అమర్‌సింహ పండిట్
| అమర్‌సింహ పండిట్ | |||
| |||
| పదవీ కాలం 2012 జూలై 27 – 2018 జూలై 30 | |||
| పదవీ కాలం 2004 – 2009 | |||
| ముందు | బాదమ్‌రావ్ పండిట్ | ||
|---|---|---|---|
| తరువాత | బాదమ్‌రావ్ పండిట్ | ||
| నియోజకవర్గం | జియోరాయ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1964 మే 31 డైతాన్, బీడ్, మహారాష్ట్ర , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
| తల్లిదండ్రులు | శివాజీరావు పండిట్[1] | ||
| జీవిత భాగస్వామి | అమృత అమరసింహా పండిట్ | ||
| బంధువులు | జైసింగ్ శివాజీరావు పండిట్, విజయసింహ శివాజీరావు పండిట్ | ||
| సంతానం | పద్మాంజలి, రణవీర్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అమర్‌సింహ శివాజీరావు పండిట్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జియోరాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]అమర్‌సింహ పండిట్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బాదమ్‌రావ్ పండిట్ చేతిలో 18665 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3] ఆయన 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బాదమ్‌రావ్ పండిత్‌పై పై 16,600 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అమర్‌సింహ పండిట్ 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బాదమ్‌రావ్ పండిట్ చేతిలో 2,347 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5]
అమర్‌సింహ పండిట్ 2012 జూలై 27 నుండి 2018 జూలై 30 వరకు మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా పని చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Missing the forest for Maharashtra's family tree" (in ఇంగ్లీష్). The New Indian Express. 16 May 2012. Retrieved 9 January 2025.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.