అపూర్బా కిషోర్ బిర్
అపూర్బ కిషోర్ బిర్ | |
|---|---|
2016లో బిర్ | |
| జననం | అపూర్బ కిషోర్ బిర్ 1948 (age 77–78)[1] |
| పాఠశాల/కళాశాలలు | ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా[2] |
| వృత్తి | ఛాయాగ్రాహకుడు, దర్శకుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1973–ప్రస్తుతం |
| భాగస్వామి |
ప్రతివా బిర్ (m. 1982) |
| తల్లిదండ్రులు | అజోయ్ చంద్ర బిర్ |
| పురస్కారాలు | జాతీయ చలనచిత్ర పురస్కారం - ఉత్తమ ఛాయాగ్రహణం |
అపూర్బ కిషోర్ బిర్ (జననం 1948) (ఎ.కె. బిర్ అని కూడా పిలుస్తారు) ఒక భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు, స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు. పూణే లోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్వ విద్యార్థి అయిన ఇతను తన తొలి చలనచిత్రం చేయడానికి ముందు వివిధ ప్రకటన చిత్రాలు, డాక్యుమెంటరీలలో పనిచేశాడు. తన తొలి సినిమా 27 డౌన్ కు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుపొందాడు. అతను దర్శకుడిగా పరిచయమైన ఆది మీమాంస చిత్రానికి జాతీయ సమగ్రతపై ఉత్తమ చలనచిత్రంగా నర్గీస్ దత్ పురస్కారం లభించింది. బిర్ దర్శకత్వం వహించిన ఇతర చిత్రాలు లావణ్య ప్రీతి, బాజా లకు ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం వరించింది. 2014 నాటికి అతను తొమ్మిది జాతీయ చలనచిత్ర పురస్కారాలు (ఉత్తమ ఛాయాగ్రహణానికి మూడు అవార్డులతో సహా) గెలుపొందాడు, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దర్శకులలో ఒకరిగా ఉన్నాడు.

జీవిత చరిత్ర
[మార్చు]ఒడిశా లోని బాలికుటి గ్రామంలో జన్మించిన బిర్ కు చిత్రలేఖనం పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. తండ్రి పట్టుబట్టడంతో మోషన్ పిక్చర్ ఛాయాగ్రహణంలో స్పెషలైజేషన్‌తో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లో చేరాడు.[3] సంస్థ నుండి ఉత్తీర్ణుడయ్యాక లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలలో పనిచేశాడు. ఛాయాగ్రాహకుడిగా అతని తొలి చలనచిత్రం 27 డౌన్, 21వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో అతనికి ఉత్తమ ఛాయాగ్రాహకుడి అవార్డును తెచ్చిపెట్టింది.[3][4] సినిమాలో దాదాపు 70 శాతం హ్యాండ్‌హెల్డ్ కెమెరాను ఉపయోగించి చిత్రీకరించబడింది.[4] రిచర్డ్ అటెన్‌బరో చిత్రం గాంధీ కు పనిచేసిన ఫస్ట్-యూనిట్ కెమెరామెన్‌లలో బిర్ ఒకరు.[5][6][7] దాసి (1988), ఆది మీమాంస (1991) చిత్రాలకు మరో రెండు సార్లు "ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం" గెలుపొందాడు. రెండవ చిత్రం ద్వారా అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు.[8] ఈ చిత్రం జాతీయ సమగ్రతపై ఉత్తమ చలనచిత్రంగా నర్గీస్ దత్ పురస్కారం గెలుపొందింది. దర్శకుడిగా సమాంతర సినిమా లో తన కృషికి ప్రసిద్ధి చెందాడు. బిర్ చిత్రాలు పిల్లలపై దృష్టి సారించాయి, అతని రెండు చిత్రాలులావణ్య ప్రీతి, బాజా వరుసగా 1993, 2002లలో ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుపొందాయి. మొదటి చిత్రం ఒసాకా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో "ఉత్తమ ఆసియా చిత్రం" పురస్కారం, "అంతర్జాతీయ జ్యూరీస్ క్రిటిక్ అవార్డు" పొందింది, బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం లో ప్రదర్శించబడింది.