అబు సలేం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Abu salem
జననం1968
Azamgarh district in Uttar Pradesh, India
వృత్తిunderworld don
జీవిత భాగస్వామిnone

అబు సలేం (Abu Salem) (జననం 1968) ఒక చీకటిసామ్రాజ్య అధినేత (అండర్‌వరల్డ్ డాన్), ఇతను భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అజమ్‌గఢ్ జిల్లాకు చెందిన వ్యక్తి. 1993 బాంబే వరుస బాంబు పేలుళ్ల కేసు మరియు 1997లో భారతదేశ సంగీత వ్యాపార దిగ్గజం గుల్షన్ కుమార్ హత్య కేసులో ఇతడిని దోషిగా నిర్ధారించారు.

జీవితచరిత్ర[మార్చు]

అజమ్‌గఢ్ జిల్లాలోని సారాయ్ మీర్ గ్రామంలో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో అబు సలేం జన్మించాడు. అబు తండ్రి వృత్తిరీత్యా న్యాయవాది. తండ్రి ఒక రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత అబు విద్యను పూర్తి చేయలేకపోయాడు. తన కుటుంబాన్ని పోషించేందుకు అబు మొదట సొంత పట్టణంలో ఒక చిన్న మెకానిక్ షాపు ప్రారంభించాడు. తరువాత కొద్దికాలానికే అతను భారతదేశ రాజధాని ఢిల్లీ నగరానికి చేరుకున్నాడు. ఢిల్లీలో అతను ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ తరువాత కొద్దికాలానికి అతను భారతదేశ ఆర్థిక రాజధాని బాంబేకు మకాం మార్చాడు. బాంబేలో కూడా అతను డ్రైవర్‌గానే పని చేయడం కొనసాగించాడు. బాంబేలోనే అతను చీకటిసామ్రాజ్యాధినేత దావూద్‌ను కలిశాడు, ఆపై అతని మాఫియా (ముష్కర మూక) లో చేరాడు. 1998లో అబు సలేం దావూద్ ముఠా నుంచి వేరుపడ్డాడు.[1]

ఇతను బాలీవుడ్ చలనచిత్ర దర్శకులు రాజీవ్ రాయ్ మరియు రాకేశ్ రోషన్‌లను హత్య చేసేందుకు విఫలయత్నం చేశాడు.[1] అబు సలేం ఒక సమయంలో దావూద్ ఇబ్రహీంకు ఒక సన్నిహత సహచరుడిగా ఉన్నాడు. ప్రొఫెషనల్ క్రిమినల్‌గా మారడానికి ముందు, ఇతను ముంబైలో డ్రైవర్‌గా మరియు వీధి వ్యాపారిగా పనిచేశాడు. ఇతను భారతదేశంలో వివిధ హత్యలు మరియు బలవంతపు వసూళ్ల కేసుల్లో నిందితుడిగా కూడా ఉన్నాడు.

సెప్టెంబరు 20, 2002న, అతడిని మరియు అతని ప్రేయసి మోనికా బేడిని పోర్చుగల్‌లోని లిస్బాన్‌లో ఇంటర్‌పోల్ అరెస్టు చేసింది. అతని శాటిలైట్ ఫోన్‌ను GPS సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గుర్తించారు. 1993 బాంబు పేలుళ్ల కేసుతోపాటు, బాలీవుడ్ నిర్మాత గుల్షన్ కుమార్, భారతీయ నటి మనీషా కోయిరాలా కార్యదర్శి, ఒక బిల్డర్ హత్య కేసులు మరియు మరో 50కిపైగా ఇతర కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు.

ఫిబ్రవరి 2004న, ఒక పోర్చుగల్ న్యాయస్థానం 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో విచారించేందుకు భారతదేశానికి అతడిని అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. నవంబరు 2005లో, పోర్చుగీస్ అధికారిక యంత్రాంగం, మోనికా బేడీతోపాటు అతడిని భారతీయ అధికారిక వర్గాలకు అప్పగించింది, అతనికి లేదా అతని ప్రేయసి మోనికా బేడికి మరణ శిక్ష పడకుండా చూస్తామని భారతదేశ హోం శాఖ మంత్రి ఎల్‌కే అద్వానీ ఇచ్చిన హామీపై వీరిని భారతీయ అధికారిక యంత్రాంగానికి పోర్చుగల్ అప్పగించింది.

