అబ్దుస్ సలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహమ్మద్ అబ్దుస్ సలం
محمد عبد السلام
1987లో అబ్దుస్ సలం
జననం(1926-01-29)1926 జనవరి 29
ఝంగ్, పంజాబ్ ప్రావిన్సు, బ్రిటీష్ ఇండియా (ప్రస్తుతం పాకిస్తాన్)
మరణం1996 నవంబరు 21(1996-11-21) (వయసు 70)
ఆక్స్ ఫర్డ్, యునైటెడ్ కింగ్ డం
జాతీయతపాకిస్తానీ
జాతిపంజాబీ
రంగములుసిద్ధాంత భౌతిక శాస్త్రం
వృత్తిసంస్థలుపాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమీషన్ · స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమీషన్ · పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ · పంజాబ్ విశ్వవిద్యాలయం · ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ · ప్రభుత్వ కళాశాల విశ్వవిద్యాలయం, లాహోర్ · కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం · ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిస్ట్స్ · ఎడ్వర్డ్ బౌచెట్ అబ్దుస్ సలం ఇన్స్టిట్యూట్
చదువుకున్న సంస్థలుప్రభుత్వ కళాశాల విశ్వవిద్యాలయం, లాహోర్ · పంజాబ్ విశ్వవిద్యాలయం · సెయింట్ జాన్స్ కళాశాల, కేంబ్రిడ్జ్
పరిశోధనా సలహాదారుడు(లు)నికోలస్ కెమ్మెర్
ఇతర విద్యా సలహాదారులుపాల్ మాథ్యూస్
డాక్టొరల్ విద్యార్థులుమైకేల్ డఫ్ · అలీ చమ్సెద్దీన్ · రాబర్ట్ పాల్కింగ్ హార్న్ · రియాజుద్దీన్ · ఫయ్యాజుద్దీన్ · మౌసద్ అహ్మద్ · పార్తా గౌస్ · కమాలుద్దీన్ అహ్మద్ · జాన్ టేలర్ · గులాం మర్తజా · మునీర్ అహ్మద్ రషీద్
ఇతర ప్రసిద్ధ విద్యార్థులుఫహీం హుస్సేన్ · పర్వెజ్ హూద్భోయ్ · అబ్దుల్ హమీద్ నయ్యర్ · గులాం దస్తాగిర్ అలం
ప్రసిద్ధిఎలక్ట్రోవీక్ సిద్ధాంతం · గోల్డ్ స్టోన్ బోసన్ · గ్రాండ్ యూనిఫైడ్ థియరీ · హిగ్స్ మెకానిజం · మాగ్నటిక్ మెకానిజం · మేగ్నటిక్ ఫోటాన్ · న్యూట్రల్ కరంట · పాటి-సలం మోడల్ · క్వాంటం ఫిజిక్స్, పాకిస్తాన్ అణు పరిశోధన పథకం · పాకిస్తాన్ అంతరిక్ష పరిశోధన కార్యక్రమం · స్టాండర్డ్ మోడల్ · స్ట్రాంగ్ గ్రావిటీ · సూపర్ ఫీల్డ్ · డబ్ల్యు అండ్ జెడ్ బోసాన్స్
ముఖ్యమైన పురస్కారాలుస్మిత్ బహుమతి(1950) · ఆడమ్స్ ప్రైజ్ (1958) · రాయల్ సొసైటీ సభ్యత్వం (1959)[1]
సితారా-ఎ-పాకిస్తాన్ (1959) · హ్యూగ్స్ మెడల్ (1964) · ఆటమ్స్ ఫర్ పీస్ ప్రైజ్ (1968) · రాయల్ మెడల్ (1978) · భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి (1979) · నిషాన్-ఎ-ఇంతియాజ్ (1979) · జోజెఫ్ స్టీఫన్ మెడల్ (1980) · భౌతికశాస్త్రానికి అత్యున్నత కృషి చేసినందుకు బంగారుపతకం (1981) · లొమొనొసోవ్ బంగారు పతకం(1983) · కాప్లీ పతకం (1990) · క్రిస్టోఫోరో కొలంబొ బహుమతి (1992)
సంతకం

మహమ్మద్ అబ్దుస్ సలం[2][3] (పంజాబీ, Urdu: محمد عبد السلام; pronounced [əbd̪ʊs səlɑm]; 29 జనవరి 1926 – 21 నవంబర్ 1996),[1] పాకిస్తానీ సిద్ధాంత భౌతికశాస్త్రవేత్త. 20వ శతాబ్ది సిద్ధాంత భౌతిక శాస్త్ర రంగంలో సుప్రసిద్ధ వ్యక్తి, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎలక్ట్రోవీక్ యూనిఫికేషన్ సిద్ధాంతం విషయమై చేసిన కృషికి షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి పంచుకున్నారు.[4] అబ్దుస్ సలం నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి పాకిస్తానీయుడు, సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ముస్లిం, ఏ విభాగంలోనైనా ఇస్లామిక్ దేశం నుంచి నోబెల్ అందుకున్నవారిలో రెండవవారు (మొదటి వ్యక్తి ఈజిప్టు నుంచి అన్వర్ సాదత్).[5]

