అమర్ చిత్ర కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Supercbbox

అమర్ చిత్ర కథ (హిందీअमर चित्र कथा, amar citra kathā ?, "మరణం లేని మైమరపించే (లేదా చిత్ర) కథలు") (అమర్ చిత్ర కథ పిఎల్ ) అనేది భారత దేశంలో అత్యధికంగా విక్రయించబడే కామిక్ పుస్తక శ్రేణులలో ఒకటి. 20 భారతీయ భాషలలో 90 మిలియను కంటే ఎక్కువ ప్రతులు విక్రయించబడ్డాయి.[1] 1967లో స్థాపించబడిన ఈ కథా శ్రేణిలో 400 కు పైగా శీర్షికలు ఉన్నాయి. వీటిలో భారతీయ కావ్యాలు, పురాణాలు, చరిత్ర, జానపద గాథలు మరియు కల్పిత కథలను కామిక్ పుస్తక రూపములో చెప్పబడతాయి. ఇది అనంత్ పాయ్ చే సృష్టించబడి, ఇండియా బుక్ హౌస్ చే ప్రచురించబడింది. 2007లో ఈ ముద్రణ మరియు అన్ని శీర్షికలను ఏసికే మీడియా అనే ఒక క్రొత్త సంస్థ కొనుగోలు చేసింది. 2008 సెప్టెంబరు 17న ఏసికే మీడియా వారి వెబ్ సైట్ ప్రారంభించబడింది.[2][3]

సృష్టి మరియు సృష్టికర్తలు[మార్చు]

భారతీయ పిల్లలకు వారి సంస్కృతీ గురించి నేర్పించాలనే ఉద్దేశముతో ఈ కామిక్ శ్రేణిని అనంత్ పాయ్ ప్రారంభించాడు. భారతీయ విద్యార్థులు గ్రీక్ మరియు రోమన్ పురాణాల గురించి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగి, తమ స్వీయ చరిత్ర, పురాణాలు మరియు జానపద కథల గురించి తెలియకుండా ఉండడం చూసి అతను అవాక్కయ్యాడు. 1967 ఫిబ్రవరిలో దూరదర్శన్లో జరిగిన ఒక క్విజ్ కార్యక్రమములో పాల్గొన్నవారు గ్రీక్ పురాణాలకు సంబంధించిన ప్రశ్నలకు సులువుగా జవాబు ఇవ్వగలిగారు. కాని "రామాయణలో, రాముడు యొక్క తల్లి ఎవరు?" అనే ప్రశ్నకు జవాబు చెప్పలేక పోయారు.[4][5]

కమల చంద్రకాంత్, మర్గీ శాస్త్రీ, సుబ్బారావు, దేబ్రాణి మిత్ర, సి.ఆర్ శర్మ మొదలుగువారు అమర్ చిత్ర కథ యొక్క సృజనాత్మక బృందంలో చేరారు. అనంత్ పాయ్ సంపాదకుడుగా వ్యవహరించి, పలు కథలకు సహ-రచయితగా ఉన్నారు. రామ్ వాయీర్కర్ తో పాటు, దిలీప్ కదం, సంజీవ్ వాయీర్కర్, సౌరెన్ రాయ్, సి.డి రాణే, జెఫ్రీ ఫౌలర్ మరయు ప్రతాప్ ముల్లిక్ చిత్ర రూపకర్తలుగా వ్యవహరించారు.

కామిక్స్[మార్చు]

మొదట్లో అమర్ చిత్ర లోని చిత్రాలు పూర్తిగా రంగులతో ముద్రించబడలేదు- ఆర్థిక కారణాల వలన, ప్యానల్ లు పసుపు, నీలం మరియు ఆకుపచ్చ రంగులలో మాత్రమే ఉండేవి. తరువాయి సంచికలు, పూర్తి రంగులలో ముద్రించబడ్డాయి. అన్ని అమర్ చిత్ర కథ పుస్తకాలు నెలవారీగా (తరువాత పక్షానికి) 30-పేజీలలో ఉండేవి. స్పష్టమైన ఆసక్తి కలిగించే కథాంశాలతో ఉండేవి. ఈ "ఒక్క" కథ రూపముతో పాటు కథలు 1 లో 3 మరియు 1 లో 5 గట్టి అట్ట కలిగిన పుస్తకాల కట్టలుగా కూడా లభిస్తున్నాయి. మహాభారతము వంటి పురాణాలు 1300+ పేజీల సెట్ గా విశేష ప్రచురణలో లభ్యమవుతున్నాయి.

