అబ్దుల్లాపూర్‌మెట్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది మండల కేంద్రమైన హయాత్‌నగర్‌ నుండి 10 కి. మీ. దూరం లోనూ, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 31 గ్రామాలున్నాయి. దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన ఇబ్రహీంపట్నం రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్‌నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  35  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ అబ్దుల్లాపూర్ గ్రామం రంగారెడ్డి జిల్లా,సరూర్‌నగర్‌ రెవిన్యూ డివిజను పరిధిలోని హయాత్‌నగర్‌ మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్ గ్రామాన్ని (1+34) ముప్పైఐదు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోనే,ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

సమీప మండలాలు[మార్చు]

దక్షిణం ఇబ్రహీంపట్నం, తూర్పున పోచంపల్లి, ఉత్తరము ఘట్కేసర్, దక్షిణాన మంచాల్ మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతము రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాల సరిహద్దులో ఉంది.

మండలంలోని సంస్థలు[మార్చు]

  • సెంట్రల్ బాంక్ ఆఫ్ ఇండియా, బాటసింగారం, (ఆబ్దుల్లాపూర్ మెట్ ( Ifsc Code CBIN0281928, micrCode 500016025)
  • సిండికేట్ బాంక్, కోహెడ ( Ifsc Code SYNB0003080, micrCode 500025054)
  • నాగోల్ ఇనిస్టిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కుంట్లూరు గ్రామం.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణించబడ లేదు

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-04.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]