Jump to content

అబ్దుల్ రజాక్ గుర్నా

వికీపీడియా నుండి

అబ్దుల్‌ రజాక్‌ గుర్నా

Gurnah in May 2009
Gurnah in May 2009
జననం (1948-12-20) 1948 డిసెంబరు 20 (age 76)
Sultanate of Zanzibar
వృత్తినావెలిస్ట్ , ప్రొఫెసర్
భాషఇంగ్లీష్
విద్యCanterbury Christ Church University (BA)
University of Kent (MA, PhD)
సాహిత్య ప్రక్రియఫిక్షన్
ప్రసిద్ధ రచనలుs
ప్రసిద్ధ పురస్కారాలుNobel Prize in Literature (2021)

ఆఫ్రికన్‌ సంతతికి చెందిన నవలా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నా వలసవాదం, శరణార్థుల వెతలను కళ్ళకు కట్టినందుకు గాను,2021 వ సంవత్సరానికి నోబెల్‌ సాహిత్య పురస్కారం దక్కింది.నోబెల్‌ సాహిత్య బహుమతిని అందుకున్న ఐదవ ఆఫ్రికన్‌ అబ్దుల్‌ రజాక్‌ గుర్నా.[1]

నేపథ్యం

[మార్చు]

అబ్దుల్‌ రజాక్‌ గుర్నా హిందూ మహా సముద్రంలోని టాంజానియా జాంజిబార్‌లో 1948వ సంవత్సరంలో జన్మించాడు.అప్పటికీ ఈ ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉండేది.1964 వ సంవత్సరంలో మొదలైన జాంజిబార్‌ విప్లవ నేపథ్యంలో పుట్టిన గడ్డను వదిలి శరణార్థిగా  బ్రిటన్ చేరుకున్నాడు.తిరిగి 1984వ సంవత్సరం దాకా తన కుటుంబాన్ని కలుసుకోలేకపోయాడు.స్వాహిలి తన మాతృభాష అయినప్పటికీ చిన్నప్పటినుండి చదువుకున్నది ఆంగ్లంలోనే దీంతో ఆయన రచనా వ్యాసంగం  అంతా ఆంగ్లంలోనే సాగింది. బ్రిటన్  చేరుకున్నాక కాంటర్ బరిలోనే 'క్రైస్ట్ చర్చ్ కాలేజీ' లో చదువుకున్నాడు.ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కేంట్ నుండి పీ.హెచ్.డీ  పట్టా పుచ్చుకున్నాడు.ఆ తరువాత అదే విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ పోస్ట్ కొలొనియల్  లిటరేచర్ ప్రొఫెసర్ గా పనిచేశారు.ప్రస్తుతం యూకే లో నివసిస్తున్నారు.[2]

సాహిత్యం

[మార్చు]

మొత్తం 10 నవలలు, చిన్న కథలను రాసిన అబ్దుల్ రజాక్,తన రచనల్లో శరణార్థుల వెతలను కళ్లకు కట్టినట్టు చిత్రీకరించారు.‘శరణార్థి అంతరాత్మ ఇతివృత్తంగా ఆయన రచనలు నడుస్తాయి.ఆయన రాసిన మొదటి నవల ‘మెమొరీ ఆఫ్ డిపార్చర్’ 1987లో విడుదలైంది.చిన్న కథల  విషయానికి వస్తే 2006వ సంవత్సరంలో ‘మై మదర్ లివ్డ్  ఆన్ ఏ ఫామ్ ఇన్ ఆఫ్రికా',2016వ సంవత్సరంలో ‘ది అరైవర్స్ టేల్’, 2019 వ సంవత్సరం లో ‘ది స్టేట్ లెస్  పర్సన్స్ టేల్’అనే మూడు షార్ట్ స్టోరీస్ ప్రచురితమయ్యాయి.[3]

నోబెల్‌ పురస్కారం

[మార్చు]

వలసవాదం, శరణార్థుల వెతలను కళ్ళకు కట్టినందుకు గాను,అబ్దుల్‌ రజాక్‌ గుర్నాకు 2021 వ సంవత్సరానికి నోబెల్‌ సాహిత్య పురస్కారం లభించింది.నోబెల్‌ సాహిత్య బహుమతిని అందుకున్న ఐదవ ఆఫ్రికన్‌ గుర్నా.ఇంతకుముందు నైజీరియాకు చెందిన వోల్‌ సోయింకా (1986),ఈజిప్టుకు చెందిన మహఫౌజ్‌ (1988),దక్షిణాఫ్రికాకు చెందిన నాడిన్‌ గోర్డిమర్‌ (1991),జాన్‌ మాక్స్‌వెల్‌ కోటి (2003) ఈ అవార్డును గెలుచుకున్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Abdulrazak_Gurnah".{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Ahmed, Syed (7 అక్టోబరు 2021). "నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటన-బ్రిటన్ నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా ఎంపిక". telugu.oneindia. Retrieved 9 అక్టోబరు 2021.
  3. "సాహిత్యంలో నోబెల్‌ బహుమతి అందుకున్న అబ్దుల్‌ రజాక్‌ గుర్నా". Sakshi. 7 అక్టోబరు 2021. Retrieved 9 అక్టోబరు 2021.
  4. "Abdulrazak Gurnah: where to start with the Nobel prize winner". the Guardian (in ఇంగ్లీష్). 8 అక్టోబరు 2021. Retrieved 9 అక్టోబరు 2021.