అబద్దం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నిజం కానిది అబద్ధం. పిల్లలు చెప్పే అబద్ధాలే వారి భవిష్యత్తు విజయానికి సంకేతమంటున్నారు. పిల్లలు నిజాన్ని దాచి అందంగా అబద్ధాన్ని చెబుతున్నారంటే వారిలో 'కార్యనిర్వాహక విధులు' నిర్వహించే సామర్థ్యం పెరిగినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండేళ్ల వయస్సులో 20% మంది అసత్యాలు చెబుతారని, నాలుగేళ్ల వయస్సు వచ్చేసరికి 50% మంది అబద్ధాలాడుతారన్నారు. 12 ఏళ్ల నాటికి అందరూ అసత్యాలు పలుకుతారని వివరించారు. 16 ఏళ్ల నుంచి ఈ శాతం తగ్గిపోతుందన్నారు. అబద్ధం చెప్పినా, అతికినట్లుగా, గోడ కట్టినట్లుగా ఉండాలి అని అంటారు. వినేవారిని ఇట్టే నమ్మించేటట్లు కొందరి అబద్దాలుంటాయి. కానీ టంగుటూరు మిరియాలు తాటికాయలంత అనే వ్యక్తి అబద్దమాడాలంటే అతను ఎంతో కొంత మనసులో ఊహించుకోవాలి. నార్కొ అనాలసిస్ లో వ్యక్తి సగం నిద్రలో ఉన్నట్లు నిజాలే చెప్పాల్సి వస్తుంది. ఈ పరీక్షలో సోడియం పెంటోథాల్ లేదా సోడియం అమైతాల్ అనే పదార్దాలని ఇచ్చిన వ్యక్తి ఏదీ ఆలోచించి మాట్లాడలేడు. చిన్న చిన్న ప్రశ్నలకు అవును లేదా కాదు అని జరిగినదానిని బట్టి సమాధానమివ్వగలడు.కొన్ని అధ్యయనాలు ఈ నార్కో పరీక్షలో అబ1ద్ధం చెప్పటం సాద్యమే అని నిరూపించాయి. అద్దం అబద్ధం ఆడుతుందా? అని సామెత.

"https://te.wikipedia.org/w/index.php?title=అబద్దం&oldid=1897748" నుండి వెలికితీశారు