మార్చి 2006లో, ఒక ప్రత్యేక TADA (టాడా) కోర్టు అతనిపై మరియు అతని అనుమానిత సహచరుడు రియాజ్ సిద్ధిఖీపై 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో ఎనిమిది అభియోగాలు దాఖలు చేసింది. ఆయుధాల రవాణా మరియు పంపిణీ నేరాల్లో అతను నేరాభియోగాలు ఎదుర్కొంటున్నాడు.

అబు సలేం ప్రస్తుతం ముంబయిలోని అత్యంత-పటిష్ఠ భద్రత గల ఆర్థూర్ జైలులో ఉన్నాడు.[ఉల్లేఖన అవసరం]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అతను మొదటి భార్య సమీరా జుమానీని 1991లో వివాహం చేసుకున్నాడు (ఒక కళాశాల బాలిక మరియు మైనర్ (17 సంవత్సరాల వయస్సు) గా ఉన్నప్పుడు ఈమెను సలేం బలవంతంగా వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి[2]), వీరికి ఒకరు లేదా ఇద్దరు కుమారులు ఉన్నారు. తరువాత వీరు విడాకులు తీసుకున్నారు.[3] సమీరా ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని జార్జియాలో ఉన్న దులుత్‌లో నివసిస్తున్నారు. ఒక నకిలీ పాస్‌పోర్టులో ఆమె ఉపయోగించిన పేరు సబీనా ఆజ్మీ, ఈ పేరునే ఆమె ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. అయితే సమీరా జుమానీ ఆమె అసలు పేరు.[4] నేహా అసిఫ్ జాఫ్రీగా కూడా గుర్తించే సమీరా జుమానీ ఒక పాస్‌పోర్ట్ ఫోర్జరీ కేసులో CBI మరియు ఇంటర్‌పోల్‌లకు కావాల్సిన వ్యక్తిగా ఉన్నారు.[5][6]

సలేం తరువాత రెండో భార్య, బాలీవుడ్ నటి మోనికా బేడిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది, ఆమె నుంచి ఇప్పటికీ అతను విడాకులు పొందాల్సివుంది.

చున్‌చున్ మియాన్‌గా కూడా గుర్తించబడే అతని సోదరుడు అబు హాతీమ్ ఇప్పటికీ అజమ్‌గఢ్‌లో నివసిస్తున్నారు, ఆయన ఇక్కడ అలామత్ తతారీ అని పిలిచే ఒక షాపు యజమాని, తన సోదరుడి గురించి హాతీమ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ: నా సోదరుడితో మాకెటువంటి సంబంధాలు లేవు, ఈ విషయం పోలీసులకు కూడా తెలుసని పేర్కొన్నారు. ఇంటర్-కళాశాల చదువు పూర్తి చేసిన తరువాత అతను మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లాడు, తిరిగి ఎన్నడూ తమ వద్దకు రాలేదని చెప్పారు." మెరుగైన అవకాశాల కోసం గల్ఫ్ వెళ్లాలని భావిస్తూ, అబు సలేం పైచదువులకై బాంబే వెళ్లాడని స్థానికులు చెబుతున్నారు. అయితే ఎలానో చీకటిసామ్రాజ్య నాయకుడు దావూద్ ఇబ్రహీం ముఠాలో చిక్కుకున్నాడని వారు పేర్కొన్నారు.[7]

అబు సలేం సొంత గ్రామానికి చెందిన ప్రజలు అతనిపట్ల ఏమాత్రం అభిమానం కలిగిలేరు. "అతడికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావడం లేదు. అతనిపట్ల మాకెంటువంటి అభిమానం లేదు. ఇంటర్ కళాశాల చదువు పూర్తి చేసిన తరువాత అతను గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లాడు, ఆపై ఎన్నడూ తిరిగి రాలేదని" తారీఖ్ మియాన్ అనే ఒక వృద్ధుడు చెప్పాడు. “అతని పెద్ద సోదరుడు అబు హాతీమ్ లేదా చున్‌‍చున్ మియాన్ ఇప్పటికీ ఇక్కడ ఒక షాపు యజమానికిగా ఉన్నాడని" తెలిపారు.[8]

డి-కంపెనీతో అనుబంధం[మార్చు]

