అబ్బాయితో అమ్మాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్బాయితో అమ్మాయి
దర్శకత్వంరమేశ్‌ వర్మ
నిర్మాతజె. వందన అలేఖ్య, పి. కిరీటి , ఎస్. శ్రీనివాస్
తారాగణంనాగశౌర్య
పాల‌క్ ల‌ల్వాని
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుఎస్.ఆర్.శేఖర్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థలు
జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్
దేశంభారత్
భాషతెలుగు

అబ్బాయితో అమ్మాయి 2016లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో నాగశౌర్య, పాల‌క్ ల‌ల్వాని హీరో, హీరోయిన్ గా నటించగా రమేశ్‌ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2016, జనవరి 01వ తేదీన విడుదలయ్యింది.[1]

కథ[మార్చు]

అభి (నాగశౌర్య) అందరిలానే ఓ మంచి గర్ల్ ఫ్రెండ్ ని లైన్ లోపెట్టాలని ట్రై చేస్తుంటాడు. ప్రార్థన (పల్లక్ లల్వాని) ఫేస్ బుక్ లో మారు పేర్లతో పరిచయమై మంచి స్నేహితులవుతారు. ఆ ఆన్ లైన్ స్నేహం అలా కొనసాగుతుండగా.. ఇక్కడ ఆఫ్ లైన్లో ఒకరినొకరు చూస్తారు. అభి చాలా ప్లాన్లు వేసి ప్రార్థను ప్రేమలోకి దించుతాడు. తర్వాత ఇద్దరూ శారీరకంగా కూడా కలుస్తారు. ఈ విషయం వాళ్ల తల్లిదండ్రులకి తెలిసి సమస్య పెద్దదవుతుంది. ఆ సమయంలోనే అభి తననెలా మోసం చేసింది ప్రార్థనకు తెలుస్తుంది. దీంతో ఆమె అతణ్ని అసహ్యించుకుంటుంది. నిజ జీవితంలో విడిపోయిన వీళ్లిద్దరూ ఫేస్ బుక్ లో మాత్రం ఒకరినొకరు చూసుకోకుండా తమ స్నేహాన్ని కొనసాగిస్తారు. మరి ఆ స్నేహం ఎంతవరకు వెళ్లింది, చివరికి వీళ్లిద్దరూ కలిశారా లేదా అన్నది ఈ సినిమా కథ.[2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: రమేశ్‌ వర్మ
  • నిర్మాతలు: జె.వందన అలేఖ్య, పి.కిరీటి, ఎస్.శ్రీనివాస్
  • సంగీతం: ఇళయరాజా
  • సినిమాటోగ్రాఫర్: శ్యామ్ కె. నాయుడు
  • ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్
  • పాటలు: రహ్మాన్
  • ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందివ్వగా, రెహ్మాన్, చైతన్య వర్మ & సిరాశ్రీ పాటలను రాశారు.

No. పాట గాయకులు రచయిత నిముషాలు (m:ss)
1 "రీనామేకరీనా " పీయూష్ కపూర్ రెహ్మాన్ 4:47
2 "ఎదురు చూస్తున్న " విభావరి రెహ్మాన్ 5:22
3 "తొలి పరువం " సత్య ప్రకాష్, విభావరి రెహ్మాన్ 5:47
4 "మాటల్లో చెప్పలేని" కార్తీక్ రెహ్మాన్ 4:18
5 "కనులు కలను పిలిచే " హరిచరణ్, చిన్మయి రెహ్మాన్ 4:57
6 "ఒకసారి ఓ వయ్యారి" యాజిన్ నిజార్, రీటా, బ్లేజ్ రెహ్మాన్ 3:47
7 "సరదాలే" ఎం.ఎం. మనసి, రమ్య, రీటా, రీనా రెడ్డి చైతన్య వర్మ 4:46
8 అబ్బాయితో అమ్మాయి (మేల్) పీయూష్ కపూర్ సిరాశ్రీ 1:31
9 అబ్బాయితో అమ్మాయి(ఫిమేల్) అపర్ణ సిరాశ్రీ 1:28

మూలాలు[మార్చు]

  1. The Hindu (1 January 2016). "Abbayitho Ammayi: Can audience buy this?". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
  2. Sakshi (1 January 2016). "ఓపికగా... అబ్బాయితో అమ్మాయి". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
  3. The Indian Talks (1 January 2016). "Critics on Abbayitho Ammayi Telugu Movie Review & Rating- First Day Collections". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.