Jump to content

అమర్ పాల్ సింగ్

వికీపీడియా నుండి
అమర్ పాల్ సింగ్

పదవీ కాలం
1994  1999
ముందు హరీష్ పాల్
తరువాత అవతార్ సింగ్ భదానా
నియోజకవర్గం మీరట్

పదవీ కాలం
1989  1991
ముందు అబ్దుల్ వాహిద్ ఖురేషి
తరువాత విజయ్‌పాల్ సింగ్ తోమర్
నియోజకవర్గం సర్ధన

వ్యక్తిగత వివరాలు

జననం (1946-05-31) 1946 మే 31 (వయసు: 80)
ధిబౌలి , యునైటెడ్ ప్రావిన్స్ (ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ), బ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
అనితా సింగ్
(m. 1982)
సంతానం 1 కొడుకు
పూర్వ విద్యార్థి మీరట్ విశ్వవిద్యాలయం ( B.Sc )
మూలం

అమర్ పాల్ సింగ్ (జననం 31 మే 1946) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మీరట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అమర్ పాల్ సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సర్ధన శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1994లో మీరట్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

అమర్ పాల్ సింగ్ 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్యర్థి మొహమ్మద్ అఫ్జల్ పై 1,68,116 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి జగ్వీర్ సింగ్‌పై 48,805 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

అమర్ పాల్ సింగ్ 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అవతార్ సింగ్ భదానా చేతిలో 24836 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Former BJP MP Amar Pal Shot Dead In Meerut" (in ఇంగ్లీష్). India TV News. 15 November 2010. Archived from the original on 28 June 2025. Retrieved 28 June 2025.
  2. "Meerut Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 28 June 2025. Archived from the original on 28 June 2025. Retrieved 28 June 2025.