పది సంవత్సరాల క్రితం, అంధేరీ స్టేషన్ వెలుపల వినియోగదారులకు వంచనతో తక్కువరకం ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయిస్తూ వ్యాపారం చేసిన ఒక వ్యక్తి ఆపై బాలీవుడ్ యొక్క అతిపెద్ద నిజజీవిత విలన్‌గా మారాడు. ఆపై దావూద్ సోదరుడు అనీస్‌తో అనుబంధం అతని జీవితాన్ని మార్చివేసింది, తరువాత అతను దావూద్ కంపెనీ బాలీవుడ్ వ్యవహారాలకు అధిపతి అయ్యాడు. మొదట చోటా షకీల్ కింద పనిచేసిన సలేం, తరువాత షకీల్ ముఠా నుంచి విడిపోయి, చలనచిత్ర ప్రముఖులను బెదిరించి బలవంతపు వసూళ్లు చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు అతను చేసిన నేరాలకు ముంబయి ఆర్థూర్ జైళ్లో పర్యవసానాలు అనుభవిస్తున్నాడు. సలేం యొక్క అనైతిక మార్గాలు మరియు అనియంత్రిత శైలిపై ప్రతీకారం తీర్చుకునేందుకు పోలీసు యంత్రాంగానికి అతడిని పట్టుకోవడంలో షకీల్ సహకరించాడని ఒక సాధారణ విశ్వాసం ఉంది.[9]

మొదటి అరెస్ట్[మార్చు]

1991లో పోలీస్ అడిషనల్ కమిషనర్ (వాయువ్య ముంబయి) అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ (1991 లోఖండ్‌వాలా కాంప్లెక్స్ షూటౌట్‌ సూత్రధారి) ఒక చిన్న వ్యాపారవేత్త నుంచి ఇతను బలవంతంగా డబ్బు వసూలుకు జరుగుతున్న ప్రయత్నం గురించి విన్నారు. "అతడిని పట్టుకునేందుకు నేను ఇద్దరిని పంపాను. అతడిని నా ఎదుట హాజరు పరిచినప్పుడు, పోలీసులు నిందితులను విచారించేందుకు పెట్టే చిత్రహింసలకు భయపడినట్లు కనిపించిన ఒక సాధారణ దయనీయమైన వ్యక్తిగా కనిపించాడు. అతనికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చాము. అతడిపై దృష్టి పెట్టేందుకు పెద్ద చరిత్రగల నేరస్తుడేమీ కాదు. " సలేం తరువాత కొంతకాలానికి విడుదలయ్యాడు, అయితే పోలీసులు తీసుకున్న వేలిముద్రలు మాత్రం అతడిని చివరి వరకు వెంటాడాయి. లిస్బాన్‌లో అరెస్టు చేసినప్పుడు, అక్కడి నుంచి అతడిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారతీయ యంత్రాంగం సమర్పించిన ఆధారాలు ఎ ఎ ఖాన్ అతడిని అరెస్టు చేసినప్పుడు సేకరించిన వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాలే కావడం గమనార్హం. ఈ కరుడుగట్టిన నేరస్తుడికి సంబంధించి ఖాన్ సేకరించిన ఈ ఆధారాలు, అబు సలేం మారువేషంలోని రూపానికి బాగా భిన్నంగా ఉన్నాయి. చిన్న బలవంతపు డబ్బు వసూలు యత్నం కేసు నుంచి విడుదలైన తరువాత, చీకటిసామ్రాజ్యంలో అతను కీలకమైన వ్యక్తిగా ఎదిగాడు. చాలా త్వరగా ముఠానాయకుడి అంతర్గత వర్గాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారాడు, హిందీ చలనచిత్ర పరిశ్రమ నుంచి బలవంతపు వసూళ్ల చేయడం, అక్రమ ధనాన్ని చలనచిత్ర నిర్మాణంలోకి మళ్లించడం, నటులను బలవంతంగా చిత్రాల్లో నటింపజేయడం, విదేశీ హక్కులపై నియంత్రణ వంటి కార్యకలాపాల్లో ప్రత్యేకత సాధించాడు. దావూద్ ఇబ్రహీం నుంచి విడిపోయిన తరువాత కూడా అతను ఈ మార్గంలో మరింత దూకుడుకు వ్యవహరిస్తూ ముందుకెళ్లాడు, దావూద్ ఈ పరిణామం తరువాత చలనచిత్ర వ్యక్తుల వద్ద నుంచి డబ్బు తీసుకొని వారికి రక్షణ కల్పించే కార్యకలాపాలు సాగించాడు. షకీల్‌తో సలేం శత్రుత్వం మరియు షకీల్‌కు దావూద్ మద్దతుకు డి-కంపెనీ నుంచి సలేం విడిపోవడం కారణంగా చెప్పబడుతుంది.[10]

చీకటిసామ్రాజ్యంలో ఎదుగుదల[మార్చు]

దావూద్ ఇబ్రహీం ముఠాలో అతని తరువాత ముఖ్యమైన వ్యక్తిగా మారడానికి ముందు అబు సలేం ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేశాడు. ఒక చిన్నస్థాయి నేరస్థుడి స్థాయి నుంచి ముంబయి చీకటి సామ్రాజ్యంలో భారతదేశంలో అత్యంత కరుడుగట్టిన నేరస్తుడిగా మారాడు.

