అబ్దుల్ రషీద్ ఖాన్
అబ్దుల్ రషీద్ ఖాన్ | |
|---|---|
| నేపథ్య సమాచారం | |
| Also known as | రసన్ పియా |
| జననం | 1908 ఆగస్టు 19 |
| మూలం | ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
| మరణం | 2016 ఫిబ్రవరి 18 (వయసు: 107) |
| ప్రక్రియలు | హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం |
| వృత్తులుs | గాయకుడు, కోల్‌కతాలోని ఐటిసి సంగీత పరిశోధన అకాడమీలో గురువు |
| క్రియాశీల సంవత్సరాలు | 1973–2016 |
ఉస్తాద్ అబ్దుల్ రషీద్ ఖాన్ (1908 ఆగస్టు 19 – 2016 ఫిబ్రవరి 18), హిందూస్థానీ సంగీతానికి చెందిన భారతీయ గాయకుడు.[1] ఖయాల్ మాత్రమే కాకుండా, అతను ధ్రుపద్, ధమర్, థుమ్రీలను ప్రదర్శించాడు. ఆయనను 2020లో భారత ప్రభుత్వం పద్మ పురస్కారంతో సత్కరించింది, ఈ పురస్కారం పొందిన అతి పెద్ద వ్యక్తి గా ఆయన నిలిచాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]అబ్దుల్ రషీద్ ఖాన్ సాంప్రదాయ గ్వాలియర్ ఘరానా గాయకుడు బెహ్రామ్ ఖాన్ వంశానికి చెందిన సంగీతకారుల కుటుంబంలో జన్మించాడు. అతను తన తండ్రి అన్నయ్య బడే యూసుఫ్ ఖాన్, అతని తండ్రి చోటే యూసుఫ్ ఖాన్ నుండి ప్రారంభ శిక్షణ పొందాడు.
దీని తరువాత అతని కుటుంబ పెద్దలైన చాంద్ ఖాన్, బర్ఖుదర్ ఖాన్, మహతాబ్ ఖాన్ ల నుండి విస్తృతమైన సంగీత శిక్షణ పొందాడు, వారు అతనికి గ్వాలియర్ గాయకి నేర్పించారు. అతను తన కళాత్మక సున్నితత్వానికి అనుగుణంగా ఈ శైలిని మరింత అభివృద్ధి చేశాడు. అతను పదహారవ శతాబ్దంలో అక్బర్ ది గ్రేట్ ఆస్థానంలోని తొమ్మిది రత్నాలలో ఒకటైన ప్రఖ్యాత గాయకుడు తాన్‌సేన్ వారసుడు.
కెరీర్
[మార్చు]అబ్దుల్ రషీద్ ఖాన్ సాంప్రదాయ సంగీతాన్ని బిబిసి, ఇరాక్ రేడియోలు రికార్డ్ చేసాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని సంగీత నాటక అకాడమీ, కోల్‌కాతాలోని ఐటీసీ సంగీత రీసెర్చ్ అకాడమీ వంటి సంస్థలు ఆయన సంగీతాన్ని రికార్డ్ చేసి సంరక్షించాయి. అనేక దశాబ్దాల పాటు ఆయన ఆకాశవాణి, దూరదర్శన్ లక్నో లలో క్రమం తప్పకుండా ప్రదర్శనలు ఇచ్చాడు. ఆయన భారతదేశం అంతటా సదరంగ్ కాన్ఫరెన్స్, గోద్రేజ్ కాన్ఫరెన్స్, లక్నో మహోత్సవ్, డోవర్ లాన్స్ కాన్ఫరెన్స్, ఐటీసీ సంగీత సమ్మేళనం, ప్రయాగ్ సంగీత సమితి సంగీత సమ్మేళనం వంటి అనేక జాతీయ, ప్రాంతీయ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఆయన ఉత్తర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ (1981), బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (1993), ఈస్టర్న్ జోన్ కల్చరల్ సెంటర్, ప్రెస్ క్లబ్ కోల్‌కాతా వంటి అనేక ప్రముఖ గుర్తింపు పొందిన సంస్థలచే ఆయన సత్కరించబడ్డాడు.
అబ్దుల్ రషీద్ ఖాన్ తన జీవితకాలంలో 2 వేలకి పైగా గేయాలను స్వరపరిచాడు, ఆయన "రసన్ పియా" అనే మారుపేరుతో గొప్ప రచయిత, కవి కూడా. ఆయన ఆలపించిన బందిషాలు, చాలామటుకు ఆయన సొంత రచనలే. ఆయన కోల్‌కాతాలోని ఐటీసీ సంగీత పరిశోధన అకాడమీ గురువుగా మంచి గుర్తింపు పొందాడు.[2][3]
మరణం
[మార్చు]అబ్దుల్ రషీద్ ఖాన్ 2016 ఫిబ్రవరి 18న 107 సంవత్సరాల వయసులో మరణించాడు.
గుర్తింపు
[మార్చు]- ఐటీసీ సంగీత పరిశోధన అకాడమీ అవార్డు (1994)
- సంగీత నాటక అకాడమీ అవార్డు (2009) [4]
- కాశీ స్వర్ గంగా అవార్డు (2003)
- రస్ సాగర్ అవార్డు (2004)
- భువాల్కా అవార్డు (2010)
- పద్మభూషణ్ (2012) - పద్మ అవార్డును పొందిన అత్యంత పెద్ద వయస్సు కలిగిన వ్యక్తి [5][6]
- ఢిల్లీ ఎన్సిటి ప్రభుత్వంచే జీవితకాల సాఫల్య పురస్కారం (2013)
ఆయన న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో ఆడిషన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2015లో ప్రతిష్టాత్మకమైన "బంగా బిభూషణ్" బిరుదుతో సహా అనేక బిరుదులను ప్రదానం చేసింది.[7]
మూలాలు
[మార్చు]- ↑ S. Sahaya Ranjit (2 June 2008). "The Tapestry of Tradition". India Today. Archived from the original on 5 December 2010. Retrieved 29 November 2019.
- ↑ Jaskiran Kapoor (20 October 2010). "The centennial man (Abdul Rashid Khan)". The Indian Express (newspaper). Retrieved 29 November 2019.
- ↑ Ustad Abdul Rashid Khan's Tragic Demise (18 February 2016). "Ustad Abdul Rashid Khan's Tragic Demise – IBTN9". IBTN9.com website. Retrieved 29 November 2019.
- ↑ S. Sahaya Ranjit (2 June 2008). "The Tapestry of Tradition". India Today. Archived from the original on 5 December 2010. Retrieved 29 November 2019.
- ↑ "At 105, Abdul Rashid Khan becomes oldest person to get Padma Shri". First Post (newspaper). 25 January 2013. Retrieved 29 November 2019.
- ↑ "Ragas For Late Winter". Outlook (magazine). 11 February 2013. Retrieved 29 November 2019.
- ↑ "Bhuwalka Award 2010". ITC Sangeet Research Academy. Retrieved 29 November 2019.