Jump to content

అప్పం

వికీపీడియా నుండి
అప్పం
అప్పం
ఇతర పేర్లుహాప్పర్స్, ఆప్ప, కల్లప్పం, వెల్లప్పం, పాలప్పం
రకంఅట్టు లేదా పాన్‌కేక్
Courseఉదయం అల్పాహారం లేదా రాత్రి భోజనం
Associated cuisineభారతదేశం, శ్రీలంక, ఆగ్నేయాసియా
ప్రధాన అనుఘటకాలుబియ్యం పిండి
Variationsఎగ్ హాప్పర్స్

అప్పం లేదా ఆప్పం అనేది దక్షిణ భారత వంటకాలలో ఒక రకమైన పలుచని అట్టు (పాన్‌కేక్).[1] దీన్ని పులియబెట్టిన బియ్యం పిండి, కొబ్బరి పాలతో తయారు చేస్తారు, సాంప్రదాయకంగా వోక్ ఆకారంలో ఉండే లోతైన పాన్ 'అప్పచట్టి'లో వండుతారు. ఇది భారతదేశ రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, శ్రీలంకలలో ప్రసిద్ధ వంటకం.[2] శ్రీలంకలో వీటిని సాధారణంగా హాప్పర్స్ అని పిలుస్తారు. అప్పాలను ఎక్కువగా ఉదయం అల్పాహారం లేదా రాత్రి భోజనంగా వడ్డిస్తారు, తరచుగా కూరగాయలు లేదా కోడిగుడ్డు కూర లాంటి వాటితో కలిపి తింటారు.

వ్యుత్పత్తి

[మార్చు]

"అప్పం" (ఆపా, అప్పే అని కూడా అంటారు) అనే పదం ఒక రకమైన "వేయించిన రుచికరమైన ఆహారం" అని అర్థం వచ్చే సంస్కృతం పదం (అపూప apupa) నుండి ఉద్భవించి ఉండవచ్చు.[3]

చరిత్ర

[మార్చు]
అప్పం తయారు చేసే వీడియో

భారతీయ పాత్రికేయుడు వీర్ సంఘ్వి, ఆహార చరిత్రకారుడు కె.టి. అచయను ఉటంకిస్తూ తమిళ సంగం సాహిత్యంలో, పెరుంపాణాట్రుప్పడై లాంటి రచనలలో అప్పం ప్రస్తావన ఉందని పేర్కొన్నాడు.[1][4][5] ప్రాచీన తమిళ దేశంలో అప్పాలు బాగా స్థిరపడ్డాయని సంగం సాహిత్యంలో పేర్కొన్నట్లు అచయ తెలిపాడు, ప్రాచీన నగరమైన మధురైలోని వీధి మార్కెట్లలో మోదకంతో పాటు అప్పాలు అమ్ముడవుతున్నట్లు కవితలు వర్ణించాయి.[6][7]

“చీకటి పడగానే శంఖాల శబ్దాలు ఆగిపోతాయి, దుకాణాలు మూతపడతాయి, వాటి తెరలు దించబడతాయి. తేనెపట్టు లాంటి సున్నితమైన అప్పాలను, చేతితో తయారు చేసిన, కొబ్బరి, చక్కెర, తీపి, పప్పులు నింపిన మోదకాలను విక్రయించే వ్యాపారులు నిద్రపోతారు."

అప్పాలు దోశలకు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ప్రారంభ దోశలను బియ్యం పిండితో తయారు చేసేవారు, తరువాత మినపప్పును ప్రవేశపెట్టారు, అప్పటి నుండి మినపప్పు దోశలో అంతర్భాగంగా మారింది.[1] దోశ వలె కాకుండా అప్పం తయారీ విధానం శతాబ్దాలుగా మారకుండా అలాగే ఉంది.[1] అప్పాలకు సంబంధించిన పురాతన వంటకాల్లో ఒకదాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించడానికి తయారు చేసే విధానంగా శ్రీరంగం ఆలయ గోడలపై వివరంగా చెక్కబడిన శాసనాలలో చూడవచ్చు.[8][9]

ద్వీప దేశమైన శ్రీలంకలో అప్పాలకు గొప్ప చరిత్ర ఉంది.[10] అప్పం పిండిని పులియబెట్టే విధానాలు చాలా ఉన్నాయి, కేరళకు చెందిన కొచ్చిన్ యూదులు ఈస్ట్‌కు బదులుగా తాజా కల్లును ఉపయోగించారని కొందరు యూదు చరిత్రకారులు గమనించారు.[11][12]

వైవిధ్యాలు

[మార్చు]
వండుతున్న అప్పం
తమిళనాడులో కొబ్బరి పాలతో వడ్డించిన అప్పం
గుళి అప్పం (గుంట పొంగనాలు)
కేరళలో శనగల కూరతో వడ్డించిన అప్పం
మధ్యలో గుడ్డుతో వండినది

