అబద్దాల కథలు (ఊరి పేర్లు - ప్రచారాలు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అబద్దాల కథలు (ఊరి పేర్లు - ప్రచారాలు) శీర్షికతో విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన శీర్షిక.

విషయ సూచిక

శీర్షిక నేపథ్యం[మార్చు]

ప్రతి ఊరికీ ఓ పేరు వుంటుంది. ప్రతి పేరుకీ ఓ నేపథ్యమూ వుంటుంది. అందుకే- సాధారణంగా ఊరు పేర్లను మనం పరిశీలిస్తున్నప్పుడు అంతర్లీనంగా ఓ కథ మనల్ని పలకరిస్తుంది. అటువంటి కథలు నిజమా.. అబద్ధమా.. అని ఆలోచిస్తే... కొన్ని నిజాలుగా ఆశ్చర్యపరిస్తే .... మరికొన్ని పచ్చి అబద్దాలుగా నవ్వు తెప్పిస్తాయి. ఏది ఏమయినా ఆ ఊరికి ఓ కథ ఉందన్నది నిజం. ఆ ఊరికి ఆ పేరు రావడం వెనుక చారిత్రిక నేపథ్యం ఉంటే ఉండి ఉండవచ్చు. కొన్ని శాసనబద్ధమై ఉండవచ్చు. లేదా వ్యక్తి పేరో, పరిసరాల ప్రాముఖ్యతో లేదా మరేదయినా ఇతర అంశమో ఆ పేరుకు కారణం కావచ్చు. అసలు కారణాలు మరుగున పడిపోతున్న ప్రస్తుత తరుణంలో రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. అలాంటి అబద్ధాలను (కొన్ని నిజాలు కావచ్చు) ఏర్చి కూర్చి విశాలాంధ్ర దినపత్రిక 'అబద్దాల కథలు' శీర్షికతో 'ఆదివారం అనుబంధం'లో సుమారు మూడున్నర సంవత్సరాలుగా ధారావాహికంగా అందిస్తోంది. పేరు కథనాలకు సరియైన ఆధారాలు లభించనంతవరకూ వీటిని అబద్ధాలుగానే పరిగణించాల్సి వుంటుందన్నది అక్షర సత్యం. ఈ ఊరి పేర్లకు నిజమైన కారణాలు తెలిసినవారు ఆ కథనాలను ఖచ్చితమయిన ఆధారాలతో సహా ఈ అబద్ధాల కథలకు దిగువున 'అసలు నిజం'గా జోడించవచ్చు. అంతవరకూ వీటన్నింటినీ 'అందమైన అబద్ధాలు'గా భావించి హాయిగా నవ్వుకోవచ్చు.

అందమయిన అబద్ధాలు[మార్చు]

నిజం నిష్టూరంగా ఉంటుందన్నది నానుడి. అబద్ధాలు ఎప్పుడూ అందంగానే ఉంటాయన్నది కూడా ఒక వాడుక..అందుకే అంటారేమో 'అబద్ధాలు చెబితే అతికినట్టు ఉండాలని'! ముఖ్యంగా ఊరి పేర్లకు ప్రచారంలో ఉన్న... లేదా.. చెప్పుకొస్తున్న కథనాలు అచ్చం అతికినట్టుగా ఉండటం నిజాన్ని దగ్గరగా చూస్తున్నట్లుగా ఉంటుందే తప్ప అవి నిజం కాదు. అందుకే నిజం తెలిసేంతవరకూ వీటిని .'అబద్ధాల కథలు' శీర్షికతో ప్రకటించడం సమంజసంగా ఉంది. ఇంక 'కథాలోకం'లోకి ప్రవేశిద్దాం.

[మార్చు]

అట్లూరు[మార్చు]

మనం ఇంకా సాంకేతికంగా అభివృద్ధి చెందని రోజులవి! నిప్పును కనుక్కున్న మనిషి ఆహారాన్ని వండుకుని తినడం ప్రారంభించాడు. పచ్చి మాంసం, కూరగాయల్ని తినేసే మనిషి` వాటిని నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకు తినడం అలవాటు చేసుకున్నాడు. కూరలు, వేపుళ్ళు అప్పుడు లేనేలేవన్నమాట! అటువంటి రోజుల్లో ఓ మనిషి తన ఇంట్లోంచి బయటకి రావడం అందర్నీ ఆకర్షించింది. ఎందుకంటే` అతని చేతిలో జింక చర్మం... ఆ చర్మం మీద ఎర్రెర్రగా కాలి, సువాసనలు వెదజల్లుతున్న వేడి వేడి అట్టు ఉంది. ఆ అట్టు చూసేవారికి అందరికీ నోరూరి పోతోంది. అందరూ అతని చుట్టూ గుమిగూడారు. ఎలా చేశావని అడిగారు. నిప్పుమీద పలకగా ఉన్న రాయిని పెట్టి ఆ వేడి సెగలో పిండి పదార్ధాన్ని పోసి అట్టుగా మార్చాడట! ఆ విధానం అందరికీ నచ్చేసింది. అలా అలా ప్రచారం జరిగి... చివరికీ ప్రాంతం అట్టు ఊరుగా... అట్టులూరుగా... అట్లూరుగా పిలవబడుతోంది.

అమలాపురం[మార్చు]

పూర్వకాలంలో` అంటే` రాజరాజనరేంద్రుడు రాజ్యం చేసే కాలంలో అమల అనే రాజనర్తకి ఈ ప్రాంతంలోనే ఉండేదట! ఆమె గురించి రాజుగారి వార్తాహరులు తరచుగా వస్తూండటం, ఆమె సెక్యూరిటీ కోసం రాజభటులు ఆమె ఇంటి దగ్గర మరియు ఊళ్ళోనూ పెద్ద ఎత్తున కావలి కాస్తూండటం జరిగేది. దాంతో ఈ ప్రాంతాన్ని అమలూరు అని పిలచేవారట! కాలక్రమంలో అమలూరు అమలాపురిగా, ప్రస్తుతం అమలాపురంగా వ్యవహరిస్తున్నారు.

