అమలాపురం పురపాలక సంఘం
అమలాపురం | |
![]() | |
స్థాపన | 1940 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | అమలాపురం |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
అమలాపురం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ. ఈ పురపాలక సంఘం అమలాపురం లోకసభ నియోజకవర్గంలోని, అమలాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర[మార్చు]
అమలాపురం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని పట్టణం. మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి 201 కి.మీ లో ఉంది. అమలాపురం పురపాలక సంఘం 1940లో మున్సిపాలిటీగా స్థాపించబడింది. ఈ పురపాలక సంఘంలో 30 వార్డులు ఉన్నాయి.[1] కొబ్బరి ,వరి పంటలను పండిస్తారు. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల తరువాత తూర్పు గోదావరిలో ఇది మూడవ అతిపెద్ద పట్టణం.[2]
జనాభా గణాంకాలు[మార్చు]
అమలాపురం పురపాలక సంఘం లో 30 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2001 లో జనాభా 51444 ఉన్న జనాభా 2011 లో 53231 కు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం అమలాపురం మునిసిపాలిటీలో 53,231 జనాభా ఉండగా అందులో పురుషులు 26,485,మహిళలు 26,746 మంది ఉన్నారు.అమలాపురం మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 14,639 ఇండ్లు కలిగిఉన్నాయి. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4635 ఉన్నారు.అక్షరాస్యత రేటు 76%, పురుష జనాభాలో 79% ఉండగా, స్త్రీ జనాభాలో 73% అక్షరాస్యులు ఉన్నారు.[3][1]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]
ప్రస్త్తుత చైర్‌పర్సన్ గా యల్లా సతీష్ పనిచేయుచున్నాడు.[4]పి. విజయ లక్ష్మి వైస్ చైర్మన్ గా పనిచేయుచున్నారు.[4]
పుణ్య క్షేత్రాలు[మార్చు]
అమలాపురంలో వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి.
ఇతర వివరాలు[మార్చు]
ఈ పురపాలక సంఘంలో 14120 గృహాలు ఉన్నాయి.ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.33 మురికివాడలు ఉన్నాయి, ఈ మురికివాడలో 15298 జనాభా ఉన్నారు.5 ఇ-సేవా కేంద్రాలు,2 ఉన్నత పాఠశాలలు,23 ప్రాథమిక పాఠశాలలు,ఒక మార్కెట్టు ఉన్నాయి.[5]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 28 January 2016. ఉదహరింపు పొరపాటు: చెల్లని
<ref>
ట్యాగు; "civicbody" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ https://amalapuram.cdma.ap.gov.in/en/amalapuram-municipality
- ↑ https://www.census2011.co.in/data/town/802958-amalapuram-andhra-pradesh.html 2011 జనాభా లెక్కలు
- ↑ 4.0 4.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబర్ 2019. Retrieved 13 May 2016. Check date values in:
|archive-date=
(help) - ↑ https://amalapuram.cdma.ap.gov.in/en/municipality-profile