ఇడియప్పం

[మార్చు]

ఇడియప్పం (స్ట్రింగ్ హాప్పర్ లేదా నూల్‌పుట్టు) ఫ్లాట్ స్పైరల్స్‌గా వంకర్లు తిరిగిన రైస్ నూడుల్స్‌తో తయారు చేయబడుతుంది. ఉదయం అల్పాహారంగా వీటిని చేపలు లేదా చికెన్ పల్చటి కూర, కేవలం ఒకటి లేదా రెండు మాంసం ముక్కలు, పప్పు వంటకం, కారంగా ఉండే సాంబోల్ లేదా తాజా పచ్చడితో వడ్డిస్తారు. కిరి హోడి లేదా సోధి అని పిలిచే ఒక రకమైన కొబ్బరి పాల కూర ఇడియప్పంతో పాటు తీసుకునే మరో ప్రసిద్ధ వంటకం. ఉడికించిన బియ్యం పిండిలో నీరు, కొద్దిగా ఉప్పు కలిపి ముద్దగా చేసి, పాస్తా తయారు చేయడానికి ఉపయోగించే అచ్చు లాంటి దాని గుండా నొక్కి స్ట్రింగ్ హాప్పర్స్ తయారు చేస్తారు. వీటిని ఆవిరి మీద ఉడికిస్తారు. కొందరు రైస్ నూడుల్స్ మీద తురిమిన కొబ్బరిని కూడా చల్లుతారు. ఈ హాప్పర్స్ రెడీమేడ్‌గా కూడా కొనుగోలు చేయవచ్చు. భారతదేశం, శ్రీలంకలలో స్ట్రింగ్ హాప్పర్‌లను అల్పాహారం, రాత్రి భోజనంగా వడ్డించవచ్చు. ఉదాహరణకు ఉపయోగించే పిండి రకాన్ని బట్టి హాప్పర్లలో అనేక వైవిధ్యాలు ఉన్నాయి. ఈ సాధారణ వంటకానికి గిలకొట్టిన గుడ్లు లేదా కూరగాయలను జోడించడం ద్వారా స్ట్రింగ్ హాప్పర్ బిర్యానీ లాంటి ఇతర ఆహార పదార్థాలుగా మార్చవచ్చు.[13]

గుడ్డు మసాలా కూరతో ఇడియప్పం

అచ్చప్పం

[మార్చు]

అచ్చప్పం అనేవి బియ్యం పిండితో డీప్-ఫ్రై చేసి తయారు చేసే గులాబీ పువ్వుల ఆకృతిలో ఉండే కుకీలు.[14]

కుళలప్పం

[మార్చు]

కుళలప్పం అనేది సిరియన్ క్రైస్తవులు, సెయింట్ థామస్ క్రైస్తవుల సాధారణ వంటకం, ఇది గొట్టంలా చుట్టబడి వేయించిన కరకరలాడే చిరుతిండి.[15][16]

నెయ్యప్పం

[మార్చు]

నెయ్యప్పం మూలాలు కేరళలో ఉన్నాయి, హిందూ దేవాలయాలలో దేవునికి చేసే సాంప్రదాయ నైవేద్యంగా ఇవి ఉన్నాయి.[17] వీటిని బియ్యం పిండి, బెల్లం, నెయ్యితో తయారు చేస్తారు, ఇది నెయ్యప్పం తయారు చేసే సాంప్రదాయ పద్ధతి. విభిన్న సంస్కృతులు, మతపరమైన ఆచారాలు ఈ వంటకంలో వైవిధ్యాలను ప్రవేశపెట్టాయి.[17]

ఉన్ని అప్పం అనేది ఒక వైవిధ్యం, ఇందులో పిండికి మెత్తగా చేసిన అరటిపండును కలుపుతారు. ఈ పిండిని బియ్యం పిండి, బెల్లం, అరటిపండుతో తయారు చేసి, 'అప్పకారై' లేదా 'అప్పకారం' అనే పాత్రలో ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసిన నెయ్యిలో పోస్తారు. ఈ అప్పాలు చిన్న కప్పుల ఆకారాన్ని తీసుకుంటాయి, ముదురు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించబడతాయి.

