అభిమన్యు పవార్
స్వరూపం
| అభిమన్యు పవార్ | |||
| పదవీ కాలం 2019 అక్టోబర్ 24 | |||
| ముందు | బసవరాజ్ పాటిల్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ఔసా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1971 జూలై 1 కసర్ షిర్షి, నీలంగా, లాతూర్, మహారాష్ట్ర, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | దత్తాత్రే పవార్ | ||
| నివాసం | ఔసా , మహారాష్ట్ర, భారతదేశం | ||
| పూర్వ విద్యార్థి | దయానంద్ కామర్స్ కాలేజ్ లాతూర్ , ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ & రీసెర్చ్ పూణే | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అభిమన్యు దత్తాత్రే పవార్ (జననం 1971 జూలై 1) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఔసా శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]అభిమన్యు పవార్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 నుండి 2019 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పని చేసి,[1] 2019 మహారాష్ట్ర ఎన్నికలలో ఔసా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బసవరాజ్ పాటిల్‌పై 26,714 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి దినకర్ బాబూరావు మనేపై 33,462 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Ausa". 23 November 2024. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
- ↑ "Ausa Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.