[మార్చు]

ఇంకొల్లు[మార్చు]

కొండరాళ్ళతో ఇటుకలతో ఇళ్ళు కట్టుకునే ప్రక్రియ ఇంకా అభివృద్ధి చెందని రోజులవి. అప్పట్లో ఇళ్ళంటే ` నాలుగువైపులా నాలుగు చెట్టుకొమ్మలు పాతి పైన కొబ్బరిమట్టలో... తాటిఆకులో వేసుకునేవారంతే! కొంచెం డబ్బున్న ధనవంతులైతే రెల్లు దుబ్బులతో ఇల్లేసుకునేవారు! కొండరాళ్ళతో ఇల్లుకట్టడం ప్రారంభమైన తర్వాత ఓ వ్యక్తి తొలిసారిగా ప్రయోగాత్మకంగా కొండరాళ్ళతో ఓ ఇల్లు కట్టాడు. ఎండావానల ఇబ్బందుల్లేకుండా ఆ ఇంటిలో నివాసం సౌకర్యవంతంగా ఉండటంతో అటువంటి ఇళ్ళపై అందరూ ఆసక్తి చూపించారు. ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ తెలిసిన అతన్నే అందరూ తమకు కూడా ఇల్లు కట్టమంటూ అడిగేవారు. ఇల్లు తర్వాత ఇల్లుగా ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందటంతో ఆ ప్రాంతాన్ని ‘ఇంకోఇల్లు’గా పిలిచేవారు. క్రమంగా అది ఇంకొల్లుగా మారిపోయింది.

ఇడుపుల పాయ[మార్చు]

మూఢనమ్మకాలు ఇప్పుడంటే లేవుగానీ, ఒకప్పుడు మూఢ నమ్మకాలు చాలా ఎక్కువగానే ఉండేవి! అటువంటి కాలంలో గాలిసోకిందనీ, లేదా గాలి పట్టిందనీ రకరకాలుగా ప్రచారం చేసేవారు! ఇలా గాలి పట్టినవాళ్ళకు ప్రత్యేక పూజలూ గట్రా చేసేవారు కూడా! అయితే ఇలాంటి పూజలేమీ అవసరం లేకుండానే`అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక పూటనిద్ర చేస్తే పట్టుకున్న గాలి చటుక్కున పోయేదట..! దాంతో ఈ ప్రాంతాన్ని విడుపులూరు అనీ విడుపులేరు అనీ పిలిచేవారట. పట్టుకున్న పట్టు కకావికలై పాయలుగా విడిపోతుంది కాబట్టే దీనిని ‘విడుపుపాయ’ విడుపులపాయ’గా పిలుస్తూ`చివరికి ఇడుపుల పాయగా వ్యవహరిస్తున్నారు.

[మార్చు]

కంచికచర్ల[మార్చు]

మన చిన్నప్పుడు మన తాతో.. బామ్మో.. మనకెన్నో కథలు చెప్పేవారు కదా! ఆఖర్న ‘కథ కంచికి.. మనం నిద్దట్లోకి..’ అనేవారు కూడా! అప్పట్లో ఇది మనకు సరదాగానే అనిపించినా... ఇదంతా నిజమే! ఆ కథలు నిజంగానే కంచికి వెళ్తాయట! అలా కంచికెళ్ళిపోయిన కథలు కుప్పలు తెప్పలుగా పెరిగి పోవడంతో పాతబడిపోయిన, పాడైపోతున్న కథల్ని దూరంగా తీసుకెళ్ళి పారేసేవారట! అలా ఆ కథల్ని ఇక్కడి చెరువులో పడేసేవారట! ఆ చెరువు ప్రాంతం ఇప్పుడొక ఊరుగా మారిపోయింది. కంచికెళ్ళిన కథలతో నిండిన చెరువు ప్రాంతం కాబట్టి దీనిని కంచికచర్లగా వ్యవహరిస్తున్నారు.

కాకినాడ[మార్చు]

బిటీష్‌ వాళ్ళు మనదేశంలోకి కొత్తగా వచ్చిన రోజులవి! ఇక్కడ పండే పంటల్నీ, విలువైన వస్తువుల్నీ తమ దేశానికి చేరవేసేందుకు రవాణా సౌకర్యం కలిగిన అనువైన ప్రదేశం కోసం గాలిస్తూండగా... ఈ ప్రాంతం వారి దృష్టిలోకి వచ్చింది. అధికారులు వచ్చారు. సర్వే చేశారు. పై అధికారులకు రిపోర్టు పంపిస్తూ ` ఇక్కడ కాకులు ఎక్కువగా ఉండటంతో ‘కాకులవాడ’ అంటూ పేర్కొన్నారట! ఒకప్పుడు ఈ ప్రాంతంలో కాకులు నిజంగానే ఎక్కువగా ఉండేవట మరి! అలా... అలా... జనం నోళ్ళల్లో నాని... నాని... ఈ ప్రాంతం కాకుల వాడగా స్థిరపడిరది. కాలక్రమంలో ‘కాకివాడ’గా... ‘కాకినాడ’గా మారిపోయింది!

కావలి[మార్చు]

పూర్వకాలంలో నమ్మకాలు చాలా ఎక్కువగా ఉండేవి. గుళ్ళూ గోపురాలు. పూజలూ వ్రతాలూ, పవిత్రస్థలాల సందర్శనాలూ చాలా ఎక్కువన్న మాట! అలాగే`ఈ ప్రాంతానికి కూడా ఒకమహిమ ఉం డేదట! శుచిగా స్నానంచేసి, తూర్పువైపుగా తిరిగి, మనం కోరుకున్నది ‘కావాలి... కావాలి...’ అని మూడుసార్లు చొప్పున మూడు రోజుల పాటు చేస్తే సరిగ్గా వారం రోజుల్లో కోరుకున్నది జరిగిపోయేదట! ఈ ప్రచారం ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదుగానీ జనం తండోపతండాలుగా ఇక్కడికి వచ్చేవారట! దాంతో ఈ ప్రాంతానికి ‘కావాలూరు’, ‘కావాలిపురం’, ‘కావాపురం’గా రకరకాలుగా పిలవబడేది. ఇదే కాలక్రమంలో ‘కావలూరు’గా మారి ప్రస్తుతం ‘కావలి’గా వ్యవహరించబడుతోంది.