1993 ముంబయి వరుస బాంబు పేలుళ్లకు ఒక సూత్రధారిగా ఉన్న అబు సలేం సంగీత వ్యాపార దిగ్గజం గుల్షన్ కుమార్, నటి మనీషా కోయిరాలా కార్యదర్శి అజిత్ దేవాన్ మరియు బిల్డర్ ఓంప్రకాశ్ కుక్రెజా హత్యలతో ప్రాచుర్యంలోకి వచ్చాడు. చలనచిత్ర ప్రముఖులు, రాజీవ్ రాయ్, రాకేశ్ రోషన్ మరియు మన్మోహన్ శెట్టిలను హత్య చేసేందుకు కూడా ఇతను ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 90వ దశకం ప్రారంభంలో, సేలం ముంబయిలో ముఠా నాయకుడు సయ్యద్ తోపీ వద్ద పనిచేసిన తన బంధువు, చిన్నస్థాయి నేరస్థుడు అక్తర్‌తో కలిసి ఉన్నాడు. సలేం తరువాత శాంతాక్రూజ్‌కు మకాం మార్చి ఒక ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాడు. దావూద్ కోసం పనిచేసే జేకే ఇబ్రహీం అనే వ్యక్తితో అతనికి పరిచయం ఏర్పడింది. అతని ద్వారా, దావూద్ ముఠాలో సలేం సభ్యుడయ్యాడు.[11]

ఏవిధంగా ఎదిగాడు [11]

ఆకర్షణీయమైన రూపం కలిగివున్నప్పటికీ భయపెట్టడం ద్వారా సలేం ప్రజలను లోబరుచుకుంటాడు. ప్రజలకు బెదిరింపు కాల్స్ చేయడానికి ఇతని వంటి వ్యక్తులు డి-ముఠాకు అవసరం. బాలీవుడ్ పెద్దతలల నుంచి డబ్బును బలవంతంగా వసూలు చేసేందుకు సలేంకు స్వేచ్ఛ ఇచ్చారు. ఇదే సమయంలో, దుబాయిలో ప్రదర్శనలు నిర్వహించడం ప్రారంభించాడు, తన అధిపతి దృష్టిని ఆకర్షించేందుకు పెద్ద నటులను ఈ ప్రదర్శనలు ఆహ్వానించేవాడు. ఆగస్టు 12, 1997న గుల్షన్ కుమార్‌ను సలేం హత్య చేశాడు. ఈ హత్య దావూద్‌కు చాలా ఆగ్రహం తెప్పించింది. దావూద్ ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు సలేం దుబాయ్‌ను విడిచిపెట్టి వెళ్లాడు.

అతని కార్యనిర్వహణ పద్ధతి [11]

దావూద్ కోసం పనులు చేసేందుకు ఎల్లప్పుడూ సలేం సొంత మనుషులను ఉపయోగించాడు. వీరిని UP నుంచి తీసుకొచ్చేవాడు, వీరిని తక్కువ జీతానికి పనిచేయించేవాడు. సలేం వివిధ రకాలకు పనులకు వేర్వేరు వ్యక్తులను ఉపయోగించేవాడు - ఆయుధాలను సరఫరా చేసేందుకు ఒకరిని (సాధారణంగా ఒక మహిళను), లక్ష్యాన్ని గుర్తించేందుకు ఒకరిని, పని పూర్తి చేసేందుకు మరొకరిని ఉపయోగించేవాడు. ఒకే ఆయుధాన్ని పలు హత్యలకు ఉపయోగించేవారు, అందువలన పోలీసులు ఒకే వ్యక్తి అన్ని దాడులు చేసినట్లు భావించేవారు.

