Jump to content

అభినవసరస్వతి

వికీపీడియా నుండి
అభినవసరస్వతి
అభినవసరస్వతి 1914 అక్టోబరు సంచిక
సంపాదకులుజానపాటి పట్టాభిరామశాస్త్రి
తరచుదనంమాసపత్రిక
స్థాపకులుజానపాటి పట్టాభిరామశాస్త్రి
మొదటి సంచికజనవరి 1, 1909 (1909-01-01)
దేశం India
కేంద్రస్థానంజానపాడు / గుంటూరు
భాషతెలుగు

అభినవసరస్వతి మాసపత్రిక జానపాడు గ్రామం నుండి వెలువడింది. నరసారావుపేట భారతీవిలాస ముద్రాక్షరశాలలో ప్రచురింపబడింది. తరువాత కొంత కాలానికి గుంటూరుకు తరలించబడింది. ప్రథమ సంచిక 1909 జనవరిలో ప్రచురితమయ్యింది. ఈ పత్రికకు జానపాటి పట్టాభిరామశాస్త్రి సంపాదకుడు. ఈ తొలితరం సాహిత్య పత్రిక 37 సంవత్సరాలకు పైగా నడిచింది. "ఇందు ప్రాచీనాంధ్ర నవీనాంధ్ర ప్రభంధములును, దాత్కాలిక వృత్తాంతంబులును, విమర్శనములును, విద్యావిషయిక, మతవిషయిక వ్యాసములును బకటించబడును" అని ప్రకటించుకుంది.

1911 నవంబరు వరకు నరసరావుపేట భారతీవిలాస ముద్రాక్షరశాలలో ముద్రించేవారు. డిసెంబరు నుండి గుంటూరు లోని చంద్రికా ప్రెస్‌లో ముద్రించారు. ప్రచురణ మాత్రం జానపాడు నుండే కొనసాగింది. మరికొంత కాలానికి ప్రచురణను కూడా గుంటూరుకు తరలించారు.

విశేషాలు

[మార్చు]

ఈ పత్రికలో గ్రాంథికభాషను ఉపయోగించినారు. సంపాదకుడు స్వయంగా కవి, అవధాని కావడంతో సంపాదకీయ వ్యాసాలలోను, కృతి విమర్శనము వంటి శీర్షికలలోనూ తరచూ పద్యాలను వ్రాశాడు. ఈ పత్రిక తిరుపతి వేంకట కవులకు, కొప్పరపు సోదర కవులకూ మధ్య జరిగిన వివాదాలను విపులంగా చర్చించింది. ఈ పత్రిక ఈ వివాదంలో తిరుపతి వేంకట కవుల పక్షాన నిలిచింది.

బాల్యవివాహాలను నిషేధించడం వంటి చట్టాలను ఈ పత్రిక వ్యతిరేకించింది. హైదరాబాదు సంస్థానంలో ఈ చట్టం చేసినపుడు ఈ పత్రికలో ".. నో నిజాము రాష్ట్రీయ సనాతన ధర్మరతపండితులా లెండు. ఊరూరికిం జని యుసపన్యానము లిండు. సనాతనధర్మ బోధచే జననహస్రముల బాలికావివాహనిషేధశాననానమ్మతులం గొండు. స్వమత దేశముల సంరక్షించుకొనవలసిన సమయము వచ్చినది. ఘోరకలి సొచ్చినది. అధర్మము హెచ్చినది... " అని రాసారు.[1]

వితంతు పునర్వివాహాలకు కూడా ఈ పత్రిక వ్యతిరేకమే. వితంతువు పెళ్ళిని "ముండల పెళ్ళి" అని అధిక్షేపించింది.[2] రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం, బాల్యవివాహాల నిర్మూలనం, పంచములకు దేవాలయ ప్రవేశం వంటి సంస్కరణలే కారణమని రాసింది.[3]

శాసనోల్లంఘనోద్యమంలో తాడిచెట్లను నరికివేయడం "మహాపాపమని మేము ప్రత్యేకముగా నిరసించుచున్నాము" అని ఒక వ్యాసంలో రాసింది.[4]

1912 లో పత్రిక సర్క్యులేషను 22 ఉండేది.[5]

ఇతర పత్రికలతో సంబంధాలు

[మార్చు]

అభినవసరస్వతికీ, గోలకొండ పత్రికకూ మధ్య స్పర్థ ఉండేది. అయితే ఇది అంశాలపై ఆధారపడి కాక, వ్యక్తిగత స్థాయిలో ఉండేది. అభినవసరస్వతి బిచ్చగత్తె పత్రిక అని గోలకొండ పత్రిక అంటే, గోలకొండ సంపాదకుడు గ్రామ్య పండితుడు అని అభినవసరస్వతి రాసింది.[6]

రచనలు

[మార్చు]

ఈ పత్రికలో స్వవిషయము, కృతి విమర్శనము మొదలైన శీర్షికలతో పాటు వ్యాసాలు, ప్రాచీన నవీన గ్రంథాలను ధారావాహికగా ప్రచురించారు.