అప్పుడప్పుడు, 90 పేజీలతో కొన్ని "బంపర్" సంచికలు విడదల అయ్యాయి. వీటిలో విడి సంచికల నుంచి ఒకే రకమైన కథలు ఉండేవి (ఉదాహరణకు, మంకి స్టోరీస్ ఫ్రం ది హితోపదేశ, టేల్స్ అఫ్ బీర్బల్ మరియు ది స్టొరీ అఫ్ రామ ) వంటి కొన్ని పెద్ద కథలు ). ఈ కావ్య కథలకు మంచి ఆదరణ లభించడంతో, భారత దేశ చరిత్ర గురించిన, వివిధ ప్రాంతాలకు మరియు వివిధ మతాలకు చెందిన పురుషులు, స్త్రీల గురించిన మరియు సంస్కృతం మరియు ప్రాంతీయ కావ్యాలకు సంబంధించిన కదల గురించిన కథలను ప్రచురించడం మొదలుపెట్టారు. కామిక్స్ కు ఆదరణ కొనసాగుతూ ఉండడంతో, పలుమార్లు పునఃప్రచురణ జరుగుతూ ఉండేది. దీని వలన 70లు మరియు 80లలో పాత సంచికలు కూడా ముద్రించబడుతూ ఉండేవి. ప్రజాదరణ ఉచ్చస్థాయిలో ఉన్న 80ల మధ్య కాలములో, ఇవి బెంగాలీ, మరాఠీ, అస్సామీస్, గుజరాతీ, పంజాబీ, కన్నడ, తెలుగు, తమిళ్, సంస్కృతము మరియు ఉర్దూ భాషలలో అనువదించబడ్డాయి. నెలకు ఐదు లక్షల కంటే ఎక్కువ ప్రతులు అమ్ముడుపోయాయి. కొన్ని కథలు ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, స్వాహిలి, ఫిజియన్, ఇండోనేషియన్, మరియు సేర్బో- క్రోట్ భాషలలో కూడా అనువదించబడ్డాయి.

90ల మధ్యకాలములో, మందమైన కార్డ్ స్టాక్ కవర్ లలో మరియు మెరుగైన రంగులలో అందంగానూ గట్టిగాను ఉండే విధముగా అసలు కామిక్స్ మరల ప్రచురించబడ్డాయి. ఈ రోజు, దేశములోని అన్ని ప్రధాన పుస్తక విక్రయదారుల వద్ద, వందలాది చిన్న పుస్తకశాలల వద్ద మరియు వేలాది వ్యాపారుల వద్ద అమర్ చిత్ర కథ పుస్తకాలు లభిస్తాయి. పెద్ద స్టోర్ లలో అత్యధికంగా అమ్మబడుతున్న బాలల ప్రచురణ ఇదే.

2007లో, ఒక కొత్త ఆన్‌లైన్ స్టోర్ ను ప్రచురణకర్త సృష్టించి, అన్ని శీర్షికలను ప్రపంచవ్యాప్తంగా పంపించే విధముగా ఏర్పాటు చేశారు. ఈ శీర్షికలు ఈ క్రింద వర్గాలుగా విభజించబడుతున్నాయి.

 1. కల్పిత కథలు & జానపద గాథలు (ఉదా: పంచతంత్ర )
 2. పురాణాలు (ఉదా: రామాయణ )
 3. పౌరాణిక గ్రంథాలు (ఉదా: రామాయణ )
 4. హాస్యం మరియు చతురత
 5. జీవితచరిత్రలు (ఉదా: మహాత్మా గాంధీ )
 6. సాహిత్యాలు
 7. 1 లో 3 శీర్షికలు
 8. 1 లో 5 శీర్షికలు
 9. విశేష సంచికలు

సాంస్కృతిక ప్రాధాన్యత[మార్చు]

సాంఘిక-ఆర్దిక కారణాల వలన మరియు నగరీకరణ వలన సాంప్రదాయక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి భారత సమాజం మెల్లగా దూరమవుతున్న తరుణములో అమర్ చిత్ర కథ ఆవిర్భావం జరిగింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో, పురాణాల నుండి జానపద గాథల నుండి కథలను తాత బామ్మలు పిల్లలకు చెప్పేవారు. నగరప్రాంతాలలో ఈ వ్యవస్థకు స్వస్తి చెప్పబడి చిన్న కుటుంభాలు ఏర్పడడంతో, తాత బామ్మలు లేని లోటును అమర్ చిత్ర కథ పూర్తి చేసింది. ఆంగ్లము ప్రధాన భాషగా ఈ కథలు రావడంతో, ఆంగ్ల మాధ్యమం పాఠశాలలలో చదివే పిల్లల వద్దకు కథలు చేరాయి.

