అబ్దుల్‌ హకీం జానీ షేక్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్దుల్ హకీం జాని షేక్‌, బాల సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తితో 2019  నాటికి 30 పుస్తకాలు, పిల్లల కోసం 240  నీతి కథలు, తెలుగు పత్రికలలో 1340  ఆర్టికల్స్ , మొత్తం 63  పుస్తకాలువెలువరించారు

బాల్యము[మార్చు]

అబ్దుల్‌ హకీం జాని షేక్‌, గుంటూరు జిల్లా తెనాలిలో 1963 జనవరి 1 జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ మహబూబ్‌బీ, షేక్‌ ఫరీద్‌ సాహెబ్‌.

ఉద్యోగము[మార్చు]

వీరు బి.ఏ., బిఎడ్‌. చదివి తెలుగు ఉపాధ్యాయులు ఉద్యోగించారు. ఉపాధ్యాయ వృత్తిని, జర్నలిజం ప్రవృత్తిని రెండు కళ్లుగా చేసుకుని రచయితగా అందరి హృదయాలలో స్థానం పొందారు.

రచనా వ్యాసంగము[మార్చు]

వీ 1976లో విద్యార్థిగా కన్నందుకు శిక్ష నాటిక రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభించారు. 1991 నుండి 2019 వరకు తెలుగు పత్రికలలో వివిధాంశాల మీద సుమారు 1340 వ్యాసాలు, కవితలు ప్రచురితం అయ్యాయి. బాల సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తితో 30 పుస్తకాలు వెలువరించారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్ర, మనవీర వనితలు,  ఆంధ్రప్రదేశ్ యాత్ర దర్శిని, సుందర భారతదేశ యాత్రా దర్శిని ఇత్యాది గ్రంధాలను రచించారు.   ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, బాలసాహితీ వేత్తగా హకీం జాని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పిల్లల కోసం వీరు రచించిన బాలసాహితీ కథలను  అమ్మఒడి  పేరుతొ పుస్తకాన్ని ప్రచురించారు.  పిల్లల కోసం 2019  నాటికీ 240  నీతి కథలు రచించగా పలు పత్రికల్లో అవి ప్రచురితమైనాయి . పూణే లోని మహారాష్ట్ర పాఠ్య ప్రణాళిక పరిశోధనా సంస్థ వారు  11  వ తరగతి విద్యార్థుల కోసం యువభారతి పేరుతో  ప్రచురించిన ద్వితీయ భాష తెలుగు పాఠ్య పుస్తకంలో హకీం జానీ రచించిన బాధ్యతాయుత పౌరుడు అనే కథలు 2019  విద్యాసంవత్సరానికి గాను పాఠ్య అంశంగా పొందుపరిచారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా 2019  నాటికి 1340  ఆర్టికల్స్ తెలుగు దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితమైనాయి. ఆకాశవాణి ద్వారా కవితలు, కధానికలు, ప్రసారం అయ్యాయి.

అమ్మ ఒడి
ఉగాది పురస్కారం 2018

అవార్డులు -పురస్కారాలు[మార్చు]

వీరికి సమతారావు బాల సాహితీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, విశ్వదాత అవార్డు (2007), ఆంధ్ర సారస్వత సమితి పురస్కారం (2009). లభించాయి. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాన్ని 2012  లో అప్పటి ముఖ్యమంత్రి  యన్. కిరణ్ కుమార్ రెడ్డి చేతులమీదుగా ఒకసారి, 2018  లో నవ్య ఆంధ్రప్రదేశ్ తోలి శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ చేతుల మీదుగా రెండవసారి అందుకున్నారు.  2018  లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఉత్తమ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు.  వీరి లక్ష్యం మానవీయ సంస్కృతీ-సంప్రదాయల పట్ల అవగాహన కల్పిస్తూ, బాలబాలికల అభ్యున్నతికి ఉత్తమ సాహిత్య సృష్టి చేయటం.

e-mail: hakeemjani786@gmail.com, cell: 9949429827

మూలాలు[మార్చు]

అక్షరశిల్పులు అనుగ్రంథము, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, చిరునామా వినుకొండ - 522647 పుట 31