1960 నుంచి 1974 వరకూ సలం పాకిస్తాన్ ప్రభుత్వ ఉన్నత స్థాయి సైన్స్ సలహాదారు హోదాలో పాకిస్తాన్ లో శాస్త్ర సాంకేతిక పరిశోధన సదుపాయాల అభివృద్ధిపై ప్రధానమైన, కీలకమైన పాత్ర పోషించారు.[5][6] సలం సైద్ధాంతిక, పదార్థిక భౌతిక శాస్త్రం పరిశోధనల అభివృద్ధికి కృషిచేయడమే కాకుండా దేశంలో ఉన్నత స్థాయి శాస్త్ర పరిశోధన సామర్థ్యం పెంపుకు కూడా చక్కని కృషి సల్పారు.[6] ఆయన స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ (సుపార్కో) వ్యవస్థాపక డైరెక్టర్, పాకిస్తాన్ అణు విద్యుత్ కమిషన్ లో సిద్ధాంత భౌతికశాస్త్ర విభాగం ఏర్పాటుకు ప్రధాన కారకుడు.[7] సైన్స్ సలహాదారుగా సలం పాకిస్తాన్ అణు విద్యుత్ ఉపయోగంలోనూ, 1972లో పాకిస్తాన్ అణుబాంబ్ ప్రాజెక్టుపైనా కృషిచేశారు.;[8] దీని వల్ల ఆయనను ఈ ప్రాజెక్టుకు "సాంకేతిక పితామహుడు" అని వ్యవహరిస్తారు.[9][10][11][12][13] 1974లో పాకిస్తాన్ పార్లమెంట్ అబ్దుస్ సలం శాఖ అయిన అహ్మదియా శాఖను, ఉద్యమాలను ఇస్లామేతరమని గుర్తిస్తూ వివాదాస్పద బిల్లును ఆమోదించాకా అందుకు నిరసనగా పాకిస్తాన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. 1998లో, దేశం అణుపరీక్ష నిర్వహించాకా పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ శాస్త్రవేత్తలు అన్న సీరీస్ లో భాగంగా ఆయన సంస్మరణాత్మక తపాలా స్టాంపు వేసింది.[14]

సలం ప్రధానమైన ఘనతల్లో పాటి-సలం మోడల్, మాగ్నటిక్ ఫోటాన్, వెక్టర్ మెసొన్, గ్రాండ్ యూనిఫైడ్ థియరీ వంటివాటిపై చేసిన కృషి, అత్యంత ప్రధానంగా ఎలెక్ట్రోవీక్ థియరీ వంటివి ఉన్నాయి. ఎలెక్ట్రో వీక్ థియరీపై చేసిన కృషికే ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.[4] సలం క్వాంటం ఫీల్డ్ థియరీపైన, లండన్ ఇంపీరియల్ కళాశాలలో మేథమెటిక్స్ అభివృద్ధి విషయంలోనూ ప్రధాన కృషి చేశారు. తన విద్యార్థి రియాజుద్దీన్ ద్వారా న్యూట్రినోల ఆధునిక సిద్ధాంతం, న్యూట్రాన్ స్టార్స్, బ్లాక్ హోల్స్ లకు, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటం ఫీల్డ్ థియరీలను ఆధునికీకరించడంలోనూ కృషిచేశారు. ఉపాధ్యాయునిగానూ, సైన్స్ ను విస్తృతంగా అభివృద్ధి చేయడంలో కృషిచేసిన వ్యక్తిగానూ సలంను పాకిస్తాన్ గణిత, సిద్ధాంత భౌతికశాస్త్ర పితామహునిగా గుర్తిస్తారు.[6][15] ప్రపంచ భౌతికశాస్త్ర సముదాయంలో పాకిస్తానీ భౌతిక శాస్త్ర కృషికి గుర్తింపు వచ్చేందుకు ఆయన తీవ్రంగా కృషిచేశారు.[16][17] మరణించేంతవరకూ భౌతిక శాస్త్రానికి తన కృషిని అందిస్తూ వచ్చారు, అభివృద్ధికి నోచుకోని దేశాల్లో శాస్త్ర సంకేతికాభివృద్ధి ప్రాముఖ్యత గురించి తన గొంతు వినిపిస్తూనే వచ్చారు.[18]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Kibble, T. W. B. (1998). "Abdus Salam, K. B. E.. 29 January 1926 – 21 November 1996". Biographical Memoirs of Fellows of the Royal Society. 44: 387–401. doi:10.1098/rsbm.1998.0025. JSTOR 770251.
