అబ్దుల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అబ్దుల్

1871 సం :లో అబ్దుల్ నాందేడ్లో జన్మించాడు . అతడు తన చిన్నతనంలో ఫకీర్ అమీరుద్దిన్ ను సేవిస్తూ ఉండేవాడు . ఒకరోజు బాబా ఆ ఫకీరుకు స్వప్న దర్శనమిచ్చి అబ్దుల్ ను తమ దగ్గరకు పంపమని ఆదేశించారు . అలా తన గురువు పంపగా అబ్దుల్ బాబా సన్నిధికి చేరి ఆయనను సేవించసాగాడు . బాబా శరీరంతో ఉన్నప్పుడు 30 సం :లు, బాబా సమాధి చెందిన తర్వాత 36 సం :లు ఎంతో భక్తి శ్రద్ధలతో బాబాను సేవించాడు అబ్దుల్ . అతడు ప్రతిరోజూ భిక్ష చేసుకొని జీవించేవాడు . అబ్దుల్ బాబా దగ్గరకు వచ్చేటప్పటికి అతడికి 20 సం :లు .

అప్పటి నుంచీ బాబా సేవ చేయడం, శిరిడీ వీధులు చిమ్మి శుభ్రం చేయడం, రాత్రంతా బాబా సన్నిధిలో ఖురాన్ చదవడంతో రోజంతా గడిపేవాడు అబ్దుల్ . బాబా అతడిని ప్రేమగా, "మా పాకీవాడు " అనేవారు . " ఆహారం కొద్దిగా తీసుకొని ఒక్క వంటకంతోనే గడుపు . రుచి గురించి ఆశపడకు . ఎక్కువగా నిద్రపోకు అని అబ్దుల్లాతో చెప్పారు బాబా . అతడలాగే చేశాడు బాబా చెప్పిన ప్రతి మాటనూ అబ్దుల్ ఎంతో శ్రద్ధతో వ్రాసుకుని నిత్యపారాయణ చేసేవాడు . ఎవారికైనా ఏదైనా సమస్య వస్తే అతడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గ్రంథం తెరచి అక్కడ వ్రాసి మాటలలోని సమాధానం చెబుతుండేవాడు . ప్రతిసారీ ఆ సమస్యకు పరిష్కారం దొరికేది . మహాత్ముల మాటలు ఎంతో అమూల్యమైనవి .

"https://te.wikipedia.org/w/index.php?title=అబ్దుల్&oldid=1967259" నుండి వెలికితీశారు