Jump to content

అమర్ సింగ్ రాయ్

వికీపీడియా నుండి
అమర్ సింగ్ రాయ్

పదవీ కాలం
2016 – 2019
ముందు త్రిలోక్ దివాన్
తరువాత నీరజ్ జింబా
నియోజకవర్గం డార్జిలింగ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ గూర్ఖా జనముక్తి మోర్చా
నివాసం డార్జిలింగ్
వృత్తి రాజకీయ నాయకుడు

అమర్ సింగ్ రాయ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2016 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో గూర్ఖా జనముక్తి మోర్చా సభ్యుడిగా డార్జిలింగ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అమర్ సింగ్ రాయ్ గూర్ఖా జనముక్తి మోర్చా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2016 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో జిజెఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సర్దా రాయ్ సుబ్బాపై 49,913 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజు బిస్తా చేతిలో 4,13,443 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "Even now people consider us outsiders, says Amar Singh Rai" (in Indian English). The Hindu. 20 June 2017. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
  2. "Darjeeling Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
  3. "West Bengal: TMC ties up with GJM Tamang faction for Darjeeling seat" (in ఇంగ్లీష్). The Indian Express. 13 March 2019. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
  4. "Darjeeling MLA Amar Singh Rai is 'son of soil' nominee". The Telegraph. 13 March 2019. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.