 2. Fraser, Gordon (2008). Cosmic Anger. Oxford University Press. p. 249. ISBN 978-0-19-920846-3.
 3. Rizvi, Murtaza (21 November 2011). "Salaam Abdus Salam". The Dawn Newspapers. Archived from the original on 17 February 2012. Retrieved 3 November 2016. Mohammad Abdus Salam (1926–1996) was his full name, which may add to the knowledge of those who wish he was either not Ahmadi or Pakistani. He was the guiding spirit and founder of Pakistan's atomic bomb programme, as well as Pakistan Atomic Energy Commission and Space and Upper Atmosphere Research Commission (SUPARCO).
 4. 4.0 4.1 "1979 Nobel Prize in Physics". Nobel Prize. Archived from the original on 7 July 2014. Retrieved 3 November 2016.
 5. 5.0 5.1 (Ghani 1982, pp. i–xi)
 6. 6.0 6.1 6.2 Riazuddin (21 November 1998). "Physics in Pakistan". ICTP. Retrieved 23 August 2016.
 7. (Rahman 1998, pp. 75–76)
 8. Abbot, Sebastian (9 July 2012). "Pakistan shuns physicist linked to "God Particle"". Yahoo! News, 9 July 2012. Yahoo! News Services. p. 1. Retrieved 9 July 2012. In the 1960s and early 1970s, Salam wielded significant influence in Pakistan as the chief scientific adviser to the president, helping to set up the country's space agency and the institute for nuclear science and technology. Salam also assisted in the early stages of Pakistan's effort to build a nuclear bomb, which it eventually tested in 1998
 9. Rizvi, Murtaza (21 November 2011). "Salaam Abdus Salam". The Dawn Newspapers. Archived from the original on 17 February 2012. Mohammad Abdus Salam (1926–1996) was his full name, which may add to the knowledge of those who wish he was either not Ahmadi or Pakistani. He was the guiding spirit and founder of Pakistan's atomic bomb programme, as well as Pakistan Atomic Energy Commission and Space and Upper Atmosphere Research Commission (SUPARCO).
 10. Alim, Abdul (2011). "Who is the Father (Salam or Khan)?". Muslim Times, Lahore. Archived from the original on 17 April 2013. Retrieved 10 December 2012.
 11. Our Correspondents. "Scientists asked to emulate Dr Salam's achievements". 7 October 2004. Dawn News International, Archive 2004. Retrieved 22 January 2012.
 12. (Rahman 1998, pp. 10–101)
 13. "Re-engineering Pakistan and Physics from Pakistan Conference:MQM Stays loyal with Pakistan Armed Forces". Jang News Group. Jang Media Cell and MQM Science and Technology Wing. 2011. Archived from the original on 13 June 2011. Retrieved 11 June 2011. Professor Muhammad Abdus Salam and Dr. Abdul Qadeer Khan, and other prominent scientists, have made Pakistan, a nuclear power. All of these scientists were poor or Muhajir (migrants from India), says Altaf Hussain.
 14. Philately (21 November 1998). "Scientists of Pakistan". Pakistan Post Office Department. Archived from the original on 20 February 2008. Retrieved 18 February 2008.
 15. Abdus Salam, As I Know him: Riazuddin, NCP
 16. Ishfaq Ahmad (21 November 1998). "CERN and Pakistan: a personal perspective". CERN Courier. Retrieved 18 February 2008.
 17. Riazuddin (21 November 1998). "Pakistan Physics Centre". ICTP. Archived from the original on 22 February 2017. Retrieved 23 August 2016.
 18. "Abdus Salam -Biography". Nobel Prize Committee.