కల్లప్పం

[మార్చు]

కల్లప్పం కేరళకు చెందిన సాంప్రదాయ అల్పాహారం. వీటిని పులియబెట్టిన బియ్యం పిండి, కొబ్బరి మిశ్రమంతో తయారు చేస్తారు. కేరళలోని క్రైస్తవులు ఈస్టర్ లాంటి ప్రత్యేక సందర్భాలలో వీటిని తయారు చేస్తారు.[18] ఈ పేరు మలయాళంలో తాటి కల్లు అని అర్థం వచ్చే 'కల్లు' నుండి ఉద్భవించింది, బియ్యం పిండిని పులియబెట్టడానికి సాంప్రదాయకంగా ఈ కల్లును ఉపయోగిస్తారు. ఈ వంటకం ఆధునిక తయారీలో కల్లు స్థానంలో ఈస్ట్ వచ్చి చేరింది.[19]

పెసహా అప్పం

[మార్చు]

పెసహా అప్పాలను కేరళలోని నస్రానీ క్రైస్తవులు పెసహా (పాస్ ఓవర్) పండుగ సమయంలో తయారు చేస్తారు. ఈ రకమైన అప్పాన్ని వడ్డించే ముందు సిరప్ లేదా 'పెసహా పాల్' (పాస్ ఓవర్ కొబ్బరి పాలు) లో ముంచుతారు.[20]

వట్టయప్పం

[మార్చు]
వట్టయప్పం

వట్టయప్పాలను బియ్యం పిండి, చక్కెర, కొబ్బరితో తయారు చేస్తారు. కేరళలోని మెజారిటీ గృహాలలో ఇవి నూనె లేని టీ-టైమ్ స్నాక్ (చిరుతిండి).[21] పిండిని ఆవిరి మీద ఉడికించడం ద్వారా ఈ వంటకాన్ని తయారు చేస్తారు, ఇది వియత్నాంకు చెందిన బాన్ బో (bánh bò) కు చాలా పోలి ఉంటుంది.

బర్మీస్ అపోన్

[మార్చు]

బర్మీస్ భాషలో 'అపోన్' (အာပုံ) అని పిలువబడే అప్పాలు బర్మీస్ వంటకాలలో సాధారణ వీధి ఆహారం.[22] డావే, మైక్ లాంటి తీరప్రాంత పట్టణాలలో, దక్షిణ మయన్మార్ ప్రాంతంలో ఇవి రుచికరమైన ఆహారంగా పరిగణించబడతాయి.[23][24]

కుయే అపెమ్

[మార్చు]
దక్షిణ కాలిమంటన్ లోని బంజార్ రీజెన్సీ, లోక్ బైంటన్ తేలియాడే మార్కెట్‌లో విక్రయిస్తున్న ఇండోనేషియా కుయే అపెమ్

ఇండోనేషియాలో 'కుయే అపెమ్' లేదా 'కుయే అపామ్' అని పిలువబడే అప్పం వైవిధ్యమైనది. ఇది కుయే (kue), బియ్యం పిండి, కొబ్బరి పాలు, ఈస్ట్, తాటి బెల్లంతో తయారు చేయబడిన ఉడికించిన పిండి సాంప్రదాయ కేక్, సాధారణంగా తురిమిన కొబ్బరితో వడ్డిస్తారు.[25] ఇండోనేషియా గృహాలు సాంప్రదాయకంగా వేడుకలు, పండుగల కోసం కమ్యూనిటీగా కుయే అపెమ్‌ను తయారు చేస్తాయి, కెరాటన్ యోగ్యకర్తలో సాంప్రదాయకంగా నిర్వహించే 'న్గాపెమ్' వేడుక లాంటి వాటిలో రాజ కుటుంబం 'టింగలన్ జుమెనెంగన్ దాలెమ్' వేడుకలో భాగంగా దీనిని సామూహికంగా వండుతుంది.[26] ఇది కుయే మంగ్‌కోక్‌ (kue mangkok) కు చాలా పోలి ఉంటుంది.

రోటీ జల

[మార్చు]

మలేషియా, ఇండోనేషియా, సింగపూర్‌లలో ప్రసిద్ధి చెందిన రోటీ జల అప్పం ద్వారా ప్రేరణ పొందింది, 15వ శతాబ్దంలో భారతదేశం నుండి అక్కడికి ప్రయాణించి ఉండవచ్చు.[27][28][29]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • లాహోహ్
  • బాఘ్రిర్
  • అపామ్ బాలిక్
  • దోశ
  • ఊతప్పం
  • పులియబెట్టిన ఆహారాల జాబితా
  • భారతీయ రొట్టెల జాబితా
  • పాన్‌కేక్‌ల జాబితా

