Jump to content

అభిజిత్ ముఖర్జీ

వికీపీడియా నుండి
అభిజిత్ ముఖర్జీ
అభిజిత్ ముఖర్జీ


నియోజకవర్గం జాంగీపూర్
పదవీ కాలం
2012 అక్టోబర్ 18 – 2019 మే 23
ముందు ప్రణబ్ ముఖర్జీ
తరువాత ఖలీలూర్ రెహమాన్

పదవీ కాలం
2011 మే 13 – 2012 అక్టోబర్ 18
ముందు దీపక్ ఛటర్జీ
తరువాత దీపక్ ఛటర్జీ
నియోజకవర్గం నల్హతి

వ్యక్తిగత వివరాలు

జననం (1960-01-02) 1960 January 2 (age 65)
హుగ్లీ, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2011–2021, 2025–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ (2021–2024)
తల్లిదండ్రులు ప్రణబ్ ముఖర్జీ
సువ్రా ముఖర్జీ
నివాసం కబీ భారతి సరణి, కోల్‌కతా
పూర్వ విద్యార్థి జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం (బీఈ)
వృత్తి రాజకీయ నాయకుడు
వృత్తి చార్టర్డ్ ఇంజనీర్ & సోషల్ వర్కర్
మూలం [1]

అభిజిత్ ముఖర్జీ (జననం 2 జనవరి 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జాంగీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అభిజిత్ ముఖర్జీ తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ అడుగుజాడల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2011 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో నల్హతి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎఐఎఫ్‌బి అభ్యర్థి దీపక్ ఛటర్జీపై 15160 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2012లో తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత జాంగిపూర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఐ (ఎం) అభ్యర్థి ముజఫర్ హుస్సేన్‌పై 2,536 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

అభిజిత్ ముఖర్జీ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జాంగీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సిపిఐ (ఎం) అభ్యర్థి ముజఫర్ హుస్సేన్‌పై 8,161 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 255,836 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.

అభిజిత్ ముఖర్జీ 2021లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి,[2][3] ఆ తరువాత 2025 ఫిబ్రవరి 12న కోల్‌కతాలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, మాజీ కాంగ్రెస్ ఎంపీ & పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభాంకర్ సర్కార్ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Abhijit Mukherjee" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
  2. "Former President Pranab Mukherjee's son Abhijit joins TMC" (in ఇంగ్లీష్). The Week. 5 July 2021. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
  3. "Former President Pranab Mukherjee's son Abhijit joins Trinamool Congress" (in ఇంగ్లీష్). The New Indian Express. 5 July 2021. Retrieved 8 July 2025.
  4. "Former President Pranab Mukherjee's son, Abhijit returns to Congress" (in Indian English). The Hindu. 12 February 2025. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.
  5. "Ex-President Pranab Mukherjee's son Abhijit rejoins Congress: Coming back home" (in ఇంగ్లీష్). India Today. 12 February 2025. Archived from the original on 8 July 2025. Retrieved 8 July 2025.