అపరాధము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అపరాధము [ aparādhamu ] apa-rādhamu. సంస్కృతం n. A fault, sin, guilt, (commonly) a fine, punishment, penalty. శిక్షార్హమైన కర్మము, పాపము, నేరము, (వాడుకగా) నేరమునకై పుచ్చుకొనే రూకలు. అపరాధమును మన్నించు or కాచు to pardon, overlook. అపరాధ క్షమయు to beg pardon. అపరాధము వేయు to inflict a fine. అపరాధము తీయు to take a fine. అపరాధి n. An offender, delinquent. నేరము చేసినవాడు. అపరాద్ధము adj Criminal, guilty, erring, faulty. అపరాధియైన, పాపియైన.

అపరాధము అనగా తప్పు అని సామాన్యార్థం. కాని, పారమార్థికార్థం - (1) చేయకూడని... దైవం విషయంలో చేసే తప్పులు, అంటే భగవదారాధనలోచేసే తప్పులు ముప్పది రెండింటిని ఒక పట్టికగా తయారు చేశారు. అవి: 1. దేవాలయంలోకి చెప్పులతో గానీ, వాహనాలు ఎక్కిగానీ ప్రవేశించడం, 2. దేవుళ్ళ ఉత్సవాలలోగానీ, ఊరేగింపులలోగానీ అవకాశం ఉండికూడా సేవ చేయకుండా ఉండటం, 3. దేవుని ఎదుట నమస్కారం చేయకుండా ఉండటం, 4. అశుచిగా ఉండిగానీ, ఎంగిలి చేతులతో గానీ దేవుని ఎదుటికి వెళ్లి మొక్కడం, 5. రెండవ చేయిని (ఉండికూడా) ఉపయోగించ కుండా ఒక్క చేతితో మొక్కడం, 6. దేవుని సమక్షంలోనే అడ్డదిడ్డంగా తిరగడం, 7. కాళ్లు బార చాచి కూర్చోవడం, 8. పర్యంక బంధనం (యోగ పట్టా/ యోగ పట్టె), 9. పడుకోవడం, 10. తినడం, 11, అబద్ధాలు మాట్లాడటం, 12. పెద్దగా మాట్లాడటం, 13. పరస్పరం వాదులాడు కోవడం, 14. ఏడవటం, 15. పోట్లాడు కోవడం, 16. శిక్షించడం, 17. అను గ్రహించడం, 18. పరుషంగా మాట్లాడటం, 19. ఉన్ని దుప్పట్లు (శాలువలు) కప్పు కోవడం, 20. సంకీర్తనం చేయకుండా ఉండటం, 21. అశ్లీలాలు మాట్లాడటం, 22. దుర్గంధం వ్యాపింపజేయడం (అపాన వాయువు వదలడం), 23. కాలు విూద కాలు వేసుకొని కూర్చోవడం, 24. ఎవరినైనా పొగడటం, 25. ఎవరినైనా నిందించడం, 26. తనను గురించి తాను గొప్పలు చెప్పడం, 27. శక్తి కొలది గాక, లాంఛనంగా పూజ చేశామనిపించుకొనే విధంగా పూజించడం, 28. నైవేద్యం పెట్టకముందే తినేయడం, 29. ఆయా కాలాలలో లభించే ఫల పుష్పాలను దేవుడికి సమర్పించకపోవడం, 30. దేవుడి ముందుండి లౌకిక వ్యవహారాలను గురించి చర్చించడం, 31. ఏదైనా మిగిలితే అది దేవుడికి ఇవ్వడం, అంటే సంకల్పం చేసినట్టుగాక ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు ఎంతోకొంత ఇవ్వడం, 32. గురువు సమక్షంలో మాట్లాడవలసి వచ్చినప్పుడు మౌనం పాటించడం. ఇవన్నీ భగవదపచారాలు.

"https://te.wikipedia.org/w/index.php?title=అపరాధము&oldid=2159774" నుండి వెలికితీశారు