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 Vir Sanghvi (2004). Rude Food: The Collected Food Writings of Vir Sanghvi. Penguin Books India. p. 110. ISBN 0143031392.
  2. Sankaranarayanan, A.; Amaresan, N.; Dhanasekaran, D. (2019-12-06). Fermented Food Products (in ఇంగ్లీష్). CRC Press. ISBN 978-1-000-76095-8.
  3. The Bloomsbury Handbook of Indian Cuisine - Page 27-Colleen Taylor Sen, Sourish Bhattacharyya, Helen Saberi · 2023
  4. Subhadra Sen Gupta (2012). "Always Ready for Appams!". Let's Go Time Travelling. Penguin UK. ISBN 978-8184756784.
  5. K. T. Achaya (November 2003). The Story of Our Food. Universities Press. p. 80. ISBN 81-7371-293-X.
  6. Food in Pathupattu Part III Maduraikanchi - Achaya, K.T. Indian Food: A Historical Companion. Oxford University Press 1994
  7. Champakalakshmi R. Trade, ideology and Urbanization South India 300 BC to 1300 AD. Oxford University Press India 1996.
  8. Gutiérrez, Andrea (2018), Jewels Set in Stone: Hindu Temple Recipes in Medieval Cōḻa Epigraphy. Religions., doi:10.3390/rel9090270
  9. Shoba (16 April 2015). "A Divine Treat". Open Magazine.
  10. Bullis; Hutton (2001). Food of Sri Lanka. Tuttle Publishing.
  11. Marks, Gil (2010). Encyclopedia of Jewish food. Wiley. ISBN 978-0-544-18631-6. OCLC 849738985.
  12. Sassoon, Essie, 1936- (14 June 2013). Spice & kosher : exotic cuisine of the Cochin Jews. Tamarind Tree Books Incorporated. ISBN 978-1-989242-11-7. OCLC 1268929164.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)
  13. Petrina Verma Sarkar (2011-03-02). "Appams - Appam Recipe - Hoppers - Hoppers Recipe". Indianfood.about.com. Archived from the original on 7 January 2016. Retrieved 2011-11-21.
  14. Menon, A. Sreedhara (1979). Social and cultural history of Kerala (in ఇంగ్లీష్). Sterling.
  15. K.T. Achaya (1997). Indian Food: A Historical Companion. Oxford University Press. ISBN 0195644166.
  16. Menon, A. Sreedhara (1979). Social and Cultural History of Kerala (in ఇంగ్లీష్). Sterling.
  17. 1 2 Dileep Padgaonkar (10 April 2010). "The appam takes on the naan". The Times of India.{{cite web}}: CS1 maint: deprecated archival service (link)
  18. "തനി നാടൻ കള്ളപ്പം, ഈസ്റ്റർ ദിനത്തിലെ പ്രഭാത ഭക്ഷണം". www.manoramaonline.com. Retrieved 2024-05-25.
  19. "Recipe of Kallappam, Breakfast dish, Kerala Food". Kerala Tourism (in ఇంగ్లీష్). Retrieved 2024-05-24.
  20. Amprayil, Kuruvilla Cherian (16 March 2008). "Kerala Nazranee Pesaha Receipes [sic]". Nasrani Syrian Christians Network. Retrieved 22 August 2009.
  21. "Vattayappam- an oil free tea time snack - Appam - Palappam - Pesaha Appam - Kerala Cuisines - Cake - Snacks - Steamed".
  22. "လှည်းတန်းတစ်ဝိုက်မုန့်စားကြမယ်". Yangon Life (in బర్మీస్). Archived from the original on 14 January 2021. Retrieved 2021-01-14.
  23. "ထားဝယ်ဆိုတာ လူငယ်တွေအတွက်ပါ". MDN - Myanmar DigitalNews (in బర్మీస్). Retrieved 2021-01-14.
  24. "မြိတ်လို့ခေါ်တဲ့ ကျွန်တော့်ရဲ့ဇာတိမြေ | MingalaGO မြန်မာခရီးသွားလမ်းညွှန် – မြန်မာနိုင်ငံခရီးသွားဆိုင်ရာ တန်ဖိုးရှိအသုံးဝင်သော သတင်းအချက်အလက်များ". MingalaGO (in బర్మీస్). Archived from the original on 15 January 2021. Retrieved 2021-01-14.
  25. "Kue Apem Kukus" (in Indonesian). Sajian Sedap. 16 December 2010. Archived from the original on 12 July 2015. Retrieved 25 June 2015.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  26. "Para Puteri Sri Sultan Luwes Membuat Apem di Prosesi Ngapem - Tribun Jogja". Tribun Jogja (in ఇండోనేషియన్). 2018-04-14. Retrieved 2018-07-02.
  27. Mok, Opalyn (6 July 2014). "Roti jala: Like a lace doily". Malay Mail.
  28. "Resep dan Sejarah Roti Jala Khas Melayu, Masuk ke Indonesia Sejak Abad ke 17", Tribunews (in ఇండోనేషియన్)
  29. Magenthiran, Lavanyah. "Unravelling the Secrets of Roti Jala: A Net of Culture and Flavour in Malaysia". Munchmalaysia.com.
"https://te.wikipedia.org/w/index.php?title=అప్పం&oldid=4905939" నుండి వెలికితీశారు