అభినందన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Merge-arrow.svg
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని అభినందన్ వర్థమాన్ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
Abhinandan vatdhaman
అభినందన్ వర్ధమాన్
జననంచెన్నై
ర్యాంకువింగ్ కమాండర్, IAF Crest.svg
వెబ్‌సైటుindianairforce.nic.in

అభినందన్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ భారత వైమానిక దళం[1].

బాల్యం, కుటుంబం[మార్చు]

అబినందన్ వర్దనమాన్ తమిళనాడుకు చెందిన పైలట్. స్వస్థలం చెన్నై. తండ్రి వర్దమాన్.

నియంత్రణ రేఖ దాటిన అభినందన్[మార్చు]

పిబ్రవరి నెల 26 2019 నాడు జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకు వచ్చిన పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఎయిర్ క్రాఫ్ట్ ను తరిమి కొట్టడంలో, నేల కూల్చడంలో మనదేశ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ దీన్ని గమనించిన వెంటనే నౌషెరా సెక్టార్ బేస్ క్యాంప్ నుంచి అభినందన్ మిగ్ 21 యుద్ధ విమానంతో శతృవుల ఎయిర్ క్రాఫ్ట్ లను ఎదరించారు. ఎఫ్-16 భూమికి ఎనిమిది వేల అడుగుల ఎత్తున ఉండగా.. అభినందన్ తన మిగ్ 21 యుద్ధ విమానాన్ని 15 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాక్ ఎయిర్ క్రాప్ట్ ను టార్గెట్ గా చేసుకుని కాల్పులు జరిపారు. దీనితో అది తిరుగుముఖం పట్టింది. అయినప్పటికీ, అభినందన్ దాన్ని వదల్లేదు. వెంటాడారు. ఈ సందర్భంగా అభినందన్.. ఓ చిన్న సందేశాన్ని పంపించారు. నేను తరుముకుంటూ వారి వెనుకే వెళ్తున్నా.. అని మిగ్ 21లో అమర్చిన రేడియో ద్వారా మాట్లాడారు.. నౌషేరా సెక్టార్ పరిధిలోని లామ్ లోయ సమీపంలో భారత సైనిక శిబిరాలు, ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకుని బాంబులు కురిపించింది. ఎఫ్-16ను వెంటాడే సమయంలో అభినందన్ నడుపుతున్న మిగ్-21 అత్యంత వేగంగా ప్రయాణించినట్లు రాడార్ లో రికార్డయ్యింది. నాలుగు సెకెన్ల వ్యవధిలో కిలోమీటర్ దూరాన్ని అధిగమించినట్లు స్పష్టమైంది. దీన్ని గంటలతో లెక్కిస్తే 900 కిలోమీటర్ల దూరం అవుతుంది. గంటకు 900 కిలోమీటర్ల వేగంతో మిగ్-21 ప్రయాణించింది. అంతే వేగంతో 86 సెకెన్ల పాటు మిగ్ ప్రయాణించింది. నియంత్రణ రేఖ దాటి, పాక్ గగనతలంలోకి ప్రవేశించిన క్షణాల వ్యవధిలోనే ఇంజిన్ స్తంభించింది. దీనితో అభినందన్ ప్యారాషూట్ సహాయంతో పాక్ గడ్డపై దిగారు. పాకిస్తాన్ వైపు నియంత్రణ రేఖకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో అభినందన్ దిగినట్లు వెల్లడైంది. నియంత్రణ రేఖ సమీపంలో అభినందన్ మిగ్ 21 ద్వారా ఆర్ 73 క్షిపణిని ప్రయోగించారు. అది నేరుగా ఎఫ్ 16ను ఛేదించింది.

ప్యారాషూట్ సహాయంతో పాక్ గడ్డపై[మార్చు]

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని భీంబర్ జిల్లా హోరాన్ గ్రామం భూభాగంలో ప్యారాషూట్ సహాయంతో పాక్ గడ్డపై దిగారు. ఆయన నేలపై పాకుతూ బయటకు వచ్చారు. కానీ అక్కడకు చేరుకున్న స్థానిక ప్రజలు ఆయనను చుట్టుముట్టారు.

నేను భారత్‌లోనే దిగానా అని తన దగ్గరకు ముందుగా చేరుకున్న కొందరు యువకులను ఆ పైలట్ అడిగారు. తన నడుం చుట్టూ ఉన్న పారాచ్యూట్ బెల్టును తనకుతానుగానే తొలగించుకున్నారు. భారత దేశంపై భక్తిని చాటే కొన్ని నినాదాలు చేశారు. కానీ అక్కడున్న యువకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

దీంతో ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్నవారిని భయపెట్టేందుకు తన తుపాకి తీసి ఓసారి గాల్లోకి కాల్చారు. కానీ ఈ పరిణామంతో చుట్టూ ఉన్న యువకులు ఆగ్రహంతో అక్కడున్న రాళ్లను తీసి ఆ పైలట్‌పై విసిరారు. దీంతో ఆయన గాల్లోకి మరికొన్ని రౌండ్లు కాల్పులు జరుపుతూ పరుగందుకున్నారు. కానీ అక్కడున్న యువకులు తర్వాత సైన్యానికి అప్పగించారు.

