Jump to content

అభిమన్యుడు ( 2018 సినిమా)

వికీపీడియా నుండి
అభిమన్యుడు
దర్శకత్వంపీఎస్‌ మిత్రన్‌
రచనపీఎస్‌ మిత్రన్‌
పొన్ పార్తీబన్
సవారి ముత్తు
ఆంటోనీ భాగ్యరాజ్
నిర్మాతవిశాల్ కృష్ణ
తారాగణంవిశాల్ కృష్ణ
అర్జున్ సర్జా
సమంత
ఛాయాగ్రహణంజార్జ్‌ సీ విలియమ్స్‌
కూర్పురూబెన్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ
పంపిణీదార్లులైకా ప్రొడక్షన్స్
క్రిక్స్ సినీ క్రియేషన్స్
విడుదల తేదీ
జూన్ 1, 2018 (2018-06-01) [1]
సినిమా నిడివి
160 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

అభిమన్యుడు 2018లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా 2018లో తమిళంలో విడుదలైన ఇరుంబు తిరై సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.[2][3]

అప్పుల వాళ్లను మోసం చేస్తూ సిగ్గు లేకుండా బ్రతికే తన తండ్రిని చూసి ఇంటి నుండి వెళ్ళిపోతాడు కరుణాకరన్ అలియాస్ కర్ణ (విశాల్). కొన్నాళ్లకు మిలిటరీ ట్రైనింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగ పొందుతాడు.కర్ణకు విపరీతమైన కోపం దాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలని అధికారులు సూచిస్తూ కర్ణను ఏంగర్ మేనేజ్మెంట్‌లో సర్టిఫికేట్ తీసుకురావాలని ఉన్నతాధికారులు అధికారులు ఆర్డర్ వేస్తారు. దానికోసం లతాదేవి (సమంతా) అనే సైకియాట్రిస్ట్‌ను కలుస్తాడు. ఆమె సలహాల మేరకు నెల రోజుల పాటు సొంతూరు వెళ్లి గడపాలని నిర్ణయించుకుంటాడు. అక్కడకు వెళ్లిన తరువాత తన చెల్లెలకు పెళ్లి చేయాలసిన బాధ్యత తన మీద ఉందని తెలుసుకుంటాడు. కర్ణ లోన్ కోసం ఎన్ని బ్యాంకులు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఓ మధ్యవర్తి ఆశ్రయించి ఆరు లక్షల లోన్ పొందుతాడు. బ్యాంక్ లో ఉండాల్సిన ఆరు లక్షలతో పాటు తన అకౌంట్‌లో ఉన్న మరో నాలుగు లక్షలు మొత్తం పది లక్షల రూపాయలు డబ్బు తెలియకుండానే పోతుంది. డబ్బు మాయమవడానికి కారణం వైట్ డెవిల్ (అర్జున్) అని కర్ణకు తెలుస్తుంది. ఇంతకీ ఈ వైట్ డెవిల్ ఎవరు ? కర్ణ తరువాత ఏమి చేశాడు అనేది మిగతా సిమిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • నిర్మాత: జి.హరి, విశాల్
  • సంగీతం: యువన్‌ శంకర్‌రాజా
  • సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌
  • ఎడిటింగ్: రూబెన్స్‌
  • మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి
  • దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌ [5]
  • ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్

మూలాలు

[మార్చు]
  1. The Times of India (22 May 2018). "Vishal-starrer 'Abhimanyudu' to release on June 1 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Sakshi (1 June 2018). "'అభిమన్యుడు' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.
  3. Namasthe Telangana (3 June 2021). "విశాల్ 'అభిమన్యుడు' సినిమాకు మూడేళ్లు.. !". Namasthe Telangana. Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.
  4. Deccan Chronicle (9 June 2018). "Abhimanyudu declared a blockbuster". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.
  5. Zee Cinimalu (1 June 2018). "అభిమన్యుడు మూవీ రివ్యూ". www.zeecinemalu.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.