అరెస్ట్[మార్చు]

పోలీసు అడిషనల్ కమిషన్ ఎ ఎ ఖాన్ నేతృత్వంలో ఏర్పాటయిన ఒక ప్రత్యేక బృందం 90వ దశకం ప్రారంభంలో అతడిని అరెస్టు చేసింది, వాయువ్య ముంబయిలోని శాంతాక్రూజ్‌లోని సొంత ట్రావెల్ ఏజెన్సీలో సలేంను పోలీసులు నిర్బంధించారు. వాయువ్య ముంబయిలోని అంధేరీలో ఉన్న డిఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌కు అతడిని అప్పగించారు, ఇక్కడ సేలం మామలు అతనిపై కేసు నమోదు చేశారు (సలేం ఒక కళాశాల బాలికను ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నాడు. డిఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సలేం మామలు అతనిపై అపహరణ కేసు నమోదు చేశారు). అయితే జైలులో రెండు రోజులు గడిపిన తరువాత, అతను విడుదలయ్యాడు.[12]

ప్రవర్తన[మార్చు]

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతని మొదటి భార్య సమీరా జుమానీ కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. సలేం "ఒక హింసాత్మక "మతిభ్రమించిన వ్యక్తి" అని ఆమె చెప్పారు.”[3] ఆమె అతని గురించి మాట్లాడుతూ[3]:

- Salem is a cowardly person

- He almost killed me

- Salem beat up Monica (Bedi) as well

- Dawood apologized for Anis' (Anees Ibrahim) bad behavior

“అతను ఎన్నడూ ఒక కుటుంబ వ్యక్తిగా ప్రవర్తించలేదు. పెళ్లయిన మహిళ జీవితాన్ని ఎన్నడూ అతనితో గడపలేదని,” ఆమె చెప్పారు.[2]

ఇదిలా ఉంటే అబు సలేంతో జైలులో సమయాన్ని పంచుకున్న ప్రమోద్ మహాజన్ యొక్క సోదరుడు ప్రవీన్ మాట్లాడుతూ అతడిని ఒక మర్యాదగల వ్యక్తిగా పేర్కొన్నాడు."[13]

టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఒక ఇంటర్వ్యూలో సుభాష్ ఘాయ్ మాట్లాడుతూ తన పర్దాస్ చలనచిత్రం యొక్క విదేశీ హక్కులను కోరుతూ సలేం తనకు ఫోన్ చేశాడని చెప్పారు. మాటల్లో సలేం చాలా మర్యాద గల వ్యక్తిగా అనిపించాడని, తనకు అతను పెద్ద అభిమానినని కూడా చెప్పాడని ఘాయ్ తెలిపారు. ఘాయ్ విదేశీ హక్కుల వ్యవహారం అప్పటికే ఖరారు అయిందని సలేంకు చెప్పినప్పుడు, సేలం ఆ సినిమాకు సంబంధించిన కాపీని అడిగాడు, దీనితో అతను చిత్రానికి దొంగ కాపీలు తయారు చేసుకోవచ్చు.[10]

నికర విలువ[మార్చు]

అబు సలేం ఒక కోట్లకుపడగెత్తిన ముఠానాయకుడు, అతని ఆస్తి విలువ రూ.4000 కోట్లు ($1 బిలియన్) ఉంటుంది.[14] అతని వద్ద నగదు మరియు ఆస్తి విలువ కనీసం రూ.1000 కోట్లు ఉంటుంది, ఈ ఆస్తి అతను మరియు అతని ఇద్దరు భార్యలు సమీరా జుమానీ మరియు మోనికా బేడి మధ్య పంచబడింది. దీనిలో సలేం వాటా రూ.200 కోట్లు ఉంటుంది, అతని భార్యలు సంయుక్తంగా రూ.800 కోట్ల డబ్బు మరియు ఆస్తిని పంచుకుంటున్నారు. బాలీవుడ్ మరియు హవాలా రాకెట్‌లలో సలేం పెట్టుబడులు కనీసం మరో రూ.3000 కోట్లు ఉంటాయని అంచనా వేశారు. ఒక-ఏడాది లావాదేవీలు (2000-2001) ఆధారంగా ఈ మేరకు CBI అతని ఆస్తికి విలువ కట్టింది, ఇది ఒక సంప్రదాయ అంచనా గా చెప్పబడుతుంది.[15]