తరువాత కామిక్ లో చరిత్ర విషయాలు రావడంతో, విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడింది. అప్పటి వరకు కేవలం పేర్లు మరియు తేదీలుగా ఉన్న భారత చరిత్ర, కథలుగా జీవించసాగాయి. ఆనాటి భవన నిర్మాణ శైలి, దుస్తులు, ప్రాంతీయ అంశాలు మరియు వాస్తవాలతో ఉండడంతో ఈ కామిక్స్ సమాజంలో అందరిచే ఆమోదించబడి, తల్లితండ్రులు మరియు ఉపాధ్యాయులు వీటిని విద్య బోధనకు వాడడం జరిగింది. పాత్రలను ఎటువంటి పక్షపాతం లేకుండా సజాతీయమైన రీతిలో రూపొందించడంతో, ఇది కొంత మేరకు దేశీయ ఐక్యతను పెంపొందించి దేశమంతట ప్రాంతాల మధ్య అవగాహన పెంచింది.

ఈ కథ శ్రేణి వివాదాలకు దూరంగా ఉంటూ, విషయాల తీవ్రతను మరియు హింసను తగ్గించి, కచ్చితమైన స్వీయ-నియంత్రణ చేసుకుంటూ ఉంది.

ప్రసిద్ధ సంస్కృతిలో[మార్చు]

గులాల్ చిత్రంలో, రణంజయ్ సింగ్ అనే ప్రధాన పాత్ర, తాను అమర్ చిత్ర కథలో కాకుండా నిజ ప్రపంచంలో జీవించాలని అనుకుంటున్నాని చెప్పి సాంప్రదాయక రాజపుత్ర వీరత్వం పై తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తాడు.

ఆధునీకరణ[మార్చు]

కాలాలను బట్టి అమర్ చిత్ర కథ మార్పు చెందుతూ వచ్చింది. ప్రస్తుతం అది డిజిటల్ మీడియా రూపంలో ఆన్ లైన్ నుండి మొబైల్ ఫోన్ వరకు అందుబాటలో ఉంది. అమర్ చిత్ర కథ కామిక్స్ లను ఐఫోన్ ద్వారా అందించడం కొరకు అట్లాంటా, జిఏకు చెందిన ఐరెమడి కార్పరేషన్ తో ఏసికే-మీడియా ఇటీవల చేతులు కలిపింది. 2009 డిసంబర్ 5న, ప్రసిద్ధ అమర్ చిత్ర కథ కామిక్స్ ను ఐఫోన్ ద్వారా ఐరెమేడి మరియు యాపిల్ అందించాయి. ఐరేమడీ యొక్క ఈథర్ మీడియా వియూవర్ లో ఐఫోన్ లు మరియు ఐపాడ్ ద్వారా ప్యానల్ వారిగా చదివే సదుపాయాన్ని కల్పించడం కొరకు అమర్ చిత్ర కథ కామిక్స్ లో మార్పులు చేయబడ్డాయి. మరింత వివరాల ఐ రెమేడి వారి వెబ్‌సైట్ లో చూడవచ్చు.[6]

ప్రసిద్ధ ఏసికే శీర్షికలు యాపిల్ యొక్క ఐట్యూన్స్ యాప్‌స్టోర్ లో నేరుగా లభ్యమవుతాయి.[7]

విమర్శలు[మార్చు]

కథలు ఎక్కువగా చాలా సాదాగా ఉండి, కేవలం ఒక ప్రమాణసిద్దమైన మూలము పైనే ఆధారపడేవి. అందువలన, వీటిని "చరిత్ర" లాగా పరిగణించరాదని విమర్శలు వచ్చాయి. అమర్ చిత్ర కథ లోని చిత్రాల ద్వారానే చారిత్రాత్మక మరియు పౌరాణిక పాత్రలను చూడగలిగే ఒక తరాన్ని భారత దేశములో ఇది సృష్టించింది. ఇవి పూర్తిగా పరిశీలన చేయబడినవి కావు మరియు యథార్థమైనవి కావు కాని ఇవే తరువాత 'మహాభారత మరియు 'రామాయణ' వంటి టివి సిరీస్ లలో అనుసరించబడ్డాయి. వీటిలో అనేకము రాజా రవి వర్మ యొక్క చిత్రాలం పై ఆధారపడినవే.[8]. పాత్రలను సాదాగా నాయకులుగాను విలన్ లాగానూ (హిందీ చలనచిత్రాల మాదిరిగా) చిత్రీకరించడం కొన్ని ఎత్నిక్ స్టీరియోటైప్ లతో సంబంధాన్ని వక్రీకరించినట్లుగా ఉంటుంది. ఉదాహరణకు, రాక్షసులు అందర్నీ నల్లటి రంగులో చూపేవారు.