[3] అతను ఛాయాగ్రహణం, దర్శకత్వంతో పాటు స్క్రీన్ ప్లే అందించిన హమారీ బేటీ చిత్రం 2006లో షికాగో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం లోని "వరల్డ్ ఫిల్మ్ సెక్షన్" పోటీ విభాగంలో ప్రదర్శించబడింది.[6] 2012లో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దర్శకులలో ఒకరిగా బిర్ నియమితుడయ్యాడు.[6] అతను "సాంకేతిక ఉపసంఘం" కు నేతృత్వం వహించాడు, 2014లో జరిగిన 45వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం చలనచిత్ర జ్యూరీకి ఛైర్మన్‌గా ఉన్నాడు.[9][10]
సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | భాష | గమనికలు |
|---|---|---|---|
| 1973 | 27 డౌన్ | హిందీ | తొలి పరిచయం |
| 1977 | ఘరోండా | హిందీ | |
| గోధూళి | కన్నడ హిందీ | ||
| 1978 | ఒందనొందు కాలదల్లి | కన్నడ | |
| ఖట్టా మీఠా | హిందీ | ||
| 1979 | ప్రేమ్ వివాహ్ | హిందీ | |
| దూరియాన్ | ఉర్దూ | ||
| 1982 | హమారీ బహు అల్కా | హిందీ | |
| ఆదత్ సే మజ్బూర్ | హిందీ | స్క్రీన్ ప్లే రచయిత | |
| గాంధీ | ఇంగ్లీష్ | ఫస్ట్-యూనిట్ కెమెరామెన్‌లలో ఒకరు[11] | |
| 1983 | రంగులకల | తెలుగు | |
| తుమ్ లౌట్ ఆవో | హిందీ | ||
| 1987 | మా ఊరు | తెలుగు | |
| 1988 | రామ్ అవతార్ | హిందీ | |
| దాసి | తెలుగు | ||
| పెస్టోంజీ | హిందీ | ||
| 1990 | మట్టి మనుషులు | తెలుగు | |
| 1991 | ఆది మీమాంస | హిందీ ఒడియా | దర్శకుడిగా తొలి పరిచయం |
| దీక్ష | |||
| లావణ్య ప్రీతి | (స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు కూడా) | ||
| 1994 | అరణ్యక | (స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు కూడా) | |
| 1997 | శేష దృష్టి | (దర్శకుడు కూడా) | |
| 1998 | నందన్ | (దర్శకుడు కూడా) | |
| 2002 | బాజా | (స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు కూడా) | |
| షరారత్ | |||
| 2003 | హరివిల్లు | ||
| 2005 | శిఖర్ | ||
| [ఎప్పుడు?] | హమారీ బేటీ | (స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు కూడా) | |
| 2008 | జియంత భూత | ||
| 2010 | హుప్పా హుయ్యా | ||
పురస్కారాలు
[మార్చు]జాతీయ చలనచిత్ర పురస్కారాలు
[మార్చు]ఉత్తమ ఛాయాగ్రహణం
[మార్చు]- 1973: 27 డౌన్
- 1988: దాసి
- 1991: ఆది మీమాంస
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (ఒడియా)
[మార్చు]- 1997: శేష దృష్టి
- 1998: నందన్
ఉత్తమ బాలల చిత్రాలు
[మార్చు]- 1991: లావణ్య ప్రీతి
- 2002: బాజా
జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రం
[మార్చు]1991: ఆది మీమాంస
ఇతర పురస్కారాలు, గౌరవాలు
[మార్చు]- 1991 – దర్శకుడి ఉత్తమ తొలి చిత్రంగా అరవిందన్ పురస్కారం ఆది మీమాంస[12]
- 1993 – లావణ్య ప్రీతి కి ఉదయ్ పూర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అంతర్జాతీయ జ్యూరీస్ క్రిటిక్ పురస్కారం[12]
- జయదేవ పురస్కారం[13]
- లావణ్య ప్రీతి – ఒసాకా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ ఆసియా చిత్ర పురస్కారం.[14]
- 2011 – ఉత్తమ ఛాయాగ్రహణానికి తరంగ సినీ పురస్కారం[15]
- 2013 – పద్మశ్రీ[16]
మూలాలు
[మార్చు]- ↑ "Apurba Kishore Bir - About This Person - Movies & TV". Movies & TV Dept. The New York Times. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 January 2013.