భారత సమాచారం అతని వద్ద తన జేబుల్లో ఉన్న కొన్ని పేపర్లను బయటకు తీసి, చింపి, వాటిని నాశనం చేసేశారు. కొన్నింటిని నోట్లో పెట్టుకుని నమిలేశారు. కానీ అక్కడున్న యువకులు ఆయన దగ్గర నుంచి కొన్ని పేపర్లను లాక్కున్నారు.

మూడు రోజుల పాటు అభినందన్ పాక్ దళాల అదుపులో ఉన్నారు.

నిబంధనలు, నియమాలు[మార్చు]

సాధారణంగా ఒక దేశ సైనికుడి యుద్ధ ఖైదీగా పట్టుబడితే ఆయా దేశాల ఒప్పందాల మేరకు అప్పగించాల్సి ఉంటుంది. భారత్, పాకిస్థాన్ విషయంలో జెనీవా ఒప్పందం ఉంది. దీని ప్రకారం పట్టుబడిన యుద్ధఖైదీని వారంరోజుల్లో అప్పగించకుంటే యుద్ధం ప్రారంభించినట్టే లెక్క. ఈ నియమం ప్రకారం పాకిస్థాన్ భారత్ కు అభినందన్ ను అప్పగించింది. ఆ తర్వాత వాఘా సరిహద్దులో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ప్రత్యక్షమయ్యారు. దీంతో రెడ్‌క్రాస్ సొసైటీ విధుల నిర్వహణపై చర్చ మొదలైంది. మధ్యేమార్గమా ? సాధారణంగా పట్టుబడిన దేశం వైద్య పరీక్షలు జరిపినా .. లేదంటే సొంత దేశం హెల్త్ చెకప్ చేసినా తర్వాత సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు మాత్రమే హెల్త్ చెకప్ చేస్తారు. కానీ దీనికి ఓ చరిత్రే ఉంది. ఎలా మొదలైంది ? 1859లో వ్యాపారవేత్త జీన్ హెన్రీ డ్యూనంట్ వ్యాపారం కోసం లావర్డి నగరానికి బయల్దేరారు. ఆ సమయంలో ఫ్రాన్స్, ఆస్ట్రియా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రథమ చికిత్స లేక వేలాదిమంది చనిపోయారు. ఈ ఘటనను చూసి చలించిపోయిన డ్యూనంట్ .. తన వ్యాపారం గురించి మరచిపోయి ఆపదలో ఉన్నవారికి సాయం చేశారు. యుద్ధం ముగిసాక గాయపడిన వారికి సహాయం చేయాలి, ఇది మానవ ధర్మం అని విజప్తి చేశారు. 1864లో జెనీవాలో అంతర్జాతయ సమావేశంలో రెడ్‌క్రాస్ సంస్థ ఏర్పాటు కోసం 14 దేశాలు అంగీకారం తెలిపాయి. ఇది ప్రైవేట్ సంస్థ .. దీనికి అనుబంధంగా కూడా సంస్థలు పనిచేస్తున్నాయి. తొలినాళ్లలో ఇది కేవలం యుద్ధాల్లో గాయపడినవారికి మాత్రమే సేవలు అందించేది .. తర్వాత క్రమంగా అందరికీ సేవ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెడ్‌క్రాస్ సంస్థ వ్యాపించి ఉంది.

రెడ్ క్రాస్[మార్చు]

రెడ్‌క్రాస్ ముఖ్య విధులు ప్రథమ చికిత్స, మంచినీటిని పరిశుభ్రంగా ఉంచడం, నర్సులకు శిక్షణ ఇవ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపడం, మెడికల్ కాలేజీ స్థాపించి .. రక్తనిధులను సేకరిస్తారు. యుద్ధ సమయాల్లో గాయపడ్డవారికి ప్రథమ చికిత్స చేసే వీరు .. క్రమ క్రమంగా సేవలను విస్తరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా యుద్ధఖైదీలను అప్పగించే సమయంలో రెడ్ క్రాస్ సంస్థ తమ విధులను నిర్వర్తిస్తోంది. వారికి వైద్య పరీక్షలు చేసి .. అప్పగించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఏలాగూ ఇరుదేశాలు ఎవరినీ నమ్మేస్థితిలో లేనందున .. రెడ్ క్రాస్ మధ్యవర్తిత్వంతో ఏ సమస్య ఉండదు.

1 మార్చి 2019 నాడు పాకిస్తాన్ అధికారులు భారత అధికారులకు అప్పగించారు. పాకిస్తాన్కీ పట్టుబడిన కేవలం సుమారు 80 గంటల్లోనే విడుదలైన మొదటి యుద్దఖైది.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://www.bbc.com/telugu/topics/c8471973-963c-445c-bf09-6a9ee07c4160
"https://te.wikipedia.org/w/index.php?title=అభినందన్&oldid=2612554" నుండి వెలికితీశారు