కొన్ని కామిక్ సీరీస్ లలో ఈ విమర్శలు వాస్తవమేనైనా, విమర్శకులలో పలువురు వారి ప్రాంతాలు, సిద్ధాంతాలు లేదా విద్యా సంస్థలకు సంబంధించి రాజకీయ ఉద్దేశం కలిగినవారు; తరచూ ఈ పక్షపాతమే కొన్ని విమర్శలకు దారి తీశాయి.

మరింత పఠనం కోసం[మార్చు]

 • ఇండియాస్ ఇమ్మార్టల్ కామిక్ బుక్స్: గాడ్స్, కింగ్స్, అండ్ అతర్ హీరోస్ . రచన: కర్లినే మాక్ లైన్, ఇండియాన యూనివర్సిటీ ప్రెస్, 2009. ISBN 978-0-253-22052-3.
 • ది క్లాసిక్ పాపులర్: అమర్ చిత్ర కథ (1967-2007) . రచన: నందిని చంద్ర, యోడ ప్రెస్, 2008. ISBN 81-903634-3-3.3
 • "అమర్ చిత్ర కథ: వెస్ట్రన్ ఫాంస్, ఇండియన్ కంటెంట్స్". రచన: సంజయ్ సిర్కార్, బుక్‌బర్డ్, ఎ జర్నల్ అఫ్ ఇంటర్నేషనల్ చిల్రంస్ లిటరేచర్, 2000, 38, నం. 4, పేజీ. 35-36.
 • "ఫ్రం సెల్ఫ్-నాలెడ్జ్ టు సూపర్ హీరోస్: ది స్టోరి అఫ్ ఇండియన్ కామిక్స్". రచన: అరుణ రావు, 2001: లేనట్, ఎ . జాన్ (ఎడ్.) లో.

ఇల్లస్త్రేటింగ్ ఆసియా, కామిక్స్, హ్యూమర్ మేగజైన్స్ అండ్ పిక్చర్ బుక్స్, రిచ్మాండ్, పే. 37-63.

సూచనలు[మార్చు]

 1. "Amar Chitra Katha, Tinkle to entertain kids on Net". CNN-IBN. 2008-01-27. Retrieved 2008-01-28.
 2. "ACK Media buys Amar Chitra Katha, Tinkle brands". The Hindu Business Line. 2007-11-22. Retrieved 2008-01-28.
 3. భారత దేశంలో కామిక్ పుస్తకాలకు టివి కార్టూన్ లుగా కొత్త జీవితం న్యూ యార్క్ టైమ్స్, జూలై 19, 2009."...ఏడాదికి 3 మిలియను ప్రతులు అమ్మబడుతున్నాయి, 1967లో స్థాపించబడినప్పటినుండి, ఆంగ్లం మరియు 20 కంటే ఎక్కువ భారతీయ భాషలలో సుమారు 100 మిలియను కంటే ఎక్కువ ప్రతులు అమ్మబడ్డాయి."
 4. ఇప్పుడు, అమర్ చిత్ర కథ వయస్సు మరింత తగ్గింది విజయ్ సింగ్, టి ఎన్ ఎన్ , ది టైమ్స్ అఫ్ ఇండియా, 16 అక్టోబర్ 2009.
 5. ది వరల్డ్ అఫ్ అమర్ చిత్ర కథ మీడియా అండ్ ది ట్రాన్స్ ఫర్మేషన్ అఫ్ రేలీజన్ ఇన్ సౌత్ ఆసియా . రచన: లారన్స్ ఏ బాబ్, సుసాన్ ఎస్. వాడ్లేయ్. మోతిలాల్ బనార్సిదాస్ ప్రచురణ, 1998. ISBN 0520205472 చాప్టరు . 4, పే. 76-86 .
 6. http://www.iRemedi.com/amarchitrakatha.htm
 7. http://ax.search.itunes.apple.com/WebObjects/MZSearch.woa/wa/search?entity=software&media=all&submit=seeAllLockups&term=iremedi
 8. http://famous-paintings.adzoomin.com/2011/02/comic-art-paintings-from.html సాఫ్ట్ వేర్

బాహ్య లింకులు[మార్చు]

మూస:Amar Chitra Katha