అబ్దుల్ కలామ్ ద్వీపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అబ్దుల్ కలామ్ ద్వీపం ఒడీషా తీరంలో గల ఒక ద్వీపం. భుబనేశ్వర్ నుండి 150 కి.మీ. దూరంలో, బాలేశ్వర్ (బాలసోర్) జిల్లాలో ఉంది ఈ ద్వీపం. గతంలో దీన్ని వీలర్ ఐలాండ్ అని పిలిచేవారు. క్షిపణులను పరీక్షించే ఇంటెగ్రేటెడ్ టెస్ట్  రేంజ్ ఈ ద్వీపంలోనే ఉంది.

అబ్దుల్ కలామ్ ఐలాండ్ బంగాళాఖాతంలో ఒరిస్సా తీరం నుండి 10 కి.మీ. దూరంలో చాందీపూర్ కు దక్షిణంగా 70 కి.మీ. దూరంలో ఉంది. ఈ ద్వీపం పొడవు 2 కి.మీ., వైశాల్యం 390 ఎకరాలు. సమీపంలోని నౌకాశ్రయం ధమ్రా. భారత్ తయారు చేసిన అనేక క్షిపణులకు పరీక్షా కేంద్రం అబ్దుల్ కలామ్ ఐలాండే; ఆకాశ్, అగ్ని, అస్త్ర, బ్రహ్మోస్నిర్భయ్ప్రహార్పృథ్విశౌర్య, అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్,  పృథ్వి  ఎయిర్ డిఫెన్స్- వీటన్నిటినీ ఇక్కడే పరీక్షించారు. ఈ దీవికి చేరుకోవాలంటే ఓడమీదే వెళ్ళాలి. రోడ్డు గాని, రైలు మార్గం గానీ లేదు. చిన్న హెలిప్యాడ్  ఉంది. కానీ  ఇక్కడికి రావలసిన సామానులు, ఇతర సరఫరాలూ  ఓడల ద్వారానే వస్తాయి.[1]

2013 మేలో ఇసుక కోత కారణంగా, దీవి యొక్క రూపురేఖలు మారిపోవడం సమాజం దృష్టికి వచ్చింది. ఈ దీవి, రాయి మీద కాక ఇసుక తిన్నెల మీద ఉండడం చేత, ఇసుక చలనం కారణంగా ఈ కోత ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం DRDO చెన్నైలోని జాతీయ సముద్ర సాంకేతిక సంస్థ సాయం కోరింది.[2]

2015 సెప్టెంబరులో వీలర్ ఐలాండ్‌ను మాజీ రాష్ట్రపతి గౌరవార్థం అబ్దుల్ కలామ్ ఐలాండ్ గా పేరు మార్చారు [3][4]

చిత్రాలు[మార్చు]

దీవిలో జరిగిన క్షిపణి ప్రయోగాలు[మార్చు]

ఈ దీవిలో జరిగిన క్షిపణి పరీక్షా ప్రయోగాలు కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. చాందీపూర్, అబ్దుల్ కలామ్ ఐలాండ్ రెండు చోట్లా జరిగిన ప్రయోగాలన్నీ ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రయోగించిన తేదీ Origin క్షిపణి రకం అపరేటరు పరిధి
ఆకాశ్
24 మే 2012
26 మే 2012
6 జూన్ 2012
21 ఫిబ్రవరి 2014
24 ఫిబ్రవరి 2014
26 ఫిబ్రవరి 2014
2 మే 2014
19 జూన్ 2014
18 నవంబరు 2014
భారతదేశం భారత్ ఆకాశ్ భూమి నుండి గాల్లోకి క్షిపణి (SAM) భారత సైన్యం
భారతీయ వాయు సేన
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ
25 – 50 కి.మీ.
అగ్ని
28 మార్చి 2010
25 నవంబరు 2010
1 డిసెంబరు 2011
13 జూలై 2012
12 డిసెంబరు 2012
8 నవంబరు 2013
11 ఏప్రిల్ 2014
11 సెప్టెంబరు 2014
భారతదేశం భారత్ అగ్ని-1 మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి (MRBM) భారత సైన్యం

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

700 – 1,250 కి.మీ.
23 నవంబరు 2009
17 మే 2010
10 డిసెంబరు 2010
15 నవంబరు 2011
30 సెప్టెంబరు 2011
9 ఆగస్టు 2012
7 ఏప్రిల్ 2013
9 నవంబరు 2014
భారతదేశం భారత్ అగ్ని-2 మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి (MRBM) భారత సైన్యం

