అబ్బిరాజుపాలెం
అబ్బిరాజుపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | యలమంచిలి |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 534266 |
ఎస్.టి.డి కోడ్ |
అబ్బిరాజుపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలానికి చెందిన గ్రామం.[1] గోదావరి తీర ప్రాంతమైన ఒక మంచి ఆరోగ్యకరమైన పల్లెటూరు. జనాభా సుమారు 10,000 వరకూ ఉంటారు. ప్రజల ప్రధానమైన జీవనాధారం వరి పంట. చెరకు కూడా విస్తారంగా పండిస్తారు.
వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం[మార్చు]
ఊరిలో గల ముఖ్యమైన దేవాలయాలు- వెంకటేశ్వర దేవాలయం మరియూ శివాలయం. మరియూ దుర్గాలయం. ఈమధ్య శివాలయం అభివృద్ధి పరచబడింది. మరియూ శివాలయం ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో 25 అడుగుల సుందర ఆంజనేయ స్వామి వారి విగ్రహం గలదు. గోదావరి తీరమును ఆనుకొని నిర్మించుటచే ఇక్కడి వెంకటేశ్వరాలయమునకు సుదూరప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు.ఇక్కడ 99 అడుగుల అభయఆంజనేయ స్వామి వారి విగ్రహం గలదు .ఈ దేవాలయమును దక్షణ తిరుమల అని పిలుస్తుంటారు. ఈ వూరిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో 2013 జూన్ 3 న హనుమత్ జయంతినాడు 99 అడుగుల ఎత్తయిన ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇది రాష్ట్రంలో రెండవ అతి పెద్ద ఆంజనేయ విగ్రహం. [1]
ఇతర విశేషాలు[మార్చు]
అదే దేవాలయమునకు కొద్ది దూరములో తాటి పాక, పొదలాడ (రాజోలు). వెళ్ళేందుకు రేవు ఉంది.ఇక్కడి నుండి పడవల ద్వారా ప్రతి రోజూ చలామంది తాటిపాకకు, పొదలాడ.ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ తరచు వరదలు మమూలుగా వస్తూ ఉంటాయి. దానివలన గ్రామాభివృద్ది చాలా తక్కువ. ఎందరో రాకపోకలు సాగించే రేవులో సైతం సరి అయిన సౌకర్యాలు లేవు.
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.