అబ్రహం లింకన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్రహం లింకన్
అబ్రహం లింకన్


అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడు
పదవీ కాలం
ఏప్రిల్ 3, 1861 – ఏప్రిల్ 15, 1865
ఉపరాష్ట్రపతి Hannibal Hamlin (1861 – 1865)
Andrew Johnson (1865)
ముందు జేమ్స్ బుకానన్
తరువాత ఆండ్రూ జాన్సన్

పదవీ కాలం
మార్చి 4, 1847 – మార్చి 3, 1849
ముందు జాన్ హెన్రీ
తరువాత థామస్ హారిస్

వ్యక్తిగత వివరాలు

జననం (1809-02-12)1809 ఫిబ్రవరి 12
హార్డిన్ కౌంటీ, కెంటకీ
మరణం 1865 ఏప్రిల్ 15(1865-04-15) (వయసు 56)
వాషింగ్టన్ డి.సి
జాతీయత అమెరికన్
రాజకీయ పార్టీ Whig (1832-1854), Republican (1854-1864), National Union (1864-1865)
జీవిత భాగస్వామి Mary Todd Lincoln
సంతానం Robert Todd Lincoln, Edward Lincoln, Willie Lincoln, Tad Lincoln
వృత్తి న్యాయవాది
మతం క్రైస్తవం
సంతకం అబ్రహం లింకన్'s signature

అబ్రహం లింకన్ (ఫిబ్రవరి 12, 1809ఏప్రిల్ 15, 1865) ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ అమెరికా అధ్యక్షుడు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన లింకన్ దురదృష్టవశాత్తూ అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే హత్యగావింపబడ్డాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

లింకన్ కాంస్య విగ్రహం

లింకన్ 1809 ఫిబ్రవరి 12 సంవత్సరం థామస్ లింకన్, నాన్సీ హ్యాంక్స్ దంపతులకు జన్మించాడు. ఆయనది రైతు కుటుంబం. ఆయన పూర్వీకుడైన సామ్యూల్ లింకన్ 17వ శతాబ్దంలోనే ఇంగ్లండునుంచి మసాచుసెట్స్ కు వలస వచ్చాడు. ఆయన తాత పేరు కూడా అబ్రహాం లింకనే.ఆయన కెంటకీకి వచ్చినపుడు 5000 ఎకరాలకు యజమాని.

లింకన్ కు తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన తల్లి అనారోగ్యంతో మరణించింది. వెంటనే తండ్రి రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె సవతి తల్లియైనప్పటికీ లింకన్ కు ఆమెకు గాఢమైన అనురాగం ఏర్పడింది. తన జీవితాంతం అమ్మ అని వ్యవరించేవాడు. కానీ రాను రానూ తండ్రికి దూరమయ్యాడు. కాని చాలా మంచి వాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]