ఈ పత్రిక ప్రచురించిన గ్రంథాలలో

  • అఘశాల ప్రహసనము
  • చమత్కార మంజరి - సింహాద్రి వెంకటాచార్యులు
  • కంసవధము (ఆంధ్రీకృతము) - జానపాటి పట్టాభిరామశాస్త్రి
  • పల్నాటి వీరభాగవతము - ముదిగొండ వీరభద్రకవి
  • వత్సల నీతి శతకము,
  • లక్ష్మీ విలాసము - రాయసము వేంకటపతి
  • బ్రాహ్మణత్వ విచారము,
  • అత్యద్భుత విమర్శనము - మంగళగిరి కృష్ణద్వైపాయనాచార్యులు
  • గుంటూరు శతావధానము - తిరుపతి వేంకట కవులు
  • వేమవరాగ్రహార శతావధానము - తిరుపతి వేంకట కవులు
  • కొప్పరపు సోదరకవుల శతావధానము - నాళ్ళచెర్వు రంగారావు
  • ఇందుమతీ పరిణయము - కుమార ధూర్జటి
  • శంతనరాజ చరిత్ర - అన్నమరాజు రమణయ్య
  • తిరుపతి వేంకటేశ్వర తత్త్వము - శిష్టా హనుమచ్ఛాస్త్రి
  • శివానందలహరి (అనువాదము) - తంగెడ రామకృష్ణకవి
  • యౌవన నిగర్హణము - కోటగిరి వేంకట కృష్ణారావు
  • సూత సంహిత - కొప్పరాజు నరసింగయ్య
  • భాగవత రహస్యములు
  • విగ్రహారాధన ఖండన ఖండనము - బొమ్మకంటి సీతారామశాస్త్రులు
  • రజస్వలా వివాహ ఖండనము - చివుకుల అప్పయ్యశాస్త్రి, శివపురపు వీరభద్రపాకయాజి
  • లలితాంబా శతకము
  • శుద్ధాంధ్ర హరిశ్చంద్రచరిత్ర - రాయవరపు గవఱ్ఱాజు
  • కన్యావిక్రయము - వెంకటశివకవులు
  • ఆంధ్రయోగవాశిష్ఠము - మద్దూరి సాంబయ్య
  • ఇల్లాలు - దంటు లక్ష్మీకాంతరావు
  • సుకన్యకా పరిణయము - పిన్నెలి నాగయ్య కవి మొదలైనవి ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. జానపాటి, పట్టాభిరామశాస్త్రి (1940-04-01). అభినవ సరస్వతి (in Telugu). Vol. 32. p. 3.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. జానపాటి, పట్టాభిరామశాస్త్రి (1945-02-01). అభినవసరస్వతి. Vol. 37. గుంటూరు: జానపాటి పట్టాభిరామశాస్త్రి. p. 3.{{cite book}}: CS1 maint: date and year (link)
  3. జానపాటి, పట్టాభిరామశాస్త్రి (1941). అభినవసరస్వతి. Vol. 33. గుంటూరు: జానపాటి పట్టాభిరామశాస్త్రి. p. 12.
  4. జానపాటి, పట్టాభిరామశాస్త్రి (1930). అభినవసరస్వతి. Vol. 22. గుంటూరు: జానపాటి పట్టాభిరామశాస్త్రి. p. 20.
  5. Indian Newspaper Reports, c1868-1942 from the British Library, London Part 5: Madras, 1876-1921 1912 (in English). Internet Archive. [Publishers vary]. 1912.{{cite book}}: CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link)
  6. Janapati Pattabhirama Sastry (1929-01-01). Abhinava Saraswathi అభినవ్ సరస్వతి Volume 20 Issue 10 (in Telugu).{{cite book}}: CS1 maint: unrecognized language (link)