Coordinates: 16°34′43″N 82°00′22″E / 16.5787°N 82.0061°E / 16.5787; 82.0061

అమలాపురం గడియార స్తంభం సెంటర్

వికీపీడియా నుండి
(అమలాపురం గడియార స్థంభం సెంటర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అమలాపురం గడియార స్తంభం సెంటర్
గడియార స్తంభం సెంటర్
అమలాపురం గడియార స్తంభం సెంటర్
అక్షాంశ,రేఖాంశాలు16°34′43″N 82°00′22″E / 16.5787°N 82.0061°E / 16.5787; 82.0061
ప్రదేశంఅమలాపురం , ఆంధ్రప్రదేశ్ భారత దేశం
ఎత్తు40 అడుగుల
నిర్మాణం ప్రారంభం1957

కోనసీమ జిల్లా లో ప్రధాన పట్టణమైన అమలాపురంలోని ప్రధానమైన కూడళ్ళలో ఈ గడియార స్తంభం 1957 లో నిర్మించారు. కోనసీమ వాసులకే కాదు, జిల్లా వాసులకు సుపరిచయం, కొండ గుర్తుగా ఈ గడియార స్తంభం ఉండేది.

చరిత్ర[మార్చు]

ఈ గడియార స్తంభం దాదాపు 6 దశాబ్దాల చరిత్ర కలిగినది.గడియార స్తంభాన్ని 1957 నవంబర్ 20న అప్పటి జిల్లా కలెక్టర్ ఎ కృష్ణస్వామి, మున్సిపల్ చైర్మన్ కె వెంకటరత్నం, కమిషనర్ వైవి సుబ్బారావుల ఆధ్వర్యంలో నిర్మించారు.పునాది నుంచి చుతురస్రాకారంలో నిర్మితమైన ఈ గడియార స్తంభం పైకి వెళ్ళే కొద్దీ పరిమాణం తగ్గేలా సుమారు 40 అడుగుల ఎత్తులో డిజైన్‌ చేశారు.[1] అప్పటి కాలంలో వివిధ ప్రాంతాల నుండి పనులపై అమలాపురం వచ్చిన వారికి గడియార స్తంభం ఒక చిరునామాగా నిలిచేది.నాలుగు దిక్కులా గడియారాలు కనిపిస్తూ, ప్రజలకు సమయం చూసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడేది.అమలాపురం లో ఒక చారిత్రిక కట్టడంగా పేరు పొందింది.

ఉద్యమాలు[మార్చు]

ఈ గడియార స్తంభం సెంటర్ రాజకీయ, సామాజిక ఉద్యమాలకు ఇది ప్రధాన వేదికగా ఉండేది.ఇక్కడ నుండే ప్రజలు నిరసనలు తెలియజేసేవారు.

శిధిలస్థితి నూతన గడియార స్తంభం ఏర్పాటు[మార్చు]

ఈ చారిత్రిక కట్టడం శిధిల స్థితికి చేరుకోవడంతో గడియారాలు పనిచేయడం మానేసాయి. పాత గడియార స్తంభాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో నూతన హంగులతో కూడిన మరో స్మారక చిహ్నం నిర్మించారు.ఈ స్తంభాన్ని నిర్మించేందుకు ఓఎన్‌జిసి కోటి రూపాయలు సమకూర్చింది. [2][3]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రభూమి (2016). "గడియర స్తంభం చరిత్ర". ఆంధ్రభూమి.
  2. ఆంధ్రభూమి (2016). "స్మృతిపథంలో అమలాపురం గడియార స్తంభం". {{cite journal}}: Cite journal requires |journal= (help)
  3. ఈనాడు (2018). "గడియర స్తంభం నూతన నిర్మాణం". {{cite journal}}: Cite journal requires |journal= (help)