కుయ్యేరు[మార్చు]

గోదావరి గలగలా పారుతుందనీ, సెలయేరు చకచకాపారుతుందని అంటుంటారు. కానీ ఇక్కడి కాలువ నీళ్ళు ప్రవహిస్తుంటే కుయ్‌కుయ్‌...కుయ్‌కుయ్‌ మంటూ విచిత్రమైన శబ్దాలు వచ్చేవి. ఈసెలయేటి అరుపులకు మొదట్లో జనం భయపడేవారు. తర్వాత అలవాటై పోయింది. కుయ్‌మంటూ అరచే ఏరున్న ఈ ప్రాంతం కుయ్యేరుగా పిలవబడుతోంది. కాలంగడిచే కొద్దీ యేరు అరవడం మానేసింది, అయినప్పటికీ ఈ ప్రాంతం పేరు మాత్రం కుయ్యేరుగానే మిగిలిపోయింది.

గ, ఘ[మార్చు]

గిద్దలూరు[మార్చు]

బ్రిటీష్‌ వాళ్ళు మనదేశంలో అధికారం చెలాయిస్తున్న రోజులవి! ఒక్కొక్క ప్రాంతాన్ని తమ కంపెనీ పరిపాలనకిందకి తెచ్చుకుంటున్న తెల్లవాళ్ళు... ఆయా ప్రాంతాలను తమకు అనుకూలమైన పేర్లతో పిలిచేవారు. ఒకప్పుడు కరువు కాటకాలతో ఆకలి చావులకు ఆలవాలంగా మారిన ఈ ప్రాంతంలో గెద్దలు ఎక్కువగా తిరిగేవట! దాంతో ఈ ప్రాంతాన్ని ‘గెద్దలూరు’గా బ్రిటీష్‌వారు వ్యవహరించేవారు. బ్రిటీష్‌ వారికాలంలోనే కొలతల విధానం అమలులోకి వచ్చింది. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా ‘గిద్ద’తో కొలవడం ప్రారంభమయ్యిందట! దాంతో ‘గెద్దలూరు’ కాస్తా ‘గిద్దలూరు’గా మారిపోయింది.

గొల్లప్రోలు[మార్చు]

శ్రీకృష్ణుడు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడనీ.. దాంతో వాళ్ళమ్మ యశోధ శ్రీకృషుణణ్ణి రుబ్బురోలుకి తాడుతో కట్టేసిందని మనం భగవతంలో చదువుకున్నాం కదా! యాదవుల్ని గొల్లలు అని కూడా పిలుస్తారు. ఆనాటి కాలానికి చెందిన రోళ్ళు కొన్ని తదనంతర కాలంలో ఈ ప్రాంతంలో దొరికాయట..! దాంతో ఈ ప్రాంతాన్ని గొల్లలరోలు’గా పిలిచేవారు. కాలక్రమంలో ఆరోళ్ళు ఏమయ్యాయో ఎవరికీ తెతీదు. కానీ` ఈ ప్రాంతం పేరు మాత్రం ‘గొల్లప్రోలు’గా స్థిరపడిరది.

చ, ఛ[మార్చు]

చాట్రాయి[మార్చు]

మనిషి తన నివాసం కోసం కొత్తగా ఇళ్ళుకట్టుకోవడం ప్రారంభించిన రోజులవి! కొబ్బరాకులతో, తాటిఆకులతో ఇల్లు వేసుకునే మనిషి అనంతరం కొండరాళ్ళతో ఇల్లుకట్టుకోవడం ప్రారంభించాడు. ఇంటిలోపల గదినేల మట్టితో అలికేవాడు. ఇదిలా వుండగా కొండరాళ్ళు కొట్టుకునే ఓ వ్యక్తి రాళ్ళను నున్నగా చెక్కుకుని తన ఇంటిగదిలో చపటాగా పరచుకున్నాడు. ఆ రాళ్ళను బంకమన్ను సాయంతో కదలకుండా గట్టిచేయడంతో ఆవిధానం అందరికీ నచ్చేసింది. తమ ఇంట్లో కూడా చపటా రాయి పరవమంటూ అందరూ అడిగేవారు. ఇంటి గదుల్లో చపటారాయి పరచిన ప్రాంతం కాబట్టి... ఈ ప్రాంతాన్ని అందరూ ఇదే పేరుతో పిలువడం ప్రారంభించారు. మొదట్లో ‘చపటారాయి’గా ...‘చపట్రాయి’గా పిలువబడిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ‘చాట్రాయి’గా వ్యవహరిస్తున్నారు.

చీరాల[మార్చు]

త్రేతాయుగంలో రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోతుండగా సీతాదేవి తన ఆభరణాలన్నింటినీ చీరకొంగును చింపి, అందులో కట్టి కిందపడేసిందట...! సరిగ్గా ఆ సమయంలోనే అంటే సీతాదేవి తన చీర చెంగు చింపుతున్న సమయంలో చీరలోని ఒక పీలిక గాలికి ఎగిరిపోయిందట...ఆ చీరముక్క కింద పడిన ప్రాంతాన్నే చీరరాలిన ప్రాంతంగా పిలుస్తారు. అదే క్రమేణా చీరరాలూరు చీరాలూరుగా పిలువబడి ప్రస్తుతం చీరాలగా స్థిరపడిరది.

త, థ[మార్చు]

తాటిపాక[మార్చు]

క్రీస్తు పూర్వం వేల వేల ఏళ్ళ కిందట మనిషికి మాట్లాడటం రాదు. దుస్తులంటే తెలియదు. ఆహారం ఉడకబెట్టుకుని లేదా కాల్చుకుని తినాలని తెలియదు. ఉండటానికి ఓ గూడు ఏర్పాటు చేసుకోవాలని కూడా తెలియదు. ఎండకి ఎండి... వానకి తడిసి... చలికి వణకుతూ... జంతువుల్లో జంతువులా... చెట్లంపటా పుట్లంపటా తిరుగుతూ కాలం గడిపేసే మనిషి తనకు రక్షణ కావాలని తపించాడు... తహతహలాడాడు. తాటి ఆకులతో పాక వెయ్యొచ్చని ఓ మనిషి ప్రయోగాత్మకంగా కనుగొని చిన్న గూడు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పట్లో అదో సంచలనం. అప్పట్నుంచీ ఈ ప్రాంతాన్ని తాటిపాకగా పిలిచేస్తున్నారు.