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

2,000 – 3,000 కి.మీ.
12 ఏప్రిల్ 2007
7 ఫిబ్రవరి 2010
23 జూలై 2011
19 ఆగస్టు 2012
21 సెప్టెంబరు 2012
23 డిసెంబరు 2013
16 ఏప్రిల్ 2015
భారతదేశం భారత్ అగ్ని-3 మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి (IRBM) Strategic Forces Command

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

3,500 – 5,000 కి.మీ.
19 సెప్టెంబరు 2012
20 జనవరి 2014
2 డిసెంబరు 2014
భారతదేశం భారత్ అగ్ని-4 మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి (IRBM) భారత సైన్యం

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

3,000 – 4,000 కి.మీ.
19 ఏప్రిల్ 2012
15 సెప్టెంబరు 2013
31 జనవరి 2015
భారతదేశం భారత్ అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) Strategic Forces Command

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

5,000 – 8,000 కి.మీ.
అస్త్ర
6 జూలై 2010
21 మే 2011
21 డిసెంబరు 2012
19 మార్చి 2015
భారతదేశం భారత్ అస్త్ర Beyond Visual Range Air to Air క్షిపణి (BVRAAM) భారతీయ వాయు సేన

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

50 - 100 కి.మీ.
బ్రహ్మోస్
30 మార్చి 2012
29 జూలై 2012
8 జూలై 2014
భారతదేశం భారత్

Russia రష్యా

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి భారత సైన్యం

భారతీయ నావికా దళం
భారతీయ వాయు సేన

NPO Mashinostroeyenia
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

300 – 500 కి.మీ.
నిర్భయ్
12 మార్చి 2013
17 అక్టోబరు 2014
భారతదేశం భారత్ నిర్భయ్ దూర పరిధి సార్వకాలిక సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి భారత సైన్యం

భారతీయ నావికా దళం
భారతీయ వాయు సేన
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

1,000 - 1,500 కి.మీ.
ప్రహార్
21 జూలై 2011 భారతదేశం భారత్ ప్రహార్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి భారత సైన్యం

భారతీయ వాయు సేన
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

150 - 200 కి.మీ.
పృథ్వి
15 మార్చి 2010
6 మార్చి 2011
భారతదేశం భారత్ పృథ్వి I స్వల్ప పరిధి బాలిస్టిక్ క్షిపణి (SRBM) భారత సైన్యం
భారతీయ నావికా దళం
భారతీయ వాయు సేన
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ
150 - 200 కి.మీ.
12 అక్టోబరు 2009
13 డిసెంబరు 2009
27 మార్చి 2010
18 జూన్ 2010
24 సెప్టెంబరు 2010
10 ఫిబ్రవరి 2011
26 సెప్టెంబరు 2011
4 అక్టోబరు 2012
5 అక్టోబరు 2012
20 డిసెంబరు 2012
12 ఆగస్టు 2013
7 అక్టోబరు 2013
3 డిసెంబరు 2013
7 జనవరి 2014
14 నవంబరు 2014
19 ఫిబ్రవరి 2015
భారతదేశం భారత్ పృథ్వి II/Dhanush స్వల్ప పరిధి బాలిస్టిక్ క్షిపణి (SRBM) భారత సైన్యం

భారతీయ నావికా దళం
భారతీయ వాయు సేన
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

250 - 350 కి.మీ.
శౌర్య
12 నవంబరు 2008
24 సెప్టెంబరు 2011
భారతదేశం భారత్ శౌర్య వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి భారత సైన్యం

భారతీయ నావికా దళం
భారతీయ వాయు సేన
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

700 - 2,000 కి.మీ.
అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్
15 మార్చి 2010
26 జూలై 2010
6 డిసెంబరు 2007
6 మార్చి 2011
23 నవంబరు 2012
భారతదేశం భారత్ అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD)

అశ్విన్ బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణి

బాహ్య వాతావరణ బాలిస్టిక్ క్షిపణి వ్యతిరేక క్షిపణి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ 150 – 200 కి.మీ.
పృథ్వి ఎయిర్ డిఫెన్స్
27 ఏప్రిల్ 2014 భారతదేశం భారత్ పృథ్వి ఎయిర్ డిఫెన్స్ (PAD)

ప్రద్యుమ్న బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణి

అంతర వాతావరణ బాలిస్టిక్ క్షిపణి వ్యతిరేక క్షిపణి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ 2000 కి.మీ.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు వనరులు[మార్చు]