Jump to content

అమిగోస్

వికీపీడియా నుండి
అమిగోస్
దర్శకత్వంరాజేంద్రరెడ్డి
రచనరాజేంద్రరెడ్డి
నిర్మాత
  • నవీన్‌ ఎర్నేని
  • వై.రవిశంకర్‌
తారాగణం
ఛాయాగ్రహణంసౌందరరాజన్
కూర్పుతమ్మిరాజు
సంగీతంజిబ్రాన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీs
2023 ఫిబ్రవరి 10 (2023-02-10)(థియేటర్)
2023 ఏప్రిల్ 1 (2023-04-01)( నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

అమిగోస్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. నందమూరి కళ్యాణ్‌రామ్‌, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న చిత్రం విడుదలై,[1] ఏప్రిల్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

సిద్ధార్థ్‌ (కల్యాణ్‌రామ్‌), మంజునాథ్ (కల్యాణ్‌రామ్‌), మైఖేల్ (కల్యాణ్‌రామ్‌) అనే ముగ్గురు డోప్లర్‌గాంగ్‌లు. అంటే రక్త సంబంధం లేకుండా చూసేందుకు అచ్చం ఒకే పోలిలకలతో ఉండే వ్యక్తులు. సిద్ధార్థ్ బిజినెస్ మ్యాన్ కాగా, మంజునాథ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, మైఖేల్ గ్యాంగ్‌స్టర్. అయితే మైఖేల్‌ను పట్టుకునేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తుంటుంది. అసలు మైఖేల్‌ ఎవరు? దేశానికి వ్యతిరేకంగా అతను చేసిన కుట్రలు ఏమిటి? తన రహస్య ప్లాన్‌ను అమలు చేయడానికి అతను సిద్ధూ, మంజునాథ్‌లను ఎలా వాడుకున్నాడు? మైఖేల్‌ను ఎన్ఐఏ పట్టుకుందా? అసలు వీరి ముగ్గురు ఎలా కలిశారు ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
  • నిర్మాత: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేంద్రరెడ్డి
  • సంగీతం: జిబ్రాన్
  • సినిమాటోగ్రఫీ: ఎస్‌ సౌందర్‌ రాజన్‌
  • ఎడిటర్: తమ్మిరాజు
  • ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల
  • కొరియోగ్రాఫర్: శోభి మాస్టర్

స్పందనలు

[మార్చు]
  • "అమిగోస్ అంటే స్పానిష్ భాషలో మిత్రులు అని అర్థం. కానీ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల పాలిట శత్రువు అయ్యింది. కథాబలం లేని అమిగోస్ వీక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. కథలోని పాయింట్ కొత్తదే అయినా దానిని విస్తరించిన తీరు, కథనం ఆసక్తికరంగా లేవు" అని జాగృతి వారపత్రిక సమీక్షించింది.[5]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (6 January 2023). "అమిగోస్‌ లుక్‌!". ఒరిజినల్ నుండి 26 జనవరి 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 January 2023.
  2. TV9 Telugu (1 April 2023). "ఓటీటీలోకి వచ్చేసిన కళ్యాణ్ రామ్ సినిమా.. 'అమిగోస్' ఎక్కడ చూడొచ్చంటే." the original నుండి 3 April 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. ABP Live (10 February 2023). "'అమిగోస్' రివ్యూ : కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?". the original నుండి 26 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 March 2023.
  4. HMTV (3 May 2021). "'అమిగోస్' గా రానున్న కళ్యాణ్ రామ్". the original నుండి 27 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 January 2023.
  5. అరుణ (20 February 2023). "'అమిగోస్ ' మిత్రులు కాదు.. శత్రువు!". జాగృతి వారపత్రిక: 50.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అమిగోస్&oldid=4515679" నుండి వెలికితీశారు