ద, ధ[మార్చు]

దగ్గుబాడు[మార్చు]

సుమారు ఏడొందల సంవత్సరాల కిందట క్షయవ్యాధి దక్షిణ భారతాన్ని అతలాకుతలం చేసేస్తోంది. పర్యావరణం మొత్తం కలుషితం కావడం వల్లే రకరకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయని భావించిన ‘ఓ భూస్వామి’ దట్టమైన కీకారణ్యం మధ్యలో ఓ చిన్నపల్లెటూరు నిర్మించి సంపూర్ణ ఆరోగ్యవంతులకే ప్రవేశార్హత కల్పించాడు. వైద్యనిపుణుల నిరంతర పర్యవేక్షణలో ఆ ప్రాంతం దగ్గు మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టేసింది. దీంతో ఈ ప్రాంతాన్ని ‘దగ్గులేని ఊరు’గా దగ్గులేరుగా పిలిచేవారు. కాలక్రమంలో అది కాస్తా దగ్గులేదుగా, దగ్గులేడుగా, దగ్గుపాడుగా మారి చివరికి దగ్గుబాడుగా స్థిరపడిరది.

దాచేపల్లి[మార్చు]

బంగినపల్లి మామిడి పండు పేరు మనకు తెల్సిందే కదా! అలాగే` దాచినపల్లి అని కూడా మామిడిపళ్ళల్లో మరో రకం ఉండేది. బంగినపళ్ళూ దాచినపళ్ళూ చూడ్డానికి ఒకేలా నిగనిగలాడుతూ ఉంటాయి. అయితే` బంగినపళ్ళు కోసి ముక్కలుగా కూడా తినొచ్చు. కానీ` దాచినపళ్ళకు పై తొక్క కొంచెం గట్టిగా ఉంటుంది. చిన్న గాటు పెట్టగానే రసం ధారగా వచ్చేస్తుంది. కాలక్రమంలో ఈ పళ్ళ చెట్లు అంతరించి పోయాయి. ఈ పంట ఎక్కువగా పండే దాచేపల్లి మాత్రం ఆ తీపి పళ్ళను గుర్తు చేస్తుంటుంది.

దుబ్బాక[మార్చు]

ఇప్పుడంటే ఆధునికవైద్యం వచ్చిందిగానీ`పూర్వం అన్ని రకాల వ్యాధులకీ ఆకుపసర్లే వైద్యం! అటువంటి ఆకుల్లో అత్యుత్తమమైన అమోఘమైన ఆకు ఇక్కడుండేదట! పూర్వం అంటే త్రేతాయుగంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆంజనేయుడు మోసుకొచ్చిన రకరకాల వనమూలికల చెట్టున్న సంజీవినీ పర్వంతపై నుంచి ఆయనొచ్చిన గాలివేగానికి ఓ మొక్క ఎగిరి ఇక్కడ పడిరదట! ఆ మొక్క దుబ్బుగా ఉండేదట! ఎటువంటి రోగానికైనా ఈ ఆకుపసరు పూస్తే వ్యాధి ఇట్టే మాయమై పోయేదట! దాంతో ఈ ప్రాంతాన్ని అదే పేరుతో దుబ్బాకగా పిలుస్తున్నారు. ఇప్పుడీ మొక్క ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు మరి!

దోమలగూడ, దానవాయిపేట[మార్చు]

ఈ విశాల ప్రపంచంలో ప్రాణికోటిని సృష్టిస్తున్న క్రమంలో ఆ భగవంతుడు దోమల్ని కూడా సృష్టించి భూమ్మీదకు వదులుతుండగా` ‘ఇంత చిన్నప్రాణులం. ఇంత పెద్ద మనుషుల మధ్య, జంతువులమధ్య మేం ఎలా బతికేది?‘అంటూ దోమలు భగవంతుడ్ని అడిగాయి. అప్పుడు ఆ దేవుడు`’ మూసీనదీతీరంలో అభయారణ్యంలో జీవించమని ఆదేశించాడు. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దోమలు గూడుకట్టుకున్న ప్రాంతం కావడంతో ఆ అడవి ప్రాంతం ‘దోమలగూడ’గా ప్రసిద్ధికెక్కింది. క్రమక్రమంగా దోమజాతి వృద్ధి చెందడంతో మరో సురక్షిత ప్రదేశం కోసం అన్వేషిస్తూ కొన్ని దోమలు గోదావరీనదీ తీరం చేరుకున్నాయి. అక్కడ నివశించే ప్రజల్ని చూడగానే దోమలకు ఉత్సాహం ముంచుకొచ్చి జనాన్ని కుట్టివాయించేశాయి, దోమలు వాయించే ప్రాంతం కావడంతో ఆ ప్రాంతం ‘దోమవాయిపేట’గా పిలవబడిరది.ఆ తర్వాత కాలంలో అదే దానవాయిపేటగా రాజమండ్రిలో ఓ భాగమైతే`దోమల గూడ హైదరాబాద్‌లో ఓ ముఖ్య ప్రాంతంగా విరాజిల్లుతోంది.

[మార్చు]

నాగార్జునకొండ[మార్చు]

ఖాండవదహన సమయంలో అర్జునుడు శరపరంపరగా కురిపించిన బాణాగ్ని ధాటికి కోటానుకోట్ల నాగులు శలభాల్లా మాడిమసై పోయాయట! దీంతో మొత్తం నాగజాతే అంతమై పోతుందేమోనన్న భయం నాగరాజుకు పట్టుకుందట. వెంటనే నాగరాజు వాసుకితో కలసి అర్జునుడిని శరణు వేడిరదట. కరుణించిన అర్జునుడు దూరంగా ఉన్న కొండప్రాంతంలో నివశించ మని ఆదేశించాడట. అర్జునుడి రక్షణ పొందిన నాగులున్న కొండ కాబట్టి దీన్ని నాగార్జునకొండ అనిపిలుస్తున్నారు. అయితే ` సినిమా యాక్టర్‌ నాగార్జున తన తొలి సినిమా విక్రమ్‌ షూటింగ్‌కోసం ఈ కొండ ఎక్కాడనీ, దాంతో ఈ కొండ నాగార్జునకొండ అయ్యిందని నేటి పిల్లకాయలంటే మాత్రం మనం ఏం చెయ్యలేం!