అతను దీనిని ఏ విధంగా చేశాడు

సలేంకు USలో ఒక వలసయేతర పని వీసా ఉంది, ఈ దేశంలో ఒక మెరైన్ ఇంజనీరింగ్ కంపెనీలో అతను ఒక మెయింటెనెన్స్ మేనేజర్‌గా చెలామణి అవుతున్నాడు. వివిధ పేర్లతో అతను కార్యకలాపాలు సాగించాడు, అతని ఉద్యోగ నేపథ్యం ఏ విధంగా ఉన్నప్పటికీ, అతను కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేయగలిగాడు. CBI అధికారులు, ప్రాథమిక గణనలు ప్రకారం ఒక్క 2000 సంవత్సరంలోనే సలేం రూ.200 కోట్ల విలువైన లావాదేవీలు నిర్వహించాడని వెల్లడించారు. అతను ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి దీనికి ముందు లావాదేవీల వివరాలు తెలుసుకోలేకపోయారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో అతని బినామీ, అయితే చట్టబద్ధమైన వ్యాపారాన్ని సలేం సన్నిహిత సహచరులు నిర్వహిస్తున్నారు.[15]

కాలక్రమం[మార్చు]

ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో అతని గురించి ప్రచురించబడిన ఒక వ్యాసం[10]:

Name : Abu Salem Abdul Qayoom Ansari

Aliases : Aqil Ahmed Azmi, Captain and Abu Samaan, among others

Born : 1969 (according to the CBI, although the Mumbai police says 1962), in Mir Sarai, District Azamgarh, Uttar Pradesh, the second son in a lower middle-class family. Though some reports maintain that he was the eldest of four brothers. His father, an advocate, was killed in a road accident. Studied in a primary school. Fair complexion, height 5'4, medium built, speaks Urdu, Hindi, Marathi. Reportedly has 12 passports.

Started off as a motor mechanic in Azamgarh after his father died before moving to Delhi where he reportedly worked as a taxi driver.

1985 : Came to Mumbai to earn a livelihood.

1986: Worked as a bread delivery boy between Bandra and Andheri; later worked at a garment shop in Andheri (W).

1987 : Became a real estate broker, operated from Arasa Market in Andheri (W).

1988: Assaulted a colleague over a monetary issue and the first case against him was registered at Andheri police station.

In the meantime, married Samira Jumani, a girl from Jogeshwari, now in the US. Has two sons from her. Salem's passion for movies reportedly extends to naming his sons after his favourite stars.

1989 : Handled a few land deals for Dawood gang, came in contact with Anees Ibrahim, Dawood's younger brother, over telephone. Anees offered him a job and he worked as a driver and transported arms. His proficiency at delivering goods at the right time and place earned him the nickname Abu Samaan

1990 : Recruited to oversee Dawood Ibrahim gang's (D-Company) Mumbai operations.

1992 : Allegedly supplied weapons to film actor Sanjay Dutt.

March 1993: Played an active role in serial bomb blasts which killed over 250 people, left 700 injured and damaged property worth Rs 27 crore.

1993: Conspired to kill builder Omprakash Kukreja. Left the country when the police started rounding up suspects in serial blasts case.

1994-97 : Dawood's overseas pointsman for extorting money from film personalities and builders. Was closest to Dawood after Chhota Shakeel.

Moved to Dubai where he had a business establishment called Kings of Car Trading. Organised stage shows where he invited actors. Was introduced to Monica Bedi who had gone with producer Mukesh Duggal for a show.

1997: Masterminded the killing of music baron Gulshan Kumar. In mid-1997, reportedly went to Pakistan to make arrangements for the marriage of Dawood's brother Humayun.

1998 : Parted ways with Dawood after being sidelined

2000 : Planned kidnapping of Milton Plastics owner for ransom of Rs 3 crore.

January, 2001 : His men shot Ajit Diwani, personal secretary to film actress Manisha Koirala.

October, 2001: Four members of Salem gang shot down in Bandra before they could target film personalities Aamir Khan, Ashutosh Gowarikar and Jhamu Sughand.

July 2002 : Two shooters of Salem gang opened fire on film director Lawrence D'souza who survived.

September 18, 2002: Salem and second wife Monica Bedi intercepted in Portugal for carrying forged documents. Along with Bedi sentenced to five years' jail term.

వీటిని కూడా చూడండి[మార్చు]

  • దావూద్ ఇబ్రహీం - అతని గురువు మరియు చీకటిసామ్రాజ్య అధిపతి
  • మోనికా బేడి - మాజీ బాలీవుడ్ నటి మరియు అతని అనుమానిత భార్య

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అబు_సలేం&oldid=2015858" నుండి వెలికితీశారు