అపరిచితుడు

వికీపీడియా నుండి
(అన్నియన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అపరిచితుడు
(2005 తెలుగు సినిమా)
AnniyanDVD.jpg
దర్శకత్వం ఎస్. శంకర్
నిర్మాణం ఆస్కార్ వి రవిచంద్రన్
రచన ఎస్. శంకర్
సుజాతా రంగరాజన్
తారాగణం విక్రం
సదా
సంగీతం హ్యారీస్ జయరాజ్
కూర్పు వి. టి. విజయన్
విడుదల తేదీ జూన్ 17, 2005
నిడివి 181 నిమిషాలు
భాష తెలుగు
పెట్టుబడి 60,00000 డాలర్లు
వసూళ్లు 11.000000 డాలర్లు

అపరిచితుడు 2005 జూన్ 17 న తమిళ "అన్నియన్" నుండి తెలుగులోకి అనువదించబడి విడుదలైన చిత్రము. ఎస్. శంకర్ దర్శకత్వంలో విక్రం అనన్య సామాన్యమైన నటన ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నది.

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

చిత్రంలో ప్రధాన పాత్రధారి రామానుజం అయ్యంగారు (విక్రం) వృత్తిరీత్యా న్యాయవాది మల్టిపుల్ పెర్సనాలిటీ డిజార్డార్ (Multiple Personality Disorder) అనే మానసిక వ్యాధిగ్రస్తుడు. ఇతడు అమాయకుడు మరియు నిజాయితీపరుడు. సంఘంలో అన్నిచోట్ల జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించి విఫలుడై మానసిక క్షోభకు లోనౌతాడు. అయితే చిన్నప్పుడు ప్రియమైన చెల్లెలు ప్రభుత్వోద్యోగుల నిర్లక్ష్యం మూలంగా చనిపోయినప్పుడు తండ్రి ఆవేదనను చూసి మానసికంగా పరివర్తన చెంది తనకు తెలియకుండా రెండవ వ్యక్తి అపరిచితుడుగా మారుతాడు. ఒక వెబ్ సైటు ప్రారంభించి ప్రజల కష్టాల్ని తెలుసుకొని నేరాలకు పాల్పడిన వారికి గరుడ పురాణంలో పేర్కొనిన విధంగా పాపులకు నరకంలో విధించే శిక్షలను (క్రిమి భోజనం, కుంభీపాకం వంటివి) తానే విధించి చంపేస్తాడు. ప్రతీదీ పద్ధతి ప్రకారం జరగాలి అని కోరుకొనే రాముని ప్రేమించలేకపోతున్నాని నందిని అతనితో సూటిగా చెప్పటం తట్టుకోలేని రాము ఆత్మహత్యా ప్రయత్నం చేసే సమయంలో నందినికి నచ్చే "రెమో" అన్న మూడవ వ్యక్తిత్త్వం రాములో జన్మిస్తుంది. మానసిక వైద్యుల పరిశోధనలో ఈ వ్యాధి వివరాలు న్యాయస్థానంలో ఉంచి అతనికి మరణ దండన కాకుండా మామూలు శిక్షతో తిరిగి మామూలు వ్యక్తిగా మారుస్తారు.

పాటలు[మార్చు]

  • కుమారీ
  • జియ్యంగారి ఇంటి సొగసా
  • లవ్ ఎలిఫెంట్ లా వస్తాడు రెమో
  • నాకూ నీకూ నోకియా
  • కొండ కాకి కుండె దానా

సంభాషణలు[మార్చు]

  • మీరు మాత్రం చట్టాన్ని మీరవచ్చు, నేను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం తప్పా?
  • దీనికి ఎవడు చంపుతాడులే అన్న ధైర్యంతోనే కదా, ఇన్ని తప్పులు చేస్తున్నారు?
  • ఒరేయ్, ఒరేయ్, కమల్ ను చూశా, రజినీ ను చూశా, చిరంజీవిని చూశా, కానీ నీ లా నటించే వాడిని మాత్రం చూడలేదు రా!

విశేషాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]