Born in 1948 in Orissa
{{cite web}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "DIRECTORATE OF FILM FESTIVALS". dff.nic.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 January 2013.
In 1974 three Oriya graduates from the FTII, Sadhu Meher (Actor), A.K. Bir (Cinematographer) and Ravi Patnaik (Editor), secured National Awards for the film, '27DOWN'.
- 1 2 3 "ONFILM Apurba Kishore Bir". Eastman Kodak. 22 April 2013. the original నుండి 2 December 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 March 2014.
- 1 2 "Apurba Kishore Bir on 27 Down". Time Out. Mumbai. 11 December 2009. the original నుండి 27 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 March 2014.
- ↑ "Gandhi (1982)". YouTube. 21 September 2012., Archived on 2 September 2025
- 1 2 3 "Oriya cinematographer Apurba Kishore Bir appointed independent director of NDFC". odishatoday.com. 2012. the original నుండి 2 March 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 January 2013.
The Information and Broadcasting Ministry has appointed noted Oriya cinematographer AK Bir as one of the independent directors of National Film Development Corporation
- ↑ "Director's Biography: A K Bir". Children's Film Society. the original నుండి 16 ఏప్రిల్ 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 March 2014.
- ↑ Agrawal, S. P. (1 January 1993). Development Digression Diary of India : 3d Companion Volume To Information India 1991–92. Concept Publishing Company. p. 18. ISBN 978-81-7022-305-4.
- ↑ "Technical Sub-committee of IFFI 2014". Directorate of Film Festivals. the original నుండి 23 November 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2014.
- ↑ "45th International Film Festival of India, 2014 - Indian Panorama 2014: Final Selection for Feature and Non-Feature Films" (PDF). Directorate of Film Festivals. the original (PDF) నుండి 30 October 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2014.
- ↑ "Regional films hold the clue to Indian ethos". The Times of India. 2011. the original నుండి 25 October 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 January 2013.
Bir also handled the second camera in the first unit of Richard Attenborough's Oscar-winning film Gandhi
- 1 2 "46th National Film Festival 1999". Directorate of Film Festivals. p. 75. the original నుండి 3 December 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 November 2014.
- ↑ "Apurba Kishore Bir to get Jayadev Award". The Pioneer. India. 2011. the original నుండి 13 ఆగస్టు 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 January 2013.
Apurba Kishore Bir will get Jayadev Award, the highest honour of Oriya cinema for lifetime achievement, for the year of 2010
- ↑ "Labanya Preeti (Loving Hearts) | Children's Film Society, India". cfsindia.org. the original నుండి 3 డిసెంబర్ 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 January 2013.
The film won the Best Asian Film award at the Osaka International Film Festival
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ "Odiaone News – Latest Ollywood happenings. News, Stories, Ollywood Masala and many more". odiaone.com. 2012. the original నుండి 4 May 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 January 2013.
Best Cinematographer – A.K. Bir (Jianta Bhuta)
- ↑ "Padma awards for Sharmila, Rajesh Khanna, Sridevi – The Economic Times". The Times of India. 2013. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 January 2013.
cameraman Apurba Kishore Bir, ... were named for Padma Shri.