అన్నా చెల్లెలు (1960 సినిమా)
| అన్నా చెల్లెలు (1960 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | బి.విఠలాచార్య |
|---|---|
| నిర్మాణం | టి.ఆర్.సుందరం |
| తారాగణం | జె.వి.రమణమూర్తి, దేవిక, రాజనాల, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని |
| సంగీతం | రాజన్ నాగేంద్ర |
| గీతరచన | జి.కృష్ణమూర్తి |
| నిర్మాణ సంస్థ | మోడర్న్ థియేటర్స్ లిమిటెడ్ |
| భాష | తెలుగు |
అన్నా చెల్లెలు బి.విఠలాచార్య దర్శకత్వంలో 1960లో నిర్మించబడ్డ వినోదాత్మకమైన సాంఘిక జానపద తెలుగు చలనచిత్రం. జె వి. రమణమూర్తి, దేవిక, మీనాకుమారి, రాజనాల ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం రాజన్ నాగేంద్ర సమకూర్చారు.
పాత్రలు - పాత్రధారులు
[మార్చు]| నటుడు/నటి | పాత్ర పేరు |
|---|---|
| దేవిక | కాంతం |
| రాజనాల | జగ్గడు (బందిపోటు) |
| జె.వి.రమణమూర్తి | కాంతం అన్న |
| చలం | బుచ్చిబాబు |
| అల్లు రామలింగయ్య | |
| మిక్కిలినేని | |
| మీనాకుమారి |
కథ
[మార్చు]కాంతం అనే పరువం గల పల్లెపడుచు అందానికి దాసులై వయసు మళ్లిన జమీందారు ఒకడు, జగ్గడు అనే బందిపోటు దొంగ మరొకడు పోటీ పడతారు. జమీందారు కూతురును పెళ్లాడాలని వచ్చిన పచ్చగన్నేరుపాలెం బుచ్చిబాబు కూడా కాంతంపై మోజు పడతాడు. చివరకు దయాదాక్షిణ్యాలు లేని బందిపోటు దొంగ ఆమెను బలవంతంగా రెండో పెళ్ళి చేసుకుంటాడు. జమీందారు కూతురు రాజు అనే ఒక పాలికాపును ప్రేమించడంతో బుచ్చిబాబు రెంటికీ చెడ్డ రేవడ అయి ప్రేమించడం మానేస్తాడు. కానీ మరో పల్లెపడుచు అతడిని ప్రేమించి, తనను ప్రేమించేలా చేసి తనదారిలోనికి తెచ్చుకుంటుంది.
బందిపోటును పెళ్లాడిన కాంతం తన భర్తనే దైవంగా పూజిస్తూ, తన భర్తను హతమార్చాలని వచ్చిన అన్నకు చెప్పవలసిన మాటలు చెప్పి ధర్మోపదేశం చేసి పంపిస్తుంది. బందిపోటు లోకానికి, లోకులకు కంటకుడయినా, తన మొదటి భార్య ద్వారా పుట్టిన తన కూతురుపై అనురాగాన్ని పెంచుకుంటాడు.
జమీందారు ఎలా అయినా కాంతం తన సొంతం కావాలని పన్నాగం పన్ని బందిపోటు జగ్గడిని అంతమొందించాలని జగ్గడి ముఠాలోని వాడికే ఆ పనిని అప్పజెప్పుతాడు. జగ్గడు చనిపోయాడని భావించి కాంతాన్ని చెరబట్టి బలాత్కారం చేయబోతాడు. కానీ దెబ్బతిన్న జగ్గడు ఇదివరకు తనచే పీడితురాలైన ఒక మహిళచే రక్షింపబడి దయ, ప్రేమ అంటే ఏమిటో తెలుసుకుని మంచి మనిషిగా మారిపోయి కాంతాన్ని విడీపించుకుని తాను చేసిన తప్పులకు శిక్షలను అనుభవిస్తాడు. జమీందారు కూతురు రాజును, బుచ్చిబాబు పల్లెపిల్లను పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.[1]
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: బి.విఠలాచార్య
- సంగీతం: రాజన్ నాగేంద్ర
- గీత రచయిత: జి.కృష్ణమూర్తి
- నేపథ్య గాయకులు: పులపాక సుశీల , పిఠాపురం నాగేశ్వరరావు, శిష్ట్లా జానకి, ప్రతివాది భయంకర శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం
- నిర్మాత: టి.ఆర్.సుందరం
- నిర్మాణ సంస్థ: మోడరన్ థియేటర్స్ లిమిటెడ్
- విడుదల:1960.
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలు, పద్యాల వివరాలు:[2]
- ఇంతేనా బ్రతుకింతేనా అంతేకానని పెను చింతేనా - పి.సుశీల , రచన: జి కృష్ణమూర్తి
- ఓ యువతీ నీవెవతవే నాటి యవ్వనవతి దివి వదలి భువికి (పద్యం) - పిఠాపురం
- గంగిరెడ్ల గంగన్నా నీ గొడ్డు గోతిలో పడ్డదిరా తీగమల్లె పూసెనురా - పి.బి.శ్రీనివాస్, రచన; జి కృష్ణమూర్తి
- చిన్నిపాపా నన్ను కన్నపాప అన్నమాట విన్నావా చక్కని పాపా - పి.సుశీల, రచన: జి కృష్ణమూర్తి
- జలములో తేలేటి కలువలు కమలాలు వెలది వదనాలు (పద్యం) - పిఠాపురం
- దబ్బరసం బలే నార దబ్బరసం ఒకే దెబ్బతోనే జబ్బులన్ని - ఎస్.జానకి, మాధవపెద్ది
- పంట నీటి గుంట కాడ పాలపిట్ట పరిగి పట్ట - పి.బి.శ్రీనివాస్ బృందం, రచన: జి కృష్ణమూర్తి
- బండి నడిపించి శాయమే లేకుండాలి బ్రతుకు నడిపించ - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్
- మాటడవేలరా రాజ మోమాటమేలరా మరులు మీరి నినుకోర - పి.సుశీల, రచన: జి కృష్ణమూర్తి
- యిల్లాలి మెడలోని మాంగళ్యమందే యిలలోని మగవాని (పద్యం) - మాధవపెద్ది
- సనచీర కట్టింది సనజాజులు పెట్టింది - పి.సుశీల, మాధవపెద్ది బృందం, రచన: జి కృష్ణమూర్తి
- కొక్కొరకో కో యేటంచు ఎలుగెత్తిన,(పద్యం), పిఠాపురం
- కొట్టిన చెయ్యే కోరు కోరిన చెయ్యే కొట్టు,మాధవపెద్ది , పి. సుశీల, రచన: జి కృష్ణమూర్తి.
మూలాలు
[మార్చు]- ↑ "చిత్ర సమీక్ష - అన్నా చెల్లెలు". ఆంధ్రపత్రిక దినపత్రిక. 12 June 1960. Retrieved 24 October 2016.[permanent dead link]
- ↑ కొల్లూరు, భాస్కరరావు. "అన్నా చెల్లెలు - 1960". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 24 October 2016.[permanent dead link]