అభిసారిక (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అభిసారిక తొలి సంచికల్లో ఒకటైన సెప్టెంబరు 1949 సంచిక యొక్క ముఖచిత్రం

అభిసారిక తెలుగు భాషలో ప్రచురించబడుతున్న లైంగిక విజ్ఞాన పక్షపత్రిక.

అభిసారిక తెలుగు కావ్యాలలో చెప్పబడిన అష్టవిధనాయికలలో ఒక శృంగార నాయిక. "అభిసారిక" లేదా "అభిసారిణి" అనగా ప్రియుడి కోసం సంకేత స్థలానికి పోయే నాయిక.

తెలుగు పత్రికలలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ సెక్స్ సైన్స్ విషయంగా ప్రారంభమై ఈనాటికీ ప్రజాభిమానంతో నడుస్తున్న పత్రిక అభిసారిక.

ప్రారంభం

[మార్చు]

1949లో తెనాలి నుంచి ధనికొండ హనుమంతరావు దీనిని వెలువరించారు. వీరే స్వయంగా ఇంగ్లీషు పుస్తకాల నుంచి విషయ సేకరణ చేసి అనువదించేవారు. 1960లో రాంషా (దర్భా వేంకట రామశాస్త్రి), శిరీష దంపతులు సామర్లకోట నుండి తమ సంపాదకత్వంలో దీనిని మరింత విజ్ఞాన పత్రికగా మలిచి తెలుగు ప్రజలకు చేరువయ్యేలా తీర్చిదిద్దారు. ఈ పత్రిక జూలై 27, 1961 తేదీన నమోదు (రిజిస్ట్రేషన్ నెం.5908) చేయబడినది. లైంగిక విజ్ఞాన విషయాలు ఆ రోజులలో బోధించడం తప్పుగానూ, విశృంఖలతగానూ భావించేవారు. కానీ మిగతా శాస్త్రాల వలెనే దీనినీ తెలుసుకుంటే యువత చెడు మార్గాలు పట్టదని, దంపతులైన జంటలు సంసార రథాన్ని సవ్యంగా నడుపుకుంటారనీ రాంషా శిరీష దంపతులు భావించి, అభిసారికను ముందుకు నడిపించారు. వీరి ఆదర్శంతో ఎంతో మంది వారి పిల్లలకు శిరీష అని పేరు పెట్టుకున్నారంటే అతిశయోక్తి కాదు.

అభిసారికలో లైంగిక విజ్ఞానంతో పాటు సమకాలీన రాజకీయాల విశ్లేషణలు, ధర్మశాస్త్రాల వివరణ, ఆంగ్ల తదితర భాషలలో వచ్చిన మంచి పుస్తకాల అనువాదాలు కూడా ప్రచురించేవారు. ఉదాహరణకు మాక్సిం గోర్కీ మాల్వా, కన్నడంలో యూ.ఆర్.అనంతమూర్తి వ్రాసిన సంస్కార నవల సంస్కారం గా, చీకటే మిగిలింది, అహల్య కాపురం వంటి అనువాద నవలలను అభిసారిక ప్రచురించింది. ప్రస్తుతం దీనికి డా. పూషా సంపాదకులుగా, ప్రచురణకర్తగా వ్యవహరిస్తున్నారు. [1]

మూలాలు

[మార్చు]
  1. "Registrar of Newspapers for India లో రిజిస్ట్రేషన్ వివరాలు". Archived from the original on 2015-03-21. Retrieved 2009-05-29.

బయటి లింకులు

[మార్చు]