అమరేంద్ర బొల్లంపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమరేంద్ర బొల్లంపల్లి
Amarendra Bellampalli.jpeg
జననం (1952-08-08) 1952 ఆగస్టు 8 (వయస్సు: 66  సంవత్సరాలు)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
నివాసంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయుడు
జాతితెలుగు
వృత్తిరంగస్థల, టీవీ నటుడు, దర్శకుడు మరియు సినిమా నటుడు.
తల్లిదండ్రులువేంకటహరి, ఆండాళమ్మ
బంధువులుకల్పనశ్రీ (భార్య), స్పందన, భావన (కూతుళ్లు)

అమరేంద్ర. బి రంగస్థల, టీవీ నటుడు, దర్శకుడు మరియు సినిమా నటుడు.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

అమరేంద్ర 1952, ఆగష్టు 8 న బొల్లంపల్లి వేంకటహరి, ఆండాళమ్మ దంపతులకు హైదరాబాద్ లో జన్మించాడు. బి.ఏ. వరకు చదువుకున్నాడు. పి.జి. డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ లో చేరి నటన, దర్శకత్వంలో శిక్షణ పొందాడు.

వివాహం - పిల్లలు[మార్చు]

కల్పనశ్రీ తో 1977, జూన్ 7న అమరేంద్ర వివాహం జరిగింది. వారికి ఇద్దరు అమ్మాయిలు (స్పందన, భావన)

ఉద్యోగ జీవితం[మార్చు]

వజీర్ సుల్లాన్ టొబాకో కంపనీలో సీనియర్ బ్లెండింగ్ అధికారిగా పనిచేసి, 1997లో స్వచ్ఛంద పదవి విరమణ చేశాడు.

నాటకరంగ ప్రస్థానం[మార్చు]

అమరేంద్ర, తన పెద్దన్నయ్య భాను ప్రకాష్ ప్రోత్సాహంతో పత్తర్ కే ఆన్సూ అనే హిందీ నాటకంలో నాటకరంగ ప్రవేశంచేశాడు.[2] వివిధ సంస్థలలో 4వేల వరకు నాటిక, నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. మొదటిసారిగా ఎన్.ఆర్. నంది రాసిన వాన వెలిసింది నాటికకు దర్శకత్వం వహించాడు. 1972లో రవి ఆర్ట్స్ సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన నాటిక పోటీలలో ఉత్తమ దర్శకుడిగా బంగారు పతకం అందుకున్నాడు. అనేక నాటక పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు.

1969లో ఆదర్శ యువభారతి అనే సంస్థను ప్రారంభించి, ఆ సంస్థ ఆధ్వర్యంలో నాటిక, నాటక ప్రదర్శనలు ఇస్తున్నాడు.

బహుమతులు[మార్చు]

నంది బహుమతులు:

  1. ఉత్తమ ప్రతినాయకుడు - నంది నాటక పరిషత్తు - 2016[3]

పురస్కారాలు - సత్కారాలు:

  1. తెలంగాణ థియేటర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ సత్కారం[4]

టీవిరంగ ప్రస్థానం[మార్చు]

తూర్పు పడమర, మిస్టరీ, జీవన తీరాలు, ధరణికోట, ధూర్జటి, పోతన, ఫ్యాక్షన్ - ఫ్యాక్షన్, కాశీమజిలీ కథలు, ఊహల పల్లకి, మాయాబజార్, మంచుపర్వతం, ఉషోదయం, విధి, పద్మవ్యూహం, ఎండమావులు, అనురాగధార, ఓ అమ్మకథ, బుజ్జి - బజ్జిబాబు, కథా స్రవంతి, శ్రావణీ సుబ్రహ్మణ్యం వంటి దాదాపు 250 సీరియళ్లలో నటించాడు.

సినీరంగ ప్రస్థానం[మార్చు]

అమరేంద్ర నటించిన ఆందమే ఆనందం నాటిక చూసిన జంధ్యాల విచిత్రప్రేమ సినిమాలో అమరేంద్రకు అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత బావా బావా పన్నీరు, విషజ్వాల, చీకటి సూర్యులు, కూలన్న, రైతురాజ్యం, ఊరుమనదిరా, భీముడు, వేగుచుక్కలు, గంగమ్మ జాతర, వీరివీరి గుమ్మడి పండు, అమ్మమీద ఒట్టు, బతుకమ్మ, వీర తెలంగాణ, పోరు తెలంగాణ, రాజ్యాధికారం[5] మెదలైన సినిమాలలో నటించాడు.

మూలాలు[మార్చు]

  1. తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 194.
  2. ఆంధ్రజ్యోతి. "తెలుగు నాటకంపై చెరగని ముద్ర". Retrieved 8 August 2017.
  3. ప్రజాశక్తి. "ఘనంగా కందుకూరి, నంది పురస్కారాల ప్రదానోత్సవం". Retrieved 8 August 2017.
  4. సాక్షి. "నీటి ప్రాజెక్టుకు విద్యాసాగర్‌ పేరు". Retrieved 8 August 2017.
  5. ఆంధ్రజ్యోతి. "'రాజ్యాధికారం' నాలుగు పాత్రల్లో నారాయణమూర్తి". Retrieved 8 August 2017.