answers About Anorexia Nervosa. Jones & Bartlett Learning. p. xvi. ISBN 978-1-4496-3079-9. Archived from the original on 8 September 2017.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 "What are Eating Disorders?". NIMH. Archived from the original on 23 May 2015. Retrieved 24 May 2015. Archived 23 మే 2015 at the Wayback Machine
  3. 3.0 3.1 Attia E (2010). "Anorexia nervosa: current status and future directions". Annual Review of Medicine. 61 (1): 425–35. doi:10.1146/annurev.med.050208.200745. PMID 19719398.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 Diagnostic and statistical manual of mental disorders : DSM-5 (5 ed.). Washington: American Psychiatric Publishing. 2013. pp. 338–345. ISBN 978-0-89042-555-8.
  5. 5.0 5.1 Arcelus J, Witcomb GL, Mitchell A (March 2014). "Prevalence of eating disorders amongst dancers: a systemic review and meta-analysis". European Eating Disorders Review. 22 (2): 92–101. doi:10.1002/erv.2271. PMID 24277724.
  6. 6.0 6.1 "Feeding and eating disorders" (PDF). American Psychiatric Publishing. 2013. Archived from the original (PDF) on 1 May 2015. Retrieved 9 April 2015. Archived 1 మే 2015 at the Wayback Machine
  7. "Eating Disorders: Core Interventions in the Treatment and Management of Anorexia Nervosa, Bulimia Nervosa and Related Eating Disorders" (PDF). 2004. p. 103. PMID 23346610.
  8. Vos, Theo; Allen, Christine; Arora, Megha; Barber, Ryan M.; Bhutta, Zulfiqar A.; Brown, Alexandria; Carter, Austin; Casey, Daniel C.; Charlson, Fiona J.; Chen, Alan Z.; Coggeshall, Megan; Cornaby, Leslie; Dandona, Lalit; Dicker, Daniel J.; Dilegge, Tina; Erskine, Holly E.; Ferrari, Alize J.; Fitzmaurice, Christina; Fleming, Tom; Forouzanfar, Mohammad H.; Fullman, Nancy; Gething, Peter W.; Goldberg, Ellen M.; Graetz, Nicholas; Haagsma, Juanita A.; Hay, Simon I.; Johnson, Catherine O.; Kassebaum, Nicholas J.; Kawashima, Toana; Kemmer, Laura (October 2016). "Global, regional, and national incidence, prevalence, and years lived with disability for 310 diseases and injuries, 1990-2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015". Lancet. 388 (10053): 1545–1602. doi:10.1016/S0140-6736(16)31678-6. PMC 5055577. PMID 27733282. {{cite journal}}: Unknown parameter |displayauthors= ignored (help)
  9. 9.0 9.1 Smink FR, van Hoeken D, Hoek HW (August 2012). "Epidemiology of eating disorders: incidence, prevalence and mortality rates". Current Psychiatry Reports. 14 (4): 406–14. doi:10.1007/s11920-012-0282-y. PMC 3409365. PMID 22644309.
  10. Naghavi M, Wang H, Lozano R, Davis A, Liang X, Zhou M, et al. (January 2015). "Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990-2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013". Lancet. 385 (9963): 117–71. doi:10.1016/S0140-6736(14)61682-2. PMC 4340604. PMID 25530442.