అభినవ్ గోమఠం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అభినవ్ గోమఠం
Abhinav Gomatam.jpg
జననం
అభినవ్ గోమఠం

జాతీయతభారతీయుడు
విద్యబి.టెక్
వృత్తిసినిమా నటుడు
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం

అభినవ్ గోమఠం తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా నటుడు. 2014లో వచ్చిన మైనే ప్యార్ కియా చిత్రంతో సినిమారంగంలోకి అడుగుపెట్టిన అభినవ్, 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిత్రంలోని కౌశిక్ పాత్ర ద్వారా గుర్తింపు పొందాడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

హైదరాబాదులో జన్మించిన అభినవ్, గుజరాత్ లో పెరిగాడు. అభినవ్ తండ్రి ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగి. అందువల్ల అభినవ్ విద్యాభ్యాసం వివిధ ప్రాంతాలలో జరిగింది. బి.టెక్ చదువుతున్న సమయంలో కాలేజీలోనే నటనలో శిక్షణ పొందాడు. ఇంజినీరింగ్‌ తరువాత కొంతకాలం డెల్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి, సినిమాలకోసం ఉద్యోగాన్ని వదిలేశాడు.[2][3]

సినిమారంగం[మార్చు]

నటనపై ఉన్న ఆసక్తితో ఉదాన్ థియేటర్, అహం థియేటర్ వంటి నాటక సంస్థలు ప్రదర్శించిన నాటకాల్లో నటించాడు.[4] అటుతరువాత కొన్ని లఘుచిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2021 రంగ్ దే తెలుగు
2019 మీకు మాత్రమే చెప్తా[5][6] తెలుగు
2019 సీత చక్రం తెలుగు
2019 ఫలక్‌నుమా దాస్‌ తెలుగు
2019 జెస్సీ తెలుగు
2018 ఈ నగరానికి ఏమైంది కౌశిక్ తెలుగు ప్రధాన పాత్ర
2017 మళ్ళీరావా డుంబు తెలుగు
2015 జగన్నాటకం బంటి తెలుగు
2014 బిల్లా రంగ తెలుగు
2014 మైనే ప్యార్ కియా తెలుగు
2013 ఆర్టిఫీసియల్ మానవ్ తెలుగు లఘుచిత్రం, ఆగస్టు 2013

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రభూమి, చిత్రభూమి (28 October 2019). "అందరికీ.. అదే చెప్తున్నాం". andhrabhoomi.net. Archived from the original on 29 October 2019. Retrieved 29 October 2019.
  2. నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (29 October 2019). "నటుణ్ణి అవుదామనుకోలేదు!". www.ntnews.com. Archived from the original on 29 October 2019. Retrieved 29 October 2019.
  3. ఈనాడు, టాలీవుడ్ (సినిమా). "అందుకే ఉద్యోగం మానేశాను". www.eenadu.net. Archived from the original on 29 October 2019. Retrieved 29 October 2019.
  4. ప్రజాశక్తి (28 October 2019). "ఇది విజయ్ చేయాల్సింది కానీ." www.prajasakti.com. Archived from the original on 29 October 2019. Retrieved 29 October 2019.
  5. ఆంధ్రప్రభ, సినిమా (29 October 2019). "విభిన్న పాత్రలు చేయాలని అనుకుంటున్నా..అభినవ్ గోమటం." Archived from the original on 29 October 2019. Retrieved 29 October 2019.
  6. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (1 November 2019). "'మీకు మాత్ర‌మే చెప్తా' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 1 November 2019. Retrieved 1 November 2019.