నాగోల్‌[మార్చు]

భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామం జోరుగా సాగుతున్న రోజులవి! తెల్లవాళ్ళ దురాగతాలతో దేశం అట్టుడిగి పోతున్న సమయంలో` నిజాం ప్రభువుల పాలనలో ప్రస్తుత హైదరాబాద్ కు చెందిన ఈ ప్రాంత ప్రజలు కొద్దిగా ప్రశాంతంగానే జీవిస్తున్నారు. కుట్రలకూ, కుతంత్రాలకూ మారుపేరైన తెల్లసైనికులు దొంగచాటుగా ఈ ప్రాంతంలో ప్రవేశించి ప్రజల మధ్య వైషమ్యాలు రగల్చడానికి ప్రయత్నించారు. దీనిని ముందుగానే పసిగట్టిన గ్రామస్తులు నాగుల్లా బుసలుకొట్టి తెల్లసైనికుల దురాగతాలను తిప్పి కొట్టి వారిని తరిమికొట్టారు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. కోడెత్రాచుల్లాంటి ఈ ప్రాంత యువతను స్ఫూర్తిగా తీసుకున్న నిజాం ప్రజలు ఈ ప్రాంతాన్ని ‘నాగూల్‌’గా పిలవడం ప్రారంభించారు. అదే ప్రస్తుతం నాగోల్‌గా వ్యవహరించబడుతోంది

నెల్లూరు[మార్చు]

ఒక్కో ప్రాంతం... ఒక్కో జంతువు లేదా పక్షులు లేదా పురుగులకూ ప్రసిద్ధి! అలాగే నల్లులు బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతం ‘నల్లులూరు’. ఈ ప్రాంతం చిత్తూరు అడవులకు దగ్గరగా ఉండటంతో అప్పుడప్పుడూ సింహాలూ తదితర జంతువులు జనావాసాలలోకి వచ్చేసేవి. దాంతో ఈ ప్రాంతాలన్నీ సింహాలు తిరగే వూరుగా.. సింహపురిగా పిలిచేవారు. అనంతర కాలంలో అడవిజంతువుల్ని బాగా కట్టడిచేయ గలిగారు. కానీ, నల్లులు మాత్రం అలాగే ఉండిపోయాట! దాంతో నల్లులూరుగా నల్లూరుగా పిలువబడి ప్రస్తుతం నెల్లూరుగా వ్యవహరించ బడుతోంది. అలాగే- నెల్లూరు ప్రాంతంలో "వరి" పంట ప్రసిధ్ధి కావడంతో 'నెల్లి' అనగా వరి అనే అర్థంతో నెల్లూరుగా పిలవబడుతోందని కూడా చెబుతారు.

ప, ఫ[మార్చు]

పరకాల[మార్చు]

మనిషికి ఒకప్పుడు ఉచ్ఛారణ కూడా తెలిసేది కాదు! అడవిజంతువులతో బాటే సంచరిస్తూ... జంతువుల్లాగే అరుస్తూ ఉండేవాడట! ఆ తర్వాత చాలాకాలానికి మనిషి సంజ్ఞ చేయడం నేర్చుకున్నాడు. క్రమక్రమంగా ఉచ్ఛారణ తెలిసింది. పలకడం అన్నది ఈ ప్రాంతంలోనే ప్రప్రథమంగా ప్రారంభమయ్యిందని నానుడి! ఈ ప్రాంతంలో కొద్దికాలం నివసిస్తే పలకడం బాగా వస్తుందన్న ప్రచారం వ్యాపించడంతో ఈ ప్రాంతాన్ని ‘పలకాల’గా పిలిచేవారు. అదే కాలక్రమంలో ‘పరకాల’గా స్థిరపడిరది.

పలమనేరు[మార్చు]

నీటి వసతులున్న ప్రాంతంలోనే జనావాసాలు ఏర్పడు తుంటాయి. సాధారణంగా ఏ చెరువులో నీరైనా స్వచ్ఛంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలోని నీటిచెలమ (చెరువు) లోని నీరు మాత్రం భలే తియ్యగా నిజం చెప్పాలంటే అమృతంలా ఉండేదట! దాంతో చుట్టుపక్కల ప్రాంతాలలోని ప్రజలంతా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ స్థిరపడి పోయారు. ‘‘చలమనీటి’ కోసం వచ్చే ప్రజలు ఈప్రాంతాన్ని అదే పేరుతో పిలిచేవారు. చలమల నీరు, చెలమనీరుగా కొంతకాలం చెలామణిలో ఉన్న ఈప్రాంతం కాలక్రమంలో పలమనేరుగా పిలవబడుతోంది.

పాలకొల్లు[మార్చు]

పూర్వకాలంలో మనుషుల మధ్య వివక్షచాలా ఎక్కువగా ఉండేది. రాజఉద్యోగులకూ, సామాన్య ప్రజలకూ మధ్య ఈ తేడా కొట్టొచ్చినట్టు కనబడేది. రాజుగారు తన కొలువులో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేకంగా నివాసాలు ఏర్పాటు చెయ్యడంలోనే ఈ చిక్కంత వచ్చిపడిరది. ప్రజలలో భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత అంత త్వరగా పోవు కదా! దాంతో రాజ ఉద్యోగులు నివసించే ప్రాంతాన్ని పాలకుల ఇళ్ళుగా పిలుస్తూ సామాన్యులు దూరదూరంగా తిరుగుతుండేవారు. కాలక్రమంలో దీనినే ‘పాలక ఇల్లు’...‘పాలకొల్లు’గా వ్యవహరిస్తున్నారు.

పిడుగురాళ్ల[మార్చు]

ఆకాశంలో దట్టంగా మేఘాలు పరచుకుని ఉన్నప్పుడు ఆకాశంలో మెరుపులు, ఉరుములు సర్వసాధారణం! ఒక్కోసారి మెరుపులు మెరుస్తూ దిక్కులు పిక్కటిల్లిపోయేలా ఉరుములు రావడం... పిడుగులు కూడా పడటం మనకు తెలిసిందే! పిడుగులు పడినప్పుడు అప్పుడప్పుడూ వడగళ్ళు అంటే మంచు గడ్డలు పడటం కూడా మనం చూస్తుంటాం! వాతావరణ పరిస్థితులు మారుతున్నప్పుడు ప్రకృతిలో ఇదంతా చాలా సహజమని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. అయితే` కొన్ని వేల సంవత్సరాల కిందట చాలా అసహజంగా అక్కడ మాత్రం పిడుగులు పడినప్పుడు వడగళ్ళు కాకుండా చిన్నచిన్న రాళ్ళు కురిశాయట! ప్రపంచంలో ఎప్పుడు... ఇంకెక్కడా... ఇలా జరగలేదట! దాంతో ఈ ప్రాంతాన్ని ‘పిడుగురాళ్ళు’ అని పిలిచేవారు. ప్రస్తుతం పిడుగురాళ్ళగా వ్యవహరిస్తున్నారు!

