అబుల్ హస్నత్ ఖాన్
| అబుల్ హస్నత్ ఖాన్ | |||
| పదవీ కాలం 1998 – 2004 | |||
| ముందు | మొహమ్మద్ ఇద్రిస్ అలీ | ||
|---|---|---|---|
| తరువాత | ప్రణబ్ ముఖర్జీ | ||
| నియోజకవర్గం | జాంగీపూర్ | ||
| పదవీ కాలం 1977 – 1996 | |||
| ముందు | జెరత్ అలీ | ||
| తరువాత | మైనుల్ హక్ | ||
| నియోజకవర్గం | ఫరక్కా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) | ||
| జీవిత భాగస్వామి | రోకియా ఖానం | ||
| నివాసం | అర్జున్‌పూర్, ముర్షిదాబాద్ జిల్లా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అబుల్ హస్నత్ ఖాన్ (5 డిసెంబర్ 1946 - 30 ఏప్రిల్ 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు జాంగీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]అబుల్ హస్నత్ ఖాన్ 1946 డిసెంబర్ 5న ముస్లిం అలీ ఖాన్, దిలాఫ్రోజ్ ఖానం దంపతులకు బీహార్‌లోని దుమ్కాలో జన్మించాడు. ఆయన రవీంద్రభారతి విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశాడు. హస్నత్ ఖాన్ 1965లో రోకియా ఖానంను వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు కుమారులు & ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]అబుల్ హస్నత్ ఖాన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1977, 1982, 1987 & 1991 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో ఫరక్కా శాసనసభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
అబుల్ హస్నత్ ఖాన్ 1998, 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జాంగీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2004 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ చేతిలో ఓడిపోయాడు.
అబుల్ హస్నత్ ఖాన్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మాల్దాహా దక్షిణ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[1]
మరణం
[మార్చు]అబుల్ హస్నత్ ఖాన్ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 75 ఏళ్ల వయసులో కరోనావైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ 2021 ఏప్రిల్ 30న మరణించాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Maldaha Dakshin Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. the original నుండి 6 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 July 2025.
- ↑ "Covid kills 2 ex-legislators". The Times of India. 1 May 2021. the original నుండి 8 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 July 2025.
- ↑ "করোনোয় প্রয়াত সিপিএমের প্রাক্তন সাংসদ আবুল হাসনাত খান". TV9 Bangla. 30 April 2021. the original నుండి 8 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 July 2025.