Jump to content

అబూ తాహెర్ ఖాన్

వికీపీడియా నుండి
అబు తాహెర్ ఖాన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 మే 24
ముందు బదరుద్దోజా ఖాన్
నియోజకవర్గం ముర్షిదాబాద్

పదవీ కాలం
2001  2019
ముందు జయంత కుమార్ బిశ్వాస్
తరువాత సాహినా ముంతాజ్ బేగం
నియోజకవర్గం నవోడా

వ్యక్తిగత వివరాలు

జననం (1964-11-23) 1964 నవంబరు 23 (వయసు: 61)
నవోడా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (2019-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (1992-2019)
వృత్తి రాజకీయ నాయకుడు

అబూ తాహెర్ ఖాన్ ( బెంగాలీ : আবু তাহের খান ; జననం 23 నవంబర్ 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసి ఆ తరువాత ముర్షిదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

అబూ తాహెర్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2001, 2006 & 2011 2016 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో నవోడ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముర్షిదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐటిసీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అబు హెనాపై 2,26,417 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

అబూ తాహెర్ ఖాన్ 2024 లోక్‌సభ ఎన్నికలలో ముర్షిదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐటిసీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఐ (ఎం) అభ్యర్థి మహమ్మద్ సలీంపై 1,64,215 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Abu Taher Khan Biography" (in ఇంగ్లీష్). The Indian Express. 23 November 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  2. "Lok Sabha Election Results 2024: TMC Abu Taher Khan Wins Murshidabad Seat" (in ఇంగ్లీష్). TimelineDaily. 4 June 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  3. "मुर्शिदाबाद सीट से TMC के अबू ताहिर खान फिर से जीते, जानें अपने सांसद को". TV9 Bharatvarsh. 8 June 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  4. "2024 Loksabha Elections Results - Murshidabad" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  5. "Murshidabad Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  6. "Murshidabad Lok Sabha Election Results 1962 - 2024" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 4 June 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.