పెదకాకాని, చినకాకాని[మార్చు]

ఒకప్పుడు అంతా చిన్న చిన్న తండాలుగా నివసించేవారు. ప్రజల మంచిచెడ్డలు చూస్తూ... చిన్న చిన్న తగాదాలు తీరుస్తూ తండా పెద్దగా ఒకాయన ఉండేవారట! అందరూ ఆయన్ని ‘కాకా’ అని పిలిచేవారట. ఆయనకు ఇద్దరు పిల్లలు. వాళ్ళని అందరూ ‘పెదకాకా’, ‘చినకాకా’ అని పిలచేవారు. కాకా తదనంతరం కూతవేటు దూరంలో ఇద్దరు కుమారులూ చిన్న గుడిసెలు వేసుకుని తండా రక్షణ చేసేవారట. పెద్ద కుమారుడున్న ప్రాంతాన్ని ‘పెదకాకావని’ చిన్నకుమారుడు ఉండే ప్రాంతాన్ని ‘చినకాకావని’ అని పిలిచేవారు. అదే ఇప్పుడు పెదకాకానిగా చినకాకానిగా పిలుస్తున్నారు.

పేరాల[మార్చు]

భాషకు లిపి కనిపెట్టిన కొత్తలో ` ఇప్పుడు మనం రాస్తున్న కామాలు, ఫులుస్టాపులూ, సెమికోలన్లూ, ఇన్వర్టెడ్‌కామాలూ, కొటేషన్లూ, బ్రాకెట్లూ, ఆశ్చర్యార్థకాలూ, క్వశ్చన్‌మార్కులూ... వంటివేం లేవు! క్రమక్రమంగా లిపి పరిణామక్రమం మారుతూ వచ్చింది. అందులో భాగంగా ఓ శాస్త్రిగారు మొట్టమొదటగా పేరాగ్రాఫ్‌లు రాయడం ప్రారంభించారట. పేరాలు రాసిన శాస్త్రిగారికి పేరిశాస్త్రి పేరు స్థిరపడిరది. పేరాలు రాసిన శాస్త్రిగారున్న ప్రాంతాన్ని పేరాలూరుగా, పేరలూరుగా, పేరిలూరుగా పిలచేవారట ! అదే కాలక్రమంలో ‘పేరాల’గా మార్పు చెందింది.

బ, భ[మార్చు]

బళ్ళారి[మార్చు]

మనిషికి రుచిగురించి తెలుస్తున్న రోజులవి! జిహ్వ చాంపల్యాన్ని సంతృప్తిపరచేందుకు కొత్త కొత్త వంట ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ` ఈ ప్రాంతానికి చెందిన హరి అనే వంటమనిషి బెల్లాన్నీ, పంచదారనూ మరగకాచి పాకంబట్టి బిళ్ళలుగా అచ్చులు పోశాడు. నోట్లో వేసుకుంటే భలేరుచిగా ఉన్నాయా బిళ్ళలు! దాంతో అతనికి బిళ్ళ హరిగా పేరు స్థిరపడిపోయింది. అతనున్న ఈ ప్రాంతాన్ని అతని పేరుతోనే పిలిచేవారు. కాలక్రమంలో అది ‘బిళ్ళారి’గా ప్రస్తుతం ‘బళ్ళారి’గా మారిపోయింది.

బయ్యారం[మార్చు]

తెల్లవాళ్ళు మన దేశానికి రాకముందు తెల్లగా స్వచ్ఛంగా ఉండే కల్లే మనకు ఇష్టమైన సురాపానం! తెల్లవాళ్ళు వస్తూవస్తూ వారితో బాటు రమ్ము పీపా కూడా వెంట తెచ్చుకున్నారట! తెల్లదొరలు మన వాళ్ళల్లో కొంత మందిని చేరదీయడానికి వారికి కొద్దికొద్దిగా రమ్ము ఇచ్చేవారట! అలా మనవాళ్ళకి అలవాటయ్యింది. తెల్ల వాళ్ళని బాగా కాకా పట్టేసిన ఓ వ్యక్తి రమ్‌ అమ్ముకోడానికి పర్మిషన్‌ తీసుకుని షాపు పెట్టేశాడు! దాంతో ఆ షాపుకొచ్చిన జనం ‘భయ్యా... రమ్‌...’ ‘భయ్యా... రమ్‌...’ అంటూ అడిగేవారట! అలా... అలా... ఈ ప్రాంతం ‘భయ్యారమ్‌’గా వ్యవహారంలోకి వచ్చి, ప్రస్తుతం బయ్యారంగా పిలవబడుతోంది!

బండ్లగూడ[మార్చు]

మనిషి కొత్తగా ఇల్లు కట్టుకోవడం నేర్చుకుంటున్న తొలి రోజులు. ప్రపంచంలో అక్కడక్కడా చెట్లుఆకులతో, కొమ్మలతో, రాళ్ళతో కొద్దికొద్దిగా నీడ ఏర్పరచుకుంటున్న సమయంలో` ప్రస్తుత హైదరాబాదుకు చెందిన ఈ ప్రాంతంలో మొట్టమొదటి సారిగా బండలతో గూడు ఏర్పాటు చేసుకున్నాడో వ్యక్తి. ఈ విధానం అందరినీ ఆకర్షించడంతో అందరూ ఇదే విధంగా ఇల్లు కట్టుకోవడం ప్రారంభించారు. బండలతో గూడు కట్టుకునే విధానాన్ని మొట్టమొదటగా కనుగొన్న ఈ ప్రాంతాన్ని ‘బండ్లగూడ’గా పిలవడం ప్రారంభించారు. రాచరిక సంస్థాన ప్రభువులంతా ఇదే విధంగా తమతమ ప్రాంతాలలో ఇళ్ళు కట్టుకోవడంతో వాళ్ళపేర్లతోనే యూసఫ్‌గూడ, ఆసిఫ్‌గూడ, పొనుగోడ, కాచిగూడ, దోమల్‌గూడ,బైరామల్‌గోడ,గౌలిగూడ, నారాయణగూడ, మిరియాలగూడ, ఇలా అనేక ప్రాంతాలకు కొత్త పేర్లు వచ్చేశాయి.

