అమర్‌నాథ్ ప్రధాన్
| అమర్‌నాథ్ ప్రధాన్ | |||
| పదవీ కాలం 2009 – 2014 | |||
| ముందు | ప్రసన్న ఆచార్య | ||
|---|---|---|---|
| తరువాత | నాగేంద్ర కుమార్ ప్రధాన్ | ||
| నియోజకవర్గం | సంబల్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1958 May 11 సంబల్‌పూర్, భారతదేశం | ||
| జాతీయత | |||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అమర్‌నాథ్ ప్రధాన్ (జననం 11 మే 1958) ఒడిశాకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అత్మల్లిక్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒడిశా ప్రభుత్వంలో మంత్రిగా పని చేసి, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]అమర్‌నాథ్ ప్రధాన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి అత్మల్లిక్ శాసనసభ నియోజకవర్గం నుండి 1985, 1995లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికలలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒరిస్సా ప్రభుత్వంలో సమాచార & ప్రజా సంబంధాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), లిఫ్ట్ ఇరిగేషన్, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), పరిశ్రమల సహాయ మంత్రిగా (స్వతంత్ర బాధ్యత) పని చేసి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి రోహిత్ పూజారిపై 14874 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 242131 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Lok Sabha 2019 constituency: Odisha's Sambalpur is a BJD bastion". Hindustan Times. 15 April 2019. Archived from the original on 20 June 2025. Retrieved 20 June 2025.
- ↑ "AMARNATH PRADHAN : Bio". The Times of India. 4 June 2024. Archived from the original on 20 June 2025. Retrieved 20 June 2025.
- ↑ "Cong Names Six Lok Sabha Candidates in Second List" (in ఇంగ్లీష్). The New Indian Express. 14 March 2014. Retrieved 20 June 2025.
- ↑ "Profile of Members". Government of India. Archived from the original on 1 జనవరి 2012. Retrieved 11 మార్చి 2012.