అబాదా రైల్వే స్టేషను
ఆబాదా Abada | |||||||
|---|---|---|---|---|---|---|---|
| General information | |||||||
| Location | అబాదా , హౌరా జిల్లా | ||||||
| Coordinates | 22°32′52″N 88°11′58″E / 22.547856°N 88.199542°E | ||||||
| System | |||||||
| Owned by | భారతీయ రైల్వేలు | ||||||
| Line | హౌరా–ఖరగ్‌పూర్ లైన్ | ||||||
| Platforms | 3 | ||||||
| Construction | |||||||
| Structure type | ప్రామాణిక ఆన్-గ్రౌండ్ స్టేషన్ | ||||||
| Parking | లేదు | ||||||
| Bicycle facilities | లేదు | ||||||
| Other information | |||||||
| Status | యాక్టివ్ | ||||||
| Station code | ABB | ||||||
| Fare zone | ఆగ్నేయ రైల్వే | ||||||
| History | |||||||
| Electrified | అవును | ||||||
| |||||||
| |||||||
ఆబాదా భారతదేశం యొక్క పశ్చిమ బెంగాల్, రాష్ట్రములోని హౌరా జిల్లాలో ఒక గ్రామం ఉంది. దీని స్థానిక రైల్వే స్టేషను ఆబాదా రైల్వే స్టేషనుగా ఉంది. ఇది హౌరా-ఖరగ్‌పూర్ రైలు మార్గము (లైన్) లో ఉంది. ఇది హౌరా స్టేషను నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.
చరిత్ర
[మార్చు]హౌరా–ఖరగ్‌పూర్ లైన్ 1900 సం.లో ప్రారంభించబడింది.[1] బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే 1891 సం.లో నాగ్‌పూర్ నుండి అసన్సోల్ వరకు దాని ప్రధాన లైన్‌ను రాకపోకలకు ప్రారంభించింది. నాగ్‌పూర్–అసన్సోల్ లైన్‌లోని సిని జంక్షన్, 1898–99 సం.లో ఖరగ్‌పూర్ అలాగే కోలాఘాట్‌లకు అనుసంధానించబడింది. ఖరగ్‌పూర్–కటక్ విభాగం కూడా అదే సంవత్సరం ప్రారంభించబడింది. కోలాఘాట్–హౌరా ట్రాక్ 1899–1900 సం.లో పూర్తయింది. 19 ఏప్రిల్ 1900న రూపనారాయణ వంతెన ప్రారంభంతో ఖరగ్‌పూర్ హౌరాకు అనుసంధానించబడింది.
1968 సం.లో హల్దియా పోర్ట్ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే పన్స్కురా-దుర్గాచక్ లైన్ ప్రారంభించబడింది. తరువాత దీనిని హల్దియా వరకు పొడిగించారు. కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్‌లో భాగమైన హల్దియా డాక్ కాంప్లెక్స్ 1977 సం.లో ప్రారంభించబడింది. తమ్లుక్–దిఘా లైన్ 2004 సం.లో ప్రారంభించబడింది.
ట్రాక్‌లు
[మార్చు]హౌరా-పంస్కురా మార్గంలో మూడు లైన్లు ఉన్నాయి.[2]
విద్యుద్దీకరణ
[మార్చు]హౌరా-ఖరగ్‌పూర్ లైన్ 1967–69 సం.లో విద్యుద్దీకరించబడింది. పన్స్‌కురా-హల్దియా లైన్ 1974–76 సం.లో విద్యుద్దీకరించబడింది. సంత్రాగచి-బంకరానాయబాజ్ సెక్టార్ 1984–85 సం.లో విద్యుద్దీకరించబడింది. అన్ని లైన్లు 25 kV AC ఓవర్‌హెడ్ సిస్టమ్‌తో విద్యుద్దీకరించబడ్డాయి. 1976 సం.లో పన్స్‌కురా అలాగే హల్దియా మధ్య EMU రైలు సేవలు ప్రవేశపెట్టబడ్డాయి. 1979 సం.లో హౌరా - హల్దియా మధ్య ప్రత్యక్ష EMU సేవలు అందించబడ్డాయి.[3]
ప్రయాణీకుల సేవలు
[మార్చు]అబాదా రైల్వే స్టేషను ప్రతిరోజూ దాదాపు 6 మంది ప్రయాణికులను నిర్వహిస్తుంది.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
- ఆగ్నేయ రైల్వే
- పశ్చిమ బెంగాల్
మూలాలు
[మార్చు]- ↑ "Major events in formation of S.E.Railway". South Eastern Railway. Archived from the original on 1 April 2013. Retrieved 10 April 2013.
- ↑ "Howrah–Pune AC Duronto Express". indiarailinfo. Archived from the original on 18 November 2015. Retrieved 10 April 2013.
- ↑ "History of Electrification". IRFCA. Retrieved 10 February 2013.
- ↑ "Abada (ABB)". Indian Rail Enquiry. Retrieved 2 October 2013.