బాపట్ల[మార్చు]

స్వాతంత్య్ర సమరం జోరుగా సాగుతున్న రోజులవి! అహింస అనే ఆయుధంతో తమను ముప్పతిప్పలు పెడుతున్న గాంధీ అంటే చాలు... తెల్లవాళ్ళు లాఠీలతో యిరగబాదేస్తున్నారు. దాంతో... పుల్ల అట్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే ఓ వృద్ధుడు తన అంగడికి ‘బాపు అట్లు’ అని పేరు పెట్టేసుకున్నాడు. బాపు అంటే అర్థం కాని తెల్లవాళ్ళు ఇతని జోలికి పోలేదు. ‘బాపు పుల్లట్ల’ వ్యాపారం జోరుగా సాగి పోయింది. ఇక ఊరూరా ‘బాపుఅట్లు’ వెలిశాయి. ఆ తర్వాత్తర్వాత ఈ ప్రాంతం బాపట్లగా ప్రచారంలోకి వచ్చేసింది.

భీమడోలు[మార్చు]

పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో భీముడు బకాసురుడికి ఆహారంగా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు బకాసురుడితో భీముడు హోరా హోరీ యుద్ధం చేశాడు. కొన్ని రోజులు, వారాలపాటు నిర్విరామంగా జరిగిన ఆ పోరాటంలో భీముడు బకాసురుడి తోలు వలిచి, డప్పుగా వాయించాడట! వాయించి... వాయించి... చివరికి విసుగెత్తి ఆ డోలు దూరంగా విసిరేశాడట! భీముడు విసరిన డోలు పడిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతాన్ని భీమడోలు అని పిలిచేస్తున్నారు!

భువనగిరి[మార్చు]

మనిషి కొత్తగా ఇల్లు కట్టుకోవడం నేర్చుకుంటున్న రోజులవి! ఆకులతో, రాళ్ళతో మనిషి ఇల్లు కట్టుకుంటున్న సమయంలోనే ఈ ప్రాంతంలో బంకమట్టికి సున్నం పొడి కలిపి కొండరాళ్ళతో ఓ పెద్ద ఇల్లు కట్టేశాడో పెద్దమనిషి. ఆ ఇంటిని అతను ఒక కొండమీద కట్టడంతో ` ఆ కొండను భవనగిరిగా పిలవడం ప్రారంభించారు. అదే కాలక్రమంలో భువనగిరిగా స్థిరపడి ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ ఇక్కడి కొండమీద ఓ పెద్ద భవనం కూడా ఉంది. అయితే ` అది అప్పుడు కట్టబడిరదో... ఆ తర్వాత కాలంలో కట్టబడిరదో చరిత్ర చదివితే తెలుస్తుంది.

[మార్చు]

మండపేట[మార్చు]

చాలా చాలా కాలం కిందట అంటే అతి పురాతన కాలంలో మనిషికి పచ్చి ఆహారమే శరణ్యం. ఆ తర్వాత మనిషి నిప్పును కనుగొన్నాడు. దక్షిణభారతంలో మొట్ట మొదటిగా రెండు రాళ్ళు రాపాడిస్తే నిప్పు పుడుతుందని ఇక్కడే కనుగొన్నారట..! అప్పట్లో ఇక్కడ పట్టుమని పదికుటుంబాలు కూడా నివసించేవి కావట..! దాంతో మంటను కనుగొన్న పేటగా దీన్ని పిలచేవారట...! ఆ తర్వాతర్వాత దీన్ని మంటలూరు అనీ, మంటపేట అనీ పిలచేవారు..! కాలక్రమంలో ఈ ప్రాంతం మండపేటగా వ్యవహరించ బడుతోంది.

మైలవరం[మార్చు]

పూర్వకాలంలో మాయలూ మంత్రాలకు పెద్ద డిమాండ్‌ ఉండేది. జనం కూడా వీటిని కొంచెం గట్టిగానే నమ్మేవారు. మంత్రగాళ్ళూ, మాయలోళ్ళూ ఈప్రాంతంలో ఎక్కువగాఉండే వారట! దాంతో దీన్ని ‘మాయలపురం’గా పిలిచేవారట. అయితే కాలం మారింది. కాలంతోబాటూ మూఢనమ్మకాలూ పోయాయి. ఒకాయన అక్కడే మకాంపెట్టి మాయలూ మంత్రాలు వట్టి కట్టుకథలేనంటూ తేల్చి పారేశారట! దాంతో ఈ ప్రాంతాన్ని ‘మాయా రాం రాం’ అనేవారట! అలా అలా కాలంతోబాటూ ఈ పేరూ రకరకాలుగా మార్పుచెంది ప్రస్తుతం ‘మైలవరం’గా పిలుస్తున్నారు.

[మార్చు]

రామగుండం[మార్చు]

త్రేతాయుగంలో శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ మేరకు అడవులకు వెళ్ళిన విషయం మనకు తెల్సిందే కదా! సీతా రామలక్ష్మణులు అడవుల్లో కాలినడకన వెళ్తుండగా మిట్ట మధ్యాహ్న సమయంలో వారికి ఆకలేసింది. లక్ష్మణుడు గబగబా ఆ పక్కనున్న చెట్ల నుంచి దుంపలు, కాయలు కోసుకొచ్చాడు. సీతాదేవి ఆహారం వండటానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. పొయ్యి ఎంతకీ వెలగకపోతే` రాముడు తమ కులదైవమైన సూర్యుడికి భక్తిగా దణ్ణం పెట్టుకుని పొయ్యి వెలిగించాడు. అంతే... పొయ్యి భగభగమంటూ మండిరది. రాముడు వెలిగించిన పొయ్యి ఉన్న ప్రాంతం కాబట్టి దీనిని రామగుండం అని పిలుస్తున్నారు. అందుకే... ఇక్కడ ఎండలు ఎక్కువ మరి!

రామచంద్రపురం[మార్చు]

త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో అయోధ్య నుంచి నడిచివస్తూ భద్రాచలం వద్ద పంచవటి నిర్మించుకోవడానికి ముందు రెండుచోట్ల మజిలీ చేశాడట! ఆయన మజిలీ చేసిన ప్రాంతాలు తర్వాత కాలంలో జనావాసంగా మారాయి. మొదటి మజిలీ ప్రస్తుత హైదరాబాదు‌ సమీపంలో ఉండగా, రెండో మజిలీ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు సమీపంలో ఉంది. ఈ రెండు ప్రాంతాలూ రామచంద్రుడు మజిలీ చేసిన పురాలుగా రామచంద్రపురం పేరుతో ప్రసిద్ధికెక్కాయి.

రాయప్రోలు[మార్చు]

శ్రీకృష్ణ దేవరాయల కాలం తెలుగు కవితా వైభవానికీ, శాంతీ సహజీవనాలకూ ప్రసిద్ధి చెందింది. రాయల కాలంలో రత్నాలు రాసులుగా వీధి సంతల్లో పెట్టి విక్రయించేవారట! అలాగే రాయల కాలం రకరకాల రుబ్బు రోళ్ళకు కూడా ప్రసిద్ధి కెక్కింది. అతిచిన్న రోలు నుంచి అతి పెద్ద రోలు వరకూ ఇంచక్కటి నగిషీలతో భలే అందంగా ఉండేవి! విజయనగర సామ్రాజ్యం అంతరించిపోయాక, రాయలకాలంనాటి శిల్పకళా వస్తువులన్నీ తలా ఒక చోటుకీ తరలించుకు పోయారు. రాయల కాలం నాటి రుబ్బురోళ్లు తరలించిన ప్రాంతాన్ని రాయలరోలుగా పిలిచేవారట! కొద్దికాలానికి ఆ రోళ్ళను దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. నాటి రాయలరోలు రాయపురోలుగా... ఆ తర్వాత రాయప్రోలుగా మారిపోయింది!

రావులపాలెం[మార్చు]

ప్ర్రతి మనిషికీ ఓ పేరు ఉంటుంది. ఆ పేరుకు చివర శర్మ అనో, శాస్త్రి అనో, మూర్తి అనో, నాయుడు అనో, చౌదరి అనో ` ఇలా ఏదో ఒకటుంటుంది. అయితే` ఈ పేరు చివర ‘రావు’లు ఎక్కువ ఉండేది మాత్రం ఇక్కడే! వీరారావు, వీరభద్రరావు, రామారావు, నాగేశ్వరరావు, శివరావు, శివాజీరావు, సుబ్బారావు, అప్పారావు, నరసింహారావు, నారాయణరావు` ఇలా పేరుకు ఆఖర్న రావుల్ని ఎక్కువగా ఇక్కడివారే పెట్టు కుంటుంటారు. రావులు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టే దీనిని రావులపాలెంగా పిలుస్తున్నారట! గతంలో ఎప్పుడో... ఓ వందా నూట యాభై సంవత్సరాల కిందటి విషయం ఇది! ఇప్పటికీ ఈ ఊరి పేరు ఇదే!

రేపల్లె[మార్చు]

ప్రస్తుతం రోజులు ఎలా ఉన్నాయంటే` ఎవరైనా బంధువులు వస్తే వారెప్పుడు వెళ్ళి పోతారా? అని ఎదురు చూసేట్లుగా ఉన్నాయి. కారణం`పెరిగిపోయిన ధరలే! కానీ ` అక్కడ మాత్రం బంధువులోస్తే వెళ్ళనివ్వరు. వాళ్ళు వెళ్తామంటే రేపెళ్ళండంటారు. ఏ రోజు కా రోజు`ఇదే మాట! అంత అతిథి మర్యాద! దాంతో ఈ ప్రాంతాన్ని ‘రేపెళ్ళి’గా ముద్దుగా పిలిచేవారు. అదే కాలక్రమంలో రేపల్లెగా స్థిరపడిరది.

[మార్చు]

వాల్తేరు[మార్చు]

ఒకప్పుడు జనాభాసంఖ్య చాలా తక్కువ! అక్కడక్కడా జనం గుంపులు గుంపులుగా... ముఠాలుగా... తండాలు గా... ఉండేవాళ్ళు! ఓ వైపు సముద్రం` మరోవైపు కొండ... ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో ఎక్కువ మంది ప్రజలు కొండవాలులో నివసించేవారు. ఈ నివాస ప్రాంతం కొండ నుంచి దిగువకు వాలుతున్నట్లుగా ఉండటంతో దీనిని వాలూరుగా... వాలేరుగా... వాలుతేరుగా... వాల్తేరుగా... వ్యవహరించేవారు! క్రమక్రమంగా అధికసంఖ్యలో జనం ఇక్కడికి వలస రావడంతో ఇది విశాలపురంగా... విశాలపట్నంగా... పిలవబడి ప్రస్తుతం విశాఖపట్నంగా స్థిరపడిరది.

వీరవాసరం[మార్చు]

మనం ఆంజనేయుడు గురించి విన్నాం కదా! అచ్చం అలాగే అత్యంత భారీ ఆకారంతో ఓ వానరం ఉండేది. సహజంగానే కోతులు చిలిపి చేష్టలు చేస్తుంటాయి కదా! ఈ వానరం కూడా ఆ దారినపోయే పర్యాటకుల్ని ముప్పుతిప్పలు పెడుతూ వాళ్ళ దగ్గరున్న సామాన్లూ ఆహారం ఎత్తుకుపోయేది. కోతుల్ని మచ్చిక చేసుకునే ఓ యువకుడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ కోతిని మచ్చిక చేసుకుని, ఆ వానరం వల్ల సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా చేశాడు. దాంతో ఈ ప్రాంతాన్ని వీరుడు పట్టుకున్న వానరవూరుగా పిలిచేవారు. ఆ తర్వాత్తర్వాత దీనిని వీరవానరంగా ప్రస్తుతం వీరవాసరంగా పిలుస్తున్నారు.

[మార్చు]

శృంగవరపుకోట[మార్చు]

రాచరికం అధికారం చెలాయిస్తున్న కాలమది! రాజులు రోజంతా పరిపాలనా బాధ్యతల్లో తలమునకలై అలసటకు గురైన సమయంలో విశ్రాంతి కోసమని ఓ మంచి ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలని భావించారు. ఊరుకు కాస్తంత దూరంగా పచ్చటి పంటపొలాల మధ్య ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశారు. మకాం చేయడానికి వీలుగా ఓ చిన్నకోట కూడా కట్టారు. వారం వారం రాజుగారు రాణిగారితో కలసి సరదాగా తోటకు వచ్చేవారు. ఓ రోజో రెండ్రోజులో ఆ కోటలో విడిది చేసి వెళ్ళేవారు. దాంతో దీన్ని ` రాజుగారు శృంగారానికి వచ్చే కోటగా శృంగవరపు కోటగా పిలిచేవారు. ఇప్పుడా తోట మనకు ఎక్కడా కనిపించదు.