Jump to content

అన్ పావం పొల్లాతతు

వికీపీడియా నుండి
అన్ పావం పొల్లాతతు
దర్శకత్వంకలైయరసన్ తంగవేల్
రచన
  • కలైయరసన్ తంగవేల్
  • శివకుమార్ మురుగేషన్ (మాటలు)
స్క్రీన్ ప్లేశివకుమార్ మురుగేషన్, కలైయరసన్ తంగవేల్
కథశివకుమార్ మురుగేషన్
నిర్మాతవేదిక్కారన్‌పట్టి ఎస్. శక్తివేల్
తారాగణం
ఛాయాగ్రహణంమాధేష్ మాణికం
కూర్పువరుణ్ కె.జి.
సంగీతంసిద్ధు కుమార్
నిర్మాణ
సంస్థ
డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుఏ.జి.ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
31 అక్టోబర్ 2025 (2025-10-31)
సినిమా నిడివి
122 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషతమిళ
బడ్జెట్₹ 5 కోట్లు
బాక్సాఫీసు₹ 27 కోట్లు

అన్ పావం పొల్లాతతు (అనువాదం. సిన్ ఎగైనెస్ట్ మెన్ ఈజ్ డేంజరస్) 2025లో విడుదలైన తమిళ భాషా రొమాంటిక్ కామెడీ సినిమా. డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేదికకారన్‌పట్టి ఎస్. శక్తివేల్ నిర్మించిన ఈ సినిమాకు కలైయరసన్ తంగవేల్ దర్శకత్వం వహించాడు. రియో ​​రాజ్, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.[2]

ఈ సినిమా నవంబర్ 28 నుండి 'జియో హాట్‌స్టార్‌' ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]

మధ్యతరగతి కుటుంబానికి చెందిన శివ (రియో రాజ్) తల్లి, తండ్రి, తమ్ముడుతో కలిసి ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. పెద్దలు నిశ్చయించడంతో శక్తి (మాళవిక మనోజ్) ను పెళ్లి చేసుకుంటాడు. మొదటి నెల రోజులు బాగానే ఉంటారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి, దీనితో వారు తమ తల్లిదండ్రులకు చెప్పకుండా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని పరస్పర అంగీకారంతో కోర్టు మెట్లెక్కుతారు. మరి పెళ్లయిన ఏడాదికే శివ-శక్తి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలేం జరిగింది? అప్ప‌టికే ఇలాంటి సమస్యతోనే విడాకులు తీసుకున్న న్యాయవాదులు నారాయ‌ణ (ఆర్జే విఘ్నేష్‌కాంత్), లక్ష్మి (షీలా రాజ్‍కుమార్) ఈ కేసును టేక‌ప్ చేస్తారు. అ తరువాత ఏమైంది. చివరకు వీళ్లిద్దరూ కలిశారా? లేదా? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]
  • శివగా రియో రాజ్
  • శక్తిగా మాళవిక మనోజ్
  • లాయర్ నారాయణన్‌గా ఆర్జే విఘ్నేష్‌కాంత్
  • నారాయణన్ మాజీ భార్య, న్యాయవాది లక్ష్మిగా షీలా రాజ్‍కుమార్
  • లాయర్ సిద్ధుగా జెన్సన్ ధివాకర్, నారాయణన్ స్నేహితుడు & అసిస్టెంట్
  • శక్తి తండ్రిగా ఎ. వెంకటేష్
  • శివ తండ్రి తంగవేల్‌గా రాజా రాణి పాండియన్
  • శివ తల్లిగా ఉమా రామచంద్రన్
  • శక్తి తల్లిగా రేష్మి కార్తికేయన్
  • భారతిగా అనుపమ కుమార్
  • న్యాయమూర్తిగా ఎలాంగో కుమానన్
  • శివ సోదరుడిగా అనిరుత్
  • పనిమనిషిగా దీపా శంకర్
  • జడ్జి అలమేలుమంగైగా అంజలి అమీర్
  • డిటెక్టివ్ గా విస్టార్ వినోద్
  • ఎస్ఆర్ కనాలి
  • కౌన్సెలర్‌గా చుట్టి అరవింద్
  • ఎస్.ఐ కలైవాణిగా వసంతి
  • కానిస్టేబుల్ గా సెంథి కుమారి

మూలాలు

[మార్చు]
  1. "Aan Paavam Pollathathu (12A)". British Board of Film Classification (in ఇంగ్లీష్). 3 November 2025. Retrieved 3 November 2025.
  2. "సర్దుకుపోతేనే సంసారం". Eenadu. 3 December 2025. Archived from the original on 3 December 2025. Retrieved 3 December 2025.
  3. "ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్". Sakshi. 26 November 2025. Archived from the original on 3 December 2025. Retrieved 3 December 2025.
  4. "నేటి మ‌గాళ్ల.. క‌ష్టాలు చూపిన సినిమా! ఓటీటీలో.. దుమ్ములేపుతుంది". Chitrajyothy. 30 November 2025. Archived from the original on 3 December 2025. Retrieved 3 December 2025.

